🌿🌼🙏తిరుమలలో తొలి దర్శనం చేసుకోవలసినది శ్రీ భూవరాహ స్వామివారు🙏🌼🌿
🌿🌼🙏శ్రీ భూవరాహస్వామి ఆలయం, తిరుమల🙏🌼🌿
దేవాలయం తెరచు వేళల ఉదయం 5:00 గంటలనుండి మద్యహాన్నం: 12:00 వరకు, తరువాత 4:00 నుండి రాత్రి 9:00 వరకు
🌿🌼🙏శ్రీ వరాహస్వామి ఆలయం లేదా భూ వరాహస్వామి ఆలయం, ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లా తిరుమలలో ఉన్న వైష్ణవాలయం. ఈ రాతి ఆలయం స్వామి పుష్కరిని యొక్క ఉత్తర ఒడ్డున ఉంది మరియు వెంకటేశ్వర ఆలయం యొక్క ఉత్తర మాడా వీధి నుండి చేరుకోవచ్చు🙏🌼🌿
🌿🌼🙏తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయువ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీవరాహ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం వెంకటేశ్వర మందిరం కంటే పురాతనమైనదని భావిస్తారు అందువల్లనే వేంకటాచలం వరాహ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది🙏🌼🌿
🌿🌼🙏పురాణాల ప్రకారం, హిరణ్యక్ష అనే రాక్షసుడి నుండి భూమిని రక్షించిన తరువాత , విష్ణువు యొక్క పంది అవతారం వరహా స్వామి పుష్కరిని యొక్క ఉత్తర ఒడ్డున ఉన్న ఈ కొండపై ఉండిపోయింది. అందువల్ల తిరుమల కొండలను ఆదివరాక్షేత్ర అని కూడా అంటారు🙏🌼🌿
🌿🌼🙏వైకుంఠం నుండి వచ్చిన శ్రీనివాసునికి ఇక్కడ స్థలాన్ని ఇచ్చినందున వరాహస్వామికి తొలిదర్శనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేట్లు రాగిరేకు పైన వేంకటేశ్వరుడు రాసి ఇచ్చాడు. ఆ రాగిరేకును నేటికీ రూ.3 హారతి టిక్కట్టు కొన్న భక్తులకు హారతి సమయంలో చూపిస్తారు🙏🌼🌿
🌿🌼🙏ఈ తిరుమల క్షేత్రంలో యాత్రికులు భక్తులు మొదట వరాహ స్వామి వారిని దర్శించక పోతే యాత్రా ఫలం దక్కదు అని చెపుతారు. ఈ ఆలయాన్ని క్రీ.శ 1535 లో పెద్ద తిరుమలాచార్య పునరుద్ధరించాడు వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం ఈ గుడిలో రోజువారీ పూజలు జరుగుతాయి🙏🌼🌿
🌿🌼🙏వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామికి చక్రస్నానం కార్యక్రమం జరుగుతుంది. వరాహస్వామి ఆలయ ముఖ మండపంలో వైకుంఠ ద్వాదశి, రథసప్తమి పండుగలు నిర్వహిస్తారు. వరాహ జయంతిని కూడా జరుపుతారు🙏🌼🌿
🌿🌼🙏ఇల్లు కట్టుకోవాలనే కోరిక, ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ అనేక కారణాల చేత సొంత ఇంటి కల కుదరక పోవచ్చు.సొంత ఇల్లు ఒక్కటే కాదు, స్థలాలు,భూములు,ఇళ్ళు కొనాలన్నా, అమ్మాలన్నా అడ్డంకులు తొలగడానికి ప్రతి రోజు పూజలో భాగంగా ఈ స్తోత్రాన్ని కూడా చేర్చుకోని, ఈ స్తోత్రమును రోజూ 9సార్లు మండలం రోజులు పఠించాలి🙏🌼🌿
ఓం శ్రీ భూవరాహ స్వామినే నమః🙏
#"భక్తి సమాచారం" #🙏🏻భక్తి కోట్స్📝 #🙏భక్తి స్పెషల్ #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status