Vemulawada Rajanna SRRSD
3.1K views
5 months ago
*వేములవాడలో భక్తుల పోటెత్తు – 52,884 మంది దర్శనం (18-08-2025)* శ్రావణ మాసం 4వ సోమవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని 52,884 మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి రాధాబాయి తెలిపారు. పవిత్ర సోమవారం సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు ముందుగా ఆలయ ధర్మగుండంలో పవిత్ర స్నానం ఆచరించి, అనంతరం కోడె మొక్కులు, చండీ హోమం, నిత్య కల్యాణం, సత్యనారాయణ వ్రతం, కుంకుమ పూజ వంటి అనేక మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. భారీ రద్దీకి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించారు. #🕉️హర హర మహాదేవ 🔱