Rochish Sharma Nandamuru
1.7K views
2 months ago
_*నాగుల చవితి, వల్మీక పూజ*_ *నేటి మాట* 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 *ఓం సర్వ జగద్రక్షాయ గురు దత్తాత్రేయ* *శ్రీ పాద శ్రీ వల్లభ పరబ్రహ్మాణేినమః* శ్రీపాదులు భక్తులకు తెలిపిన ద్వాదశ అభయ వాక్యములు శ్రీపాదులవారు దత్తదాసుని యింట పలికిన వచనములను శ్రద్ధగా ఆలకింపుము. 1. నా చరిత్ర పారాయణము చేయబడు ప్రతిచోట నేను సూక్ష్మ రూపమున ఉందును. 2. మనోవాక్కాయ కర్మలచే నాకు అంకితమైన వానిని నేను కంటికి రెప్పవలె కాపాడు చుందును. 3. శ్రీ పీఠికాపురమున నేను ప్రతినిత్యము మధ్యాహ్న సమయమున భిక్ష స్వీకరించెదను. నా రాక దైవరహస్యము. 4. సదా నన్ను ధ్యానించు వారి కర్మలను, అవి ఎన్ని జన్మజన్మాంతరముల నుండి ఉన్నవి అయిననూ వానినన్నింటినీ భస్మీపటలము గావించెదను. 5. అన్నమో రామచంద్రా అని అలమటించు వారికి అన్నము పెట్టినచో నేను ప్రసన్నుడనయ్యెదను. 6. నేను శ్రీపాద శ్రీవల్లభుడను! నా భక్తుల యింట మహాలక్ష్మి తన సంపూర్ణ కళలతో ప్రకాశించును. 7. నీవు శుద్ధాంతఃకరణుడవేని నా కటాక్షము సదా నీ యందు ఉండును. 8. నీవు ఏ దేవతా స్వరూపమును ఆరాధించిననూ, ఏ సద్గురువును ఆలంబనముగా చేసికొన్ననూ నాకు సమ్మతమే! 9. నీవు చేయు ప్రార్థనలన్నియునూ నాకే చేరును. నీవు ఆరాధించు దేవతాస్వరూపము ద్వారాను, నీ సద్గురువు ద్వారాను నా అనుగ్రహమును నీకు అందచేయబడును. 10. శ్రీపాద శ్రీవల్లభుడనిన పరిమితమయిన యీ నామరూపము మాత్రమే కాదు. సకల దేవతా స్వరూపములను, సమస్తశక్తులను అంశలుగా కలిగిన నా విరాట్ స్వరూపమును అనుష్ఠానము ద్వారా మాత్రమే నీవు తెలుసుకొనగలవు. 11. నాది యోగసంపూర్ణ అవతారము. మహాయోగులు, మహాసిద్ధ పురుషులు సదా నన్ను ధ్యానించెదరు. వారందరునూ నాయొక్క అంశలే. 12. నీవు నన్ను ఆలంబనముగా చేసుకున్న యెడల నేను నీకు ధర్మమార్గమును, కర్మ మార్గమును బోధించెదను. నీవు పతితుడవు కాకుండా సదా నేను కాపాడెదను. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సర్వం శ్రీ పాద శ్రీ వల్లభ చరణారవిందమస్తు 🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴 #🌅శుభోదయం #🙏🏻శనివారం భక్తి స్పెషల్ #🌸శనివారం స్పెషల్ స్టేటస్ #🙏నేడే నాగుల చవితి🐍 #🐍నాగులచవితి🐍శుభాకాంక్షలు🙏