Vemulawada Rajanna SRRSD
1.5K views
5 months ago
*వేములవాడలో బద్ది పోచమ్మ తల్లికి బోనాల సందడి 19 08 2025* వేములవాడ పట్టణంలోని ప్రసిద్ధ బద్ది పోచమ్మ తల్లి ఆలయం మంగళవారం నాడు భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారికి ఇష్టమైన మంగళవారం సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి బోనాలు సమర్పించారు. "అందరిని చల్లగా చూడు బద్ది పోచమ్మ తల్లి" అంటూ భక్తుల జైజయకారాలతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. సంప్రదాయ డప్పుల ధ్వనులు, పల్లకీ ఊరేగింపులు, రంగురంగుల బోనాలతో వేములవాడ ఒక భక్తి పర్యాటక క్షేత్రంలా అలరించింది. భక్తులు నమ్మకంతో బోనాలు సమర్పించగా, ఆలయ అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కలిగించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేయడంతో, ఆలయ పరిసరాలు సందడి మరియు శోభతో నిండి ఉండిపోయాయి. #అమ్మవారు