#🗞ప్రభుత్వ సమాచారం📻 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ముమ్మిడివరం(సి.హెచ్.సి)సామాజిక ఆరోగ్య కేంద్రంలోని ఎయిడ్స్ నియంత్రణ యూనిట్ అయిన ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్ (ఐ.సి.టి.సి) మరియు ఎం.జి.ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల రెడ్ రిబ్బన్ క్లబ్(ఆర్.ఆర్.సి) సంయుక్త ఆధ్వర్యంలో “ఎయిడ్స్ దినోత్సవ” అవగాహన ర్యాలీ, మానవహారం మరియు ఎయిడ్స్ వ్యాధిపై ప్రమాణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిపై సమాచారం తెలుసుకొని సురక్షితంగా ఉండాలని ఈ సంవత్సరం అంశం అయిన “హెచ్.ఐ.వి. పరీక్ష చేయించుకోండి, సమాచారం తెలుసుకోండి, సురక్షితంగా ఉండండి” పై ప్రజలకు మరియు విద్యార్థులకు అవగాహన కల్పించారు. వైద్య సిబ్బంది ఆర్.ఆర్.సి వాలంటీర్స్ మరియు విద్యార్థులు ఎయిడ్స్ వ్యాధిపై నినాదాలుతో ర్యాలి చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ అవగాహన ర్యాలి ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి మెయిన్ రోడ్డు మీదుగా పోలీస్ స్టేషన్ వరకు సాగింది, అక్కడ మానవహారం నిర్వహించి, వైద్య సిబ్బంది, విద్యార్థులచే ఎయిడ్స్ వ్యాధి పై ప్రతిజ్ఞ చెయ్యడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ వై.లోకేష్, డా.ఎన్.నితీష్ కుమార్, డా.ఎ.నిఖిత, డా.జి.కుమార్, ఐ.సి.టి.సి.కౌన్సిలర్ ఎం.దుర్గాప్రసాద్, టెక్నీషియన్ ఆర్.అనిల్ కుమార్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పి.లక్ష్మి ప్రశాంతి, ఆర్.ఆర్.సి. కోఆర్డినేటర్ కె. శ్రీనివాసరావు, ఆసుపత్రి సిబ్బంది ఆర్.దుర్గాబాయి, కె. మంగతయారు, ఎన్.సత్యనారాయణ, మీరాసాహెబ్, సంపూర్ణ, భారతి, రమణి, మెర్సీ, బాలాజీ, అధ్యాపకులు కె.దుర్గాప్రసాద్, యు.కిరణ్ కుమార్,అలెర్ట్ మరియు పీపుల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు కె.వెంకటేశ్వరరావు, కె.కార్తీక్ వైద్య సిబ్బంది, ఎ.ఎన్.ఎం.లు ఆశ వర్క్, ఆర్.ఆర్.సి వాలంటీర్స్ విద్యార్థులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..
___________________________
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :-
ముమ్మిడివరం - నియోజకవర్గం
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼