T,Ramani Mani⭐
539 views
2 days ago
శ్రీ వేణు శ్యామల దేవీ నమః 🙏 శ్యామల నవరాత్రుల లో రాజా శ్యామలాంబికకు చెందిన మంత్ర భేదాలలో, విశిష్టత, ప్రాముఖ్యత కలిగిన అవతారాలు ఉన్నాయి.‌ అవి ఱెండు: వేణు శ్యామలా, వీణ శ్యామలా. ఇందులోని అంతరార్థం, ఈ మంత్ర భేద, తత్త్వాలనేవి శూన్యాన్ననుసరించి కాకుండా, వాయిద్యాన్ని అనుసరించి ఉంటాయి. ఈ నామాలూ ఆ అమ్మననుసరించి ఏర్పడినవే. వేణు విద్యలకు అధిష్టాత్రి వేణు శ్యామలాంబ, వీణ విద్యలకు అధిష్టాత్రి వీణ శ్యామలాంబ. వేణు వాయిద్యం కుండలినీ శక్తికి సూచిక అయితే, వీణా నాద వాయిద్యం చక్రానికి శక్తికి ప్రతీక. సాధనకు ఆలవాలం.ఇదే జీవకోటి మనుగడకు మూలం. వేణువు శ్వాస అనేది ౠలా ౙరగవలెనో, దేహం లోని వివిధ చక్రాలలో ఉండగా ఏ ఏ రీతులలో ప్రవర్తిస్తుందో తెలుపుతుంది.వాటిలో భాగంగా, విశుద్ధ చక్రములో ఉండగా, ఆ వేణువు సూచికగా, శ్వాస వాక్కు రూపంలో ఆడుతుంది.ఓ విదూషకుని చేతిలోని నాద ధ్వని లాగా, ఈ శ్వాస‌ మన కంఠంలో వాక్కు రూపంలో ఉంటుంది కనుక, శ్వాస నియంత్రణ మన చేతుల్లోనే ఉంటుంది.ఈ వేణు శ్యామలాంబ గుఱించి ఓ కథ ఉంది, "ఆ శ్రీ కృష్ణ పరమాత్మ, గోపికలందఱకూ భక్తి యొక్క మాధుర్యాన్నీ, సుధనూ అందింౘాలని ఆరాట పడి, అలా నేర్పాలంటే ఆ గోపికలు అందఱూ తన చెంతకు చేరాలని తలుస్తారు. కానీ అందుకు దారేదీ అనుకున్నప్పుడు, ఆ కృష్ణ పరమాత్మ, శ్యామలాంబను ఆరాధింౘగా, ఆమె దర్శనమిచ్చిందిట. ఆ అవతారం, వేణు శ్యామలాంబ స్వరూపం.‌ అంతే కాక, ఆ అంబ, కృష్ణ పరమాత్మకు, వేణువును అందించి, ఆ వేణువును పరమాత్మ ఊదంగనే, గోపికలంతా కృష్ణుని వశమౌతారని వరమిచ్ఛింది" అని, మహాకవి శ్రీశ్రీశ్రీ కాళిదాస విరచిత "విద్యా సర్వస్వం"లో ఉన్నది. గీతవిద్యా వినోదాతి తృష్ణేన కృష్ణేన సంపూజ్యసే" - అంటే, ఱెండు విధాలుగా ఉంటుంది గీతా విద్య, ఒకటి వేణువును ఊది గీతం ఆలపించే విద్య అయితే, ఱెండవది, భగవత్..గీత.. అందుకే ఆమె 'పూర్ణ శబ్ద'గా ఖ్యాతి గడించింది, అంతర్లీనంగా ఆమె సాహిత్య బ్రహ్మ విద్యా స్వరూపిణి, వశీకరణ విద్యాధిష్టాత్రి, ఆ విధంగా ఆమె సాధకుని చిత్తశుద్ధిని పరీక్షిస్తుంది, పరి రక్షిస్తుంది కూడా.పురుష‌ స్వరూపాన ఆమె శ్యాముడే, అంటే కృష్ణుడే. #🛕అయోధ్య రామ మందిరం🙏 #🌷గురువారం స్పెషల్ విషెస్ #🎶భక్తి పాటలు🔱 #😴శుభరాత్రి