nvs subramanyam sharma
674 views
15 days ago
🌿🌼 ఓం గం గణపతయే నమః 🌼🌿 🌿🌼దారిద్ర్య దహన గణపతి స్తోత్రం ప్రతీరోజూ పఠిస్తే శ్రీ గణేశుని అనుగ్రహం వలన అన్ని అష్టైశ్వర్యాలు చేకూరుతాయి🌼🌿 🌿🌼మనం ఏ కార్యం తలపెట్టినా, అది ఎటువంటి అవరోధాలు కలుగకుండా, విజయవంతంగా కొనసాగాలని ప్రప్రథమంగా శ్రీ విఘ్నేశ్వరుని ప్రార్ధిస్తాము. సకల శుభాలనూ అనుగ్రహించే ఈ గణపతి స్తోత్రం భక్తి శ్రద్ధ విశ్వాసాలతో పఠిస్తే, శ్రీ గణేశ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ప్రతీరోజూ ఈ మహామహిమాన్వితమైన స్తోత్రాన్ని పఠించి, గణేశ అనుగ్రహం పొందుదాం🌼🌿 🌿🌼దారిద్ర్య దహన గణపతి స్తోత్రం🌼🌿 సువర్ణ వర్ణ సుందరం సితైక దంత బంధురం గృహీత పాశ మంకుశం వరప్రదా భయప్రధం చతుర్భుజం త్రిలోచనం భుజంగ మోపవీతినం ప్రపుల్ల వారిజాసనం భజామి సింధురాననః కిరీట హార కుండలం ప్రదీప్త బాహు భూషణం ప్రచండ రత్న కంకణం ప్రశోభితాంఘ్రి యష్టికం ప్రభాత సూర్య సుందరాంబర ద్వయ ప్రధారిణం సరత్న హేమనూపుర ప్రశోభి తాంఘ్రి పంకజం సువర్ణ దండ మండిత ప్రచండ చారు చామరం గృహ ప్రదేందు సుందరం యుగక్షణ ప్రమోదితం కవీంద్ర చిత్తరంజకం మహా విపత్తి భంజకం షడక్షర స్వరూపిణం భజే గజేంద్ర రూపిణం విరించి విష్ణు వందితం విరుపలోచన స్తుతం గిరీశ దర్శనేచ్చయా సమార్పితం పరాంబయా నిరంతరం సురాసురైః సుపుత్ర వామలోచనైః మహామఖేష్ట కర్మను స్మృతం భజామి తుందిలం మదౌహ లుబ్ధ చంచలాళీ మంజు గుంజితా రవం ప్రబుద్ధ చిత్తరంజకం ప్రమోద కర్ణచాలకం అనన్య భక్తి మాననం ప్రచండ ముక్తిదాయకం నమామి నిత్య మాదరేణ వక్రతుండ నాయకం దారిద్ర్య విద్రావణ మాశు కామదం స్తోత్రం పఠెదేత దజస్ర మాదరాత్ పుత్రీ కళత్ర స్వజనేషు మైత్రీ పుమాన్ భవే దేకదంత వరప్రాసాదాత్ ఇతి దారిద్ర్య దహన గణపతి స్తోత్రం సంపూర్ణం 🌿🌼🙏ఓం గం గణపతయే నమః🙏🌼🌿 #🌅శుభోదయం #🙏🏻బుధవారం భక్తి స్పెషల్ #🌷బుధవారం స్పెషల్ విషెస్ #🙏దేవాలయాల్లో గణపతి ఉత్సవం #🙏శ్రీ వరసిద్ధి వినాయక స్వామి🕉️