🌿♥️🌹🧿 యద్భావం తద్భవతి🧿🌿🌹♥️🧿
697 views
4 months ago
*అనంత పద్మనాభ చతుర్దశి (వ్రత) శుభాకాంక్షలు* భాద్రపదమాసంలో శుద్ధ చతుర్దశి తిథినాడు వినాయక నిమజ్జనం జరుగుతుంది. నవరాత్రులు పూర్తవుతాయి. ఆ రోజునే విష్ణుభక్తులు అనంత పద్మనాభ చతుర్దశిగా నిర్వహించుకుంటారు. పద్మాన్ని నాభి యందు కలిగి ఆదిశేషునిపై శయనించిన మహారూపం అనంత పద్మనాభుడు. 'అనంత శయన మాహాత్మ్య'మనే గ్రంధం అనంతపద్మనాభ స్వామి వ్రతాన్ని, దర్శన వైభవాన్ని వివరించింది. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం అనంత పద్మనాభ వ్రతం. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందటానికి ప్రధాన సాధనం. ఇది దంపతులు చేయవలసిన వ్రతం. భాద్రపద శుద్ధ చతుర్దశిని అనంత చతుర్దశి అని, అనంత పద్మనాభ చతుర్దశి అని భవిష్య పురాణం పేర్కొంది. భాద్రపద శుద్ధ చతుర్దశినాడు ఇంటిని శుభ్రపరచి అష్టదళ పద్మమంటపంపై కలశం లేదా దర్భలపై అనంత స్వామిని ప్రతిష్టించాలి. ఆవాహనాది షోడశోపచార పూజ చేయాలి. వ్రత దీక్ష నియమాన్ని స్వీకరించిన వారు ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఆచరించాలి. అలా కుదరని పక్షంలో ఎవరైనా వ్రతంలో ఉంచిన తోరాలనైనా ఖచ్చితంగా ధరించాలి. ___________________________________________ #🕉️ అనంత పద్మనాభ స్వామి 🙏 #అనంత పద్మనాభస్వామి వ్రత శుభాకాంక్షలు #🌅శుభోదయం #✌️నేటి నా స్టేటస్ #🌸శనివారం స్పెషల్ స్టేటస్