@ విజ్జి @
899 views
20 days ago
విభూతిని ధరించి నప్పుడు మనకు ఈశ్వరుడు స్మరణకు వస్తాడు. బ్రహ్మ మన లలాటంపై లిఖించిన కీడు ఈశ్వరుని కరుణ వలన తొలగి మన బాధలు నశిస్తాయి. కనుక ప్రతివాడు ప్రాతః కాలంలో లేచి స్నానాది కాలకృత్యాలు నెరవేర్చుకొని, ఫాల భాగంపై విభూతిని ధరించి సంధ్యావందనం, దేవతారాధన చేసి ఈశ్వరకృపకు పాత్రుడై దిన దిన చర్యలకు సమాయత్తం కావాలి. విభూతి ధారణ పరమేశ్వరుని స్ఫురింపజేస్తుంది. విభూతిర్భూతిరైశ్వర్యమ్. విభూతి అంటేనే ఐశ్వర్యం. లక్ష్మీ నిలయమైన గోవు పృష్ఠ భాగాన్నుండి వెలువడే ఆవు పేడతో విభూతి తయారు చేసుకోవాలి. లక్ష్మీ గోవు యొక్క పృష్ఠ భాగంలో వున్నట్లే ఇతర దేవతలు కూడ గోవు యొక్క వివిధ శారీరక భాగాల్లో వుంటారు. కనుక గోమలానికి విశేషమైన ప్రాముఖ్యం వున్నది. దాని నుండి తయారు కాబడే విభూతి సంపదకు చిహ్నం. లక్ష్మీ ప్రధానంగా ఐదు ప్రదేశాల్లో నివసిస్తుంది. గోవు యొక్క పృష్ఠ భాగం, వివాహిత స్త్రీ యొక్క పాపట భాగం, గజం యొక్క కుంభ స్థలం, పద్మము, బిల్వ దళాలు. వినా భస్మ త్రిపుండ్రేణ వినా రుద్రాక్ష మాలయా ..! పూజితో పి మహాదేవో నా భీష్ట ఫలదాయక!! భస్మం నొసట మూడు రేఖలు ధరింపనిదే, రుద్రాక్ష మాలను కంఠమున ధరింపనిదే, శంకరుని పూజించినను భక్తుల కోరికలు నెరవేరవు. అమరేశ్వరునికి ప్రీతి పాత్రమైన విభూతిని ధరించి అశుతోషుడైన పరమేశ్వరుని కన్నీటి ధార నుండి వెలువడిన రుద్రాక్ష ధారణ చేసి, ఎవరైతే శివ ప్రీతికరమైన పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తారో వారిని అదృష్టం వెన్నంటి ఉంటుందంటారు. విభూతి - భసితరి, భస్మ, క్షారము, రక్షక, - పర్యాయ వాచక పదాలు. ఆణిమ, మహిమ, గరిమ, లఘుమ, ప్రాప్తి, ప్రాకమ్యం, ఈశిత్వం, వశిత్వం అనే అష్ట సిధ్ధులను భాసింప చేస్తుంది. కనుక భసితమైందనీ, పాపాలను భజించడం వల్ల భస్మమైంది. ఆపదల నుండి కాపాడడం వల్ల క్షారమైంది. భూత, ప్రేత పిశాచాది గ్రహ బాధల నుండి సర్వదా రక్షించేది కాబట్టి రక్ష అయ్యింది. ‘విభూతి’ని శరీరంపై పూసుకోవటం వల్ల తిర్వక్త్రిపుండ్రం పెట్టుకోవడం వల్ల స్నానం చేసిన ఫలం లభిస్తుందని వేద ప్రమాణముండడంచే సదా నొసట విభూతిని ధరించి తీరాలని, మనం పూజా కార్యక్రమాలు లాంటివి చేయక పోయినా నిత్యం విభూతి ధరిస్తే శివపూజతో సమానమని మన శాస్త్రాలు ధృవీకరిస్తున్నాయి. విభూతి ధారణ వల్ల అజ్ఞాన స్వరూపమైన అవిద్య పూర్తిగా నశించి విద్యా స్వరూపమైన విజ్ఞానం సులభతరం అవుతుందని శృతులు తెల్పితే, విభూతి ధరించే వారు దీర్ఘ వ్యాధులు లేకుండా పూర్ణాయుర్దాయ వంతులై జీవించి సునాయాస మరణాన్ని పొందుతారని, దుఃఖాలు, రోగాలు, తొలగి శుభాలను కల్గిస్తుందని పురాణాల ద్వారా మనకు విదితమౌతుంది. విభూతి మూడు విధాలు... ‘శ్రౌతము’ అంటే చెప్పబడిన విధి విధానంతో, అంటే వేదములలో నిర్ణయింపబడినట్లుగా యజ్ఞ యాగాదులు చేసి, ఆ హోమాదుల వల్ల ఏర్పడిన భస్మం. ‘స్మార్తము’ అంటే నిత్యాగ్ని హోత్రాదులు చేయగా ఏర్పడిన భస్మం. ‘లౌకికము’ ఆవు పేడను కాల్చడం ద్వారా తయారైన భస్మము. ఇలా మూడు విధాలైన భస్మములను పవిత్రమైన ‘విభూతి’గా భావిస్తారు. వైరాగ్యమునకు, నిర్లిప్తతకు ప్రతీకగా భస్మమును భావించి త్రిపుండ్ర ధారణ చేయుట సర్వోత్తమము. సర్వ సృష్టికి హేతు భూతమైన నిత్య చైతన్య శక్తికి చిహ్నంగా మనం విభూతి ధారణ చేస్తాం. ప్రపంచంలో ప్రతి విషయం శివమయమని, అదే మనకు అంతిమ లక్ష్యమని విభూతి విశదీకరిస్తుంది. ఒక వస్తువును కాలిస్తే, అది ముందు నల్లగా మారుతుంది. దాని నింకా కాలిస్తే అది తెల్లటి బూడిదగా పరిణమిస్తుంది. దాన్ని ఇంకా కాల్చిన దానిలో మార్పు ఏమీ సంభవించదు. కనుక అన్ని రకాలైన దేహాల యొక్క చరమ స్థితి బూడిద మాత్రమే. కనుక భౌతిక రంగంలోని విభూతి ఆధ్యాత్మిక రంగంలో శివునితో సామ్య స్థితి కల్గియున్నది. విజ్ఞానమనే అగ్నిగుండంలో మనం ప్రతి వస్తువును కాలిస్తే చివరకు మిగిలేది శివుడు లేక పరబ్రహ్మము మాత్రమే.... #"భక్తి సమాచారం" #🙏భక్తి స్పెషల్ #🙏🏻భక్తి కోట్స్📝 #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status