Pasupulla Pullarao
520 views
3 months ago
Pasupula Pullarao...8919291603... సృష్టికర్త మామిడికాయలు, కారం, ఉప్పు ఇస్తాడు కాని పచ్చడి పెట్టీ ఇవ్వడు...పెట్టుకోవాల్సిన అవసరం మనుష్యులకే... అలాగే మనసు, ఆత్మ,అలోచనలు,సమయం కూడా ఇచ్చాడు... పాజిటివ్ ఆలోచనలు చేయడం మాత్రం మానవులే... సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కొంత సమయాన్ని సరైన సాధన కోసం ప్రాముఖ్యత ఇవ్వండి.. అధ్యాత్మిక రంగంలో ముఖ్యంగా సరైన సాధన కు ప్రాముఖ్యత ఇవ్వాలి... మిగతావన్నీ పిట్ట కథల మార్గాలే... ఎవరు ఎవరిని ఉద్దరించలేరని, ఎవరిని వారే ఉద్దరించుకోవలని అధ్యాత్మిక గురువులు చెప్పే మొట్ట మొదటి అధ్యాత్మిక సత్యం... సత్యం ఎపుడు సత్యంగా నే ఉంటుంది... ఆ సత్యాన్ని గ్రహించిన మానవులు అధ్యాత్మిక రంగంలో ఉజ్జ్వల తారలు గా ఎదిగిపోతరు... ముఖ్యంగా కొత్త సాధకులు తెలుసుకోవాల్సింది ధ్యానం ఎలా చేయాలో అని మాత్రమే.. తెలుసుకున్న సాధన చేయాలి తప్ప మరో డొంక తిరుగుడు మార్గాలు ఉండవు.. బ్రహ్మ ముహూర్తంలో సాధన గురించి, ధ్యాన సాధన గురించి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఎన్నెన్నో పరిశోధనలు జరిగాయి,జరుగుతున్నాయి.. అన్నింటికీ మూల కారణం మనస్సే... మనసు చేసే మంచి ఆలోచన ద్వారా స్వర్గం, చెడు ఆలోచన ద్వారా నరకం... భౌతిక ప్రపంచంలో మనుష్యులు ద్వారా కూడా కొన్ని కొన్ని కారణాల వలన ఆలోచనలలో కూడా మార్పులు చేర్పులు సహజం... ఇక్కడ నమ్ముకోవల్సింది ఆత్మను, ఆత్మ శక్తి సామర్థ్యాలు గురించి మాత్రమే... అందుకు సరైన సాధన దోహద పడుతుంది... కష్ట సుఖాలకు కారణం నేనే అనే acceptance తో ఉండాలి... ప్రతి సమస్యకూ కాలమే సమాధానం చెబుతుంది... అంత వరకు ధ్యాన సాధన కొనసాగించడమే తక్షణ కర్తవ్యం. #😇My Status