Kondakintali
1.1K views
1 months ago
#My post# # Konda Kintali Stories# #సాంప్రదాయ వస్త్రధారణ# భారతదేశం అనేక సంస్కృతులు, భాషలు, మతాలు, ఆచారాల సమ్మేళనం. “వివిధతలో ఏకత్వం” అనే నినాదానికి నిజమైన రూపం భారతదేశం. ఇక్కడి సంప్రదాయాలు, ఆచారాలు మన జీవన విధానాన్ని, విలువలను ప్రతిబింబిస్తే, వస్త్రధారణ మన సంస్కృతికి కనిపించే ప్రతీకగా నిలువెత్తు నిదర్శనం నిలుస్తుంది. భారతీయ సంప్రదాయాలు తరం నుండి తరానికి మౌఖికంగా, ఆచరణ ద్వారా బదిలీ అవుతూ వచ్చాయి. పెద్దలను గౌరవించడం అతిథి దేవోభవః అనే భావన పండుగలను కుటుంబంతో కలిసి జరుపుకోవడం శుభకార్యాలు, వివాహాలు, నామకరణాలు, పూజలు వంటి ఆచార సాంప్రదాయాలు సంస్కారాలు భారతీయ జీవన తత్వానికి ఆధారాలు. దీపావళి, సంక్రాంతి, దసరా, ఈద్, క్రిస్మస్ వంటి పండుగలు మత భేదం లేకుండా సామాజిక ఐక్యతను పెంపొందిస్తాయి. భారతీయ వస్త్రధారణ యొక్క వైవిధ్యం భారతదేశంలో ప్రాంతం, వాతావరణం, సంస్కృతి ఆధారంగా వస్త్రధారణలో విస్తారమైన వైవిధ్యం కనిపిస్తుంది. స్త్రీల వస్త్రధారణ చీర, సల్వార్ కమీజ్, లెహంగా, ఘాగ్రా, మేఖలా చాదర్ వంటి సంప్రదాయ వస్త్రాలు. పురుషుల వస్త్రధారణ ధోతీ, కుర్తా, పంచె, లుంగీ, షెర్వాణీ మొదలైనవి. కానీ గ్లోబలైజేషన్ వల్ల ఫ్యాషన్ అనుకరణ పేరిట వస్త్రధారణలో ముఖ్యంగా స్త్రీల అంగాంగ ప్రదర్శనలు వెర్రితలలు వేస్తోంది. యువతను రెచ్చగొట్టే విధంగా జాతికి జుగుప్సాకరంగా మారిపోతున్నాయి. చీర కట్టు భారతీయ స్త్రీల గౌరవం, సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుంది. కాంచీపురం, బెనారస్, పోచంపల్లి, పటోలా వంటి చీరలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఇవి మన సంప్రదాయాల సమన్వయం. నేటి యువత పాశ్చాత్య వస్త్రాలను ధరించినా, పండుగలు, శుభకార్యాల్లో సంప్రదాయ వస్త్రాలనే ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నారు. ఇది భారతీయ సంస్కృతికి ఉన్న బలాన్ని సూచిస్తుంది.ఆధునికతను స్వీకరిస్తూనే సంప్రదాయాలను గౌరవించడం భారతీయుల ప్రత్యేకత. ఇది శుభపరిణామం. భారతదేశ సంప్రదాయాలు మన విలువలకు పునాది కాగా, వస్త్రధారణ మన సంస్కృతికి ప్రతిబింబం. కాలం మారినా, తరాలు మారినా, భారతీయ సంప్రదాయాలు మరియు వస్త్రధారణ మన గుర్తింపుగా నిలుస్తాయి. వాటిని సంరక్షించుకోవడం ప్రతి భారతీయుని బాధ్యత. By KondaKintali