PSV APPARAO
689 views
4 months ago
#తిరుమల సమాచారం తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు 👆 శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ తిరుపతి, 2025 సెప్టెంబర్ 04: తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో గురువారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ నిర్వహించారు. ఉదయం కల్యాణ మండపం నందు స్నపన తిరుమంజనం, శాత్తుమొర, ఆస్థానం చేపట్టారు. అనంతరం జాప్యం, మూలవర్లకు, ఉత్సవర్లకు ఉపసన్నిధి నుందు పవిత్ర సమర్పణ, విమాన ప్రాకారం, ధ్వజస్తంభం మరియు మాడ వీధులలో శ్రీ మఠం ఆంజనేయ స్వామి వారి ఆలయం వరకు తిరువీధి ఉత్సవం చేపట్టారు. సాయంత్రం ఉత్సవ మూర్తులకు తిరువీధి ఉత్సవం చేపట్టారు. రాత్రి యాగశాలలో పలు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ పెద్ద జీయర్, శ్రీ శ్రీ చిన్న జీయర్లు, టిటిడి డిప్యూడీ ఈవో శ్రీ వి.ఆర్. శాంతి, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ లు, ఆలయ ఇస్పెక్టర్లు , అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.