*ఆదికాండము 28:15 “నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను…”*
ఈ వాక్యం దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చిన అత్యంత అద్భుతమైన వ్యక్తిగత భరోసా. యాకోబు ఒంటరిగా, భయంతో, ప్రయాణిస్తున్న సమయంలో దేవుడు ప్రత్యక్షమై చెప్పిన మాట ఇది. పరిస్థితులు అనుకూలంగా లేవు, భవిష్యత్తు స్పష్టంగా లేనప్పుడు. దేవుడు చెప్పింది ఒకటే “నీవు ఎక్కడికి వెళ్ళినా నేను నీతోనే ఉన్నాను.” ఇది కేవలం ఆ రోజున యాకోబుకు మాత్రమే కాదు, ఈ రోజున మనందరికీ వర్తించే వాగ్దానం. మన జీవితం మార్గమధ్యంలో ఉన్నప్పుడు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, భవిష్యత్తు గురించి భయం కలిగినప్పుడు దేవుడు చెబుతున్నాడు. “నేను నిన్ను కాపాడుతాను.” అంటే మన బలం మీద, మన తెలివి మీద కాదు. దేవుని సన్నిధి మీద మన ప్రయాణం ఆధారపడి ఉంది. ఆయన మన అడుగులను, మన కన్నీటిని చూస్తున్నాడు, మన భవిష్యత్ తన చేతుల్లో ఉంచుకున్నాడు. అందుకే భయపడాల్సిన అవసరం లేదు.
ఈ రోజు మనకు కావలసింది ఒక్కటే ఈ వాగ్దానాన్ని ధైర్యంగా నమ్మడం. మార్గం, కష్టం ఏదైన దేవుడు ముగింపు విజయాన్నివ్వడం.
దేవుడు ఈ వాగ్ధానము మీ జీవితంలో నెరవేర్చును గాక!. 🙏
http://youtube.com/post/Ugkx1O5RHTfUgbE80-cCV0id_7ljJvvW9hTS?si=QqJL30Z870vzBkp
#✝జీసస్ #🌅శుభోదయం #🙆 Feel Good Status #😇My Status #💪పాజిటీవ్ స్టోరీస్ -