నా💝అమ్మే👩‍👦నా కనిపించే 🙏దైవం💝
6.2K views
#✨రేపే శక్తిమంతమైన జయ ఏకాదశి: ఈ పనులు చేస్తే అన్నింట్లో జయమే రేపే శక్తిమంతమైన జయ ఏకాదశి: ఈ పనులు చేస్తే అన్నింట్లో `జయ`మే హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఏకాదశులలో ఒకటి- జయ ఏకాదశి. ఈ నెల 29న రానుంది. ఈ రోజున భక్తులు ఉపవాస దీక్షతో పాటు శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఈ వ్రతం ఆధ్యాత్మిక శుద్ధిని, దైవిక ఆశీస్సులను ప్రసాదిస్తుందని వారి ప్రగాఢ విశ్వాసం. మాఘమాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఈ పవిత్ర ఏకాదశి హిందూ సంప్రదాయంలో విశేష ప్రాధాన్యత ఉంది. ఈ వ్రతాన్ని పాటించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. జయ ఏకాదశి తిథి పంచాంగం ప్రకారం జయ ఏకాదశి తిథి 28వ తేదీ బుధవారం సాయంత్రం 4:35 నిమిషాలకు ప్రారంభమై, మరుసటి రోజు మధ్యాహ్నం 1:55 నిమిషాలకు ముగుస్తుంది. ఉదయాది తిథి ప్రకారం గురువారం ఉపవాసం పాటిస్తారు. ఉపవాస దీక్షను ముగించే పారణ శుభ ఘడియలు 30వ తేదీ శుక్రవారం ఉదయం 7:10 నుండి 9:20 గంటల మధ్య వస్తాయి. ఉపవాసం విరమించడం ఈ వ్రతాన్ని ఆచరించిన తర్వాత మరుసటి రోజు ఫలహారం చేస్తారు. జనవరి 30, శుక్రవారం ఉదయం 7:10 నుండి 9:20 గంటల మధ్య 'పారణ' (ఉపవాసం విరమించడం) చేయడానికి అనుకూలమైన సమయం. జయ ఏకాదశి పాపాలను ప్రక్షాళన చేయడానికి, అంతర్గత శాంతిని పొందడానికి, ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడానికి ముఖ్యమైనదిగా భావిస్తారు. ఏకాదశి వ్రతానికి సంబంధించిన గ్రంథాల ప్రకారం, ఈ ఉపవాసాన్ని నిష్టగా ఆచరించడం ద్వారా భక్తులు గత జన్మ కర్మల నుండి విముక్తి పొంది, విష్ణువు దైవిక అనుగ్రహాన్ని, మోక్ష సిద్ధిని పొందుతారు. పాటించాల్సినవి.. ఈ రోజున భక్తులు సాధారణంగా తెల్లవారుజామున నిద్రలేచి, స్నానం చేసి, ప్రార్థనలతో ఉపవాసం ప్రారంభించాలి. చాలా మంది నిర్జల ఉపవాసం (ఆహారం, నీరు లేకుండా) పాటిస్తారు, మరికొందరు తమ శరీర సామర్థ్యాన్ని బట్టి పండ్లు లేదా పాల ఆధారిత వ్రతాలను అనుసరిస్తారు. ఇళ్లలో, దేవాలయాలలో విష్ణు పూజలు, పవిత్ర గ్రంథాల పారాయణం, "ఓం నమో భగవతే వాసుదేవాయ" వంటి మంత్రాల జపాలు, జయ ఏకాదశి వ్రత కథా శ్రవణం జరుగుతాయి. ఉపవాసం ఉండే రోజు మాత్రమే కాదు.. జయ ఏకాదశి కేవలం ఉపవాసం ఉండే రోజు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికీ ఉండాల్సిన ఆధ్యాత్మిక స్పృహ, భక్తి ప్రపత్తులు, ధార్మిక భావాలను గుర్తుచేసే ఓ విశేష సందర్భం. భగవంతుడిపై విశ్వాసం, జీవితంలో క్రమశిక్షణ వంటివి అలవర్చుకోవడానికి ఇటువంటి సందర్భాలు ఎంతగానో ఉపకరిస్తాయి. నియమ నిష్టలతో వ్రతాలను ఆచరించడం ద్వారా భక్తులు సామరస్యం, శ్రేయస్సు, దైవిక రక్షణ ఏర్పడుతుంది. మనశ్శాంతి లభిస్తుంది.

More like this