nvs subramanyam sharma
2.2K views
4 months ago
శ్రీ శిరిడీ సాయిబాబా వారు స్వయంగా మరాఠీ లో చెప్పిన ఏకాదశ సూత్రాలు..👍💐 శ్రీ సాయినాధ్ మహరాజ్ వారి ఏకాదశ సూత్రాలు సాయి హారతులలో ’అనంతా తులాతే కసేరే స్తవావే’ అన్న నమస్కారాష్టకాన్ని వ్రాసిన శ్రీ మోహినీ రాజ్ పండిట్ అభంగ రూపంలో వ్రాసారు. ఆరతి తర్వాత షిరిడీ సంస్థానంలో ఆ అభంగాన్ని వినిపిస్తూ వుంటారు. అయితే సాయి ఏకాదశ సూత్రాల పేరిట ప్రాచుర్యంలో వున్న సూత్రాలకివి భిన్నంగా వుంటాయి. సాయి భక్తుల సౌకర్యార్దం శ్రీ మోహినీ రాజ్ పండిత్ వ్రాసిన మరాఠీ అభంగాన్ని దానికి శ్రీ స్వామి అచలానంద సరస్వతి చేసిన తెలుగు అనువాదాన్ని ఇక్కడ.. సాయి ఏకాదశ సూత్రాలు. మరాఠీ మూలం: శ్రీ మోహినీ రాజ్ పండిత్ తెలుగు సేత: స్వామి అచలానంద సరస్వతి శిరిడీస్ జ్యాచే లాగతీళ్ పాయ్! టకతీ అపాయ్ సర్వ త్యాంచే!! 1 1.శిరిడీలో అడుగు పెట్టిన తక్షణమే! తొలగిపోవును భక్తుల సర్వ అపాయాలు!! మాఝ్యా సమాధీచీ పాయరీ చఢేల్! దుఃఖ్ హేఁ – హఠేల్ నర్వ త్యాంచే 2 2.నా సమాధి వేదికను ఎక్కిన వెనువెంటనే! హరియించును భక్తుల సర్వ దుఖాలు!! జరీ హేఁ శరీర్ గేలోఁ మీ టాకూన్! తరీ మీ దాఁవేన్ భక్తాం సాఠీం!! 3 3.ఈ శరీరాన్ని నేను వదిలి వెళ్ళిపోయినా! వస్తాను పరుగు పరుగున భక్తుల హితం కోసం!! నవసాన్ మాఝీ పావేల్ సమాధీ! ధరా ధృఢ్ బుద్ధీ మాఝ్యాఠాయాం!! 4 4.ప్రాప్తిస్తాయి నా సమాధిలో మీ కోరికలన్నీ కూడా! ఉంచండి నా యందు మీ ధృఢ విశ్వాసం!! నిత్య మీ జీవంత, జాణా హేఁచి సత్య! నిత్య గ్యా ప్రచీత అనుభవే!! 5 5.నిత్యం జీవించే వుంటాను నేను ఇది పరమ సత్యం! స్వానుభవంతో తెలుసుకోండి ఇదే సత్యమని నిత్యం!! శరణ్ మజ్ ఆలా, ఆణి వాయాం గేలా! దాఖ్ వా దాఖ్ వా ఐసా కోణీ!! 6 6.నన్ను శరణ కోరి నిరాశులై మరలిన వారిని! ఒక్కరిని ఒక్కరినైనా ఎవరైనా నాకు చూపండి!! జోజో, మజ్ భజే, జైశా జైశా భావేఁ! తైసా తైసా పావేఁ, మీహీ త్యాసీ!! 7 7.ఎవరెవరు నన్ను ఏలా ఏలా భావించి భజిస్తారో! వారి వారికి నేను అలా అలానే ప్రాప్తిస్తాను!! తుమ్ చా మీ భార్ వాహీన్ సర్వధా! నన్హే హేఁ అన్యధా వచన్ మా ఝే!! 8 8.మీ భారాన్ని నేను వహిస్తాను సర్వధా! ఈ నామాట కానే కాదు ఎప్పుడూ అన్యధా!! జాణా ఏథేఁ ఆగ్/ఎ సాహాయ్య సర్వాంస! మాగే జేజే త్యాస తేఁ తేఁ లాభే!! 9 9.అందరికీ లభిస్తుంది ఇక్కడ నా సహాయం! ఎవరెవరికి ఏమేమి కావాలోఅవన్నీ దొరుకుతాయి!! మాఝా జో జాహ్ లా కాయావాచామనీఁ! తయాచా మీ ఋణీ సర్వకాళ్!! 10 10.కాయా వాచా మనసుతో నాకంకితమైన వారికి! ఎల్లప్పటికీనేను ఋణపడి వుంటాను!! సాయీఁ మ్హణే తోచి తోచి ఝాలా ధన్య్! ఝాలా జో అనన్య మాఝ్యా పాయీఁ!! 11 11.నా చరణాల్లో అనన్య భక్తితో అంకితమైన వారు! వారే సుమా ధన్యులు ఇదే నా వచనం!! 🌿🌼🙏ఓం శ్రీ సాయిరామ్..🙏🌼🌿 #🌅శుభోదయం #🌷గురువారం స్పెషల్ విషెస్ #🙏🏻గురువారం భక్తి స్పెషల్ #🙏🌹ఓం షిర్డీ సాయి నాధ్🌹🙏 #🌿🌼🙏ఓం శ్రీ షిర్డీ సాయినాధః నమః🙏🌼🌿