P.Venkateswara Rao
848 views
##💑భార్యా భర్తల అనుబంధం Hug Theraphy: *రోజుకి "8" సార్లు చేయండి..మీ టెన్షన్, బాధలు అన్నీ హుష్ కాకీ..ఓపెన్ గా చెప్తున్న డాక్టర్లు ❗* Thota Jaya Madhuri 20/09/2025🫂 ప్రస్తుతం మనం జీవిస్తున్న ఈ వేగవంతమైన సోషల్ మీడియా యుగంలో భార్యాభర్తలు కూడా ఒకరితో ఒకరు కూర్చొని ఒక గంట ప్రశాంతంగా మాట్లాడుకునే సమయం దొరకడం చాలా కష్టం అయిపోయింది. ఉదయం నిద్రలేచిన క్షణం నుంచి రాత్రి పడుకునే వరకూ ఉరుకులు పరుగులు తప్ప మరేమీ లేవు. ఎవరి పనులు వాళ్ళవి, ఎవరి టెన్షన్స్ వాళ్ళవి – ఈ పరిస్థితి ఇప్పుడు దాదాపు ప్రతి ఇంట్లో కనిపించే సాధారణ దృశ్యం. ఇలాంటి ఒత్తిడితో నిండిన జీవితంలో చాలా చిన్న వయసులోనే అనేక మంది అనారోగ్యానికి గురవుతూ, చివరకు హార్ట్ ఎటాక్స్ వంటి తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. 35 నుండి 45 సంవత్సరాల వయస్సులో ఉన్న వారు హార్ట్ ఎటాక్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలను మనం వార్తలలో తరచుగా వింటూనే ఉన్నాం. డాక్టర్లు స్పష్టంగా చెబుతున్నారు – స్ట్రెస్ అనేది ఆరోగ్యానికి అత్యంత హానికరం. షుగర్, బీపీ ఎంత ప్రమాదకరమో, వాటికంటే ఎక్కువ ప్రమాదకరమైనది స్ట్రెస్ అని చెబుతున్నారు. మన శరీరంలో హార్మోన్లు సమతుల్యం కావాలంటే, కొన్ని ముఖ్యమైన పనులు తప్పనిసరిగా చేయాలి అని వైద్యులు సూచిస్తున్నారు. అందులో ఫిజికల్ యాక్టివిటీ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా చెప్పబడింది. రోజూ జాగింగ్ చేయడం, వాకింగ్ చేయడం, ఎక్సర్సైజులు చేయడం ద్వారా మన శరీరంలో పాజిటివ్ హార్మోన్లు ఎక్కువగా విడుదల అవుతాయి. ఇవి మన శరీరానికి మాత్రమే కాకుండా మానసిక ప్రశాంతతకు కూడా చాలా అవసరం.అదేవిధంగా మైండ్ రిలాక్సేషన్ కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మనం మానసికంగా ప్రశాంతంగా ఉండకపోతే, శరీరానికి సంబంధించిన అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ నేపథ్యంలో ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా ఒక ఆసక్తికరమైన అధ్యయనం చేసింది. అందులో “హగ్ థెరపీ” అనేది మానసిక ఆరోగ్యానికి అద్భుత ఫలితాలను ఇస్తుందని తేలింది. ఒకరినొకరు హగ్ చేసుకోవడం వలన మన శరీరంలో ఆక్సిటోసిన్ అనే లవ్ హార్మోన్ విడుదల అవుతుంది. దీన్ని చాలామంది తెలియకుండా ఉంటారు. ఈ హార్మోన్ విడుదలవడం వలన మన మనసులో ఉన్న టెన్షన్, బాధలు, ఒత్తిడి అన్నీ తేలికవుతాయి. ఒక్కసారిగా మనసు ప్రశాంతంగా మారుతుంది. డాక్టర్లు చెబుతున్న దాని ప్రకారం, రోజుకు కనీసం 4 నుంచి 8 సార్లు హగ్ చేసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా మారి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా స్ట్రెస్ మొత్తం తగ్గిపోతుంది.హగ్ మాత్రమే కాదు, మనం ఒకరిని ఒకరు చిరునవ్వుతో పలకరించడం, స్నేహపూర్వకంగా మాట్లాడటం కూడా మానసిక ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. అసలు మనకు పరిచయం లేని వారితో కూడా చిరునవ్వుతో మాట్లాడటం, పలకరించడం వలన మనలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. కానీ మనకు దగ్గరైన వారిని, ముఖ్యంగా మన జీవిత భాగస్వామిని హగ్ చేసుకోవడం వలన మన సంబంధాలు మరింత బలపడటమే కాకుండా, మానసిక ఆరోగ్యానికి, శారీరక ఆరోగ్యానికి రెండింటికీ చాలా మేలు జరుగుతుంది. అందువల్ల, డాక్టర్లు సూచిస్తున్న ఒక ముఖ్యమైన సందేశం ఏమిటంటే – మీకు వీలైతే ఎన్ని సార్లు సాధ్యమైతే అన్ని సార్లు మీ స్వీట్ భాగస్వామిని హగ్ చేసుకోండి. ఇది మీ ఆరోగ్యానికి కూడా మంచిది, మీ వైవాహిక జీవితానికి కూడా బలమైన పునాది వేస్తుంది.