కృష్ణ చైతన్యం 💓💖🙏
613 views
8 days ago
Hare Krishna Prabhu dawat pranam 👃 Date 8th Monday December 2025 Topic ; అమృతవాణి అనే గ్రంథం ఆధారంగా speaker ; Chaitanya Krishna Prabhu 1. ఈరోజు మన పూర్వాచార్యులు, మన గ్రాండ్‌ఫాదర్ – తాతగారు తిరోభవ దినోత్సవం. *మన శరీర తాతగారు ఉంటే ఆయన దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు మనకు ఆస్తి వదిలి వెళ్తారు*. మనకు తాతగారు అంటే ఎంత ఇష్టం ఉంటుందో, ఆ ఫీలింగ్ అందరికీ సహజమే.అయితే నిజంగా తాతగారు మనతో ఉండరు…అదేవిధంగా పూర్వాచార్యులైన మన తాతగార్లు కానీ అమృతమైన వారి ఆస్తి మనకు ఇచ్చారు అది మాత్రమే మనతో ఉంటుంది. 2. మన గురువుల తండ్రి, మన “ఆధ్యాత్మిక తాతగారు” అయిన భక్తిసిద్ధాంత సరస్వతి గారు మనకు అపారమైన ఆస్తి ఇచ్చారు. అతని రాసిన గ్రంథాలు—అతని కష్టం—అతని అనువాదాలు—అతని శాస్త్రాలు—అతని సేవ—ఇవి అన్నీ మన నిజమైన ఆస్తులు. 3. అందులో ఒకటి అమృత వాణి. ఈ గ్రంథం మనం భౌతిక శరీరంలో ఉన్నప్పుడు, భ్రమలో ఉన్నప్పుడు, లోకమాయలో పడినప్పుడు—మనలను మళ్లీ నిజానికి తీసుకువస్తుంది. ఒక్క పుస్తకం—అమృత వాణి—మన జీవితాన్ని సరి చేయగలదు.ప్రతి లైన్ విప్లవం క్రియేట్ చేస్తుంది. ఆచార్యుల వాక్యం—“అమృత వాణి”—మన జీవితం మార్చగల శక్తి. 4. వైష్ణవుడి లక్షణం వైష్ణవుడ దుఃఖాలయంలో ఉన్నా ఈ భౌతిక ప్రపంచం అతనిని టచ్ చేయదు. ఎందుకంటే అతన్ని ఆకర్షించే వస్తువు ఈ లోకంలో లేదు. భౌతిక వస్తువులన్నీ ఆర్డినరీ. కానీ అవి కృష్ణ సేవకు వాడితే—అవే ఎక్స్ట్రాడినరీ అవుతాయి. మొబైల్ ఆర్డినరీ. కానీ కృష్ణ సేవకు వాడితే—ఎక్స్ట్రాడినరీ. 5. ఇంటి జీవితం కూడా అలాగే. భర్త, పిల్లలు – “నా వారు” అని ఆర్డినరీగా చూసుకుంటే అది సాధారణ జీవితం. కానీ వారినే కృష్ణ సేవలో వాడితే—అది గోస్వాముల ఇల్లు అవుతుంది. భక్తులు – జపం, సేవ, ప్రచారం, సత్సంగం—ఇవి తప్పక చేయాలి. వైష్ణవులు డూప్లిసిటీ లేకుండా, పవిత్రంగా ఉండాలి. కాకులతో కలిసిపోకుండా హంసలతో కలవాలి. 6. కృష్ణ భక్తి పేరుతో మహిళలతో అనవసర *సంభాషణ—కలియుగంలో అత్యంత ప్రమాదం. పవిత్రత—బ్రహ్మచర్యం—కృష్ణుడి కోసం వాడాలి.*🔥🔥🔥 7. కృష్ణ నామం – అవతార స్వరూపం కృష్ణుడి నామం, కృష్ణుడి రూపం, గుణం, లీల — ఇవన్నీ వేర్వేరు కావు. నామమే అవతారం. నామంలోనే రూపం, గుణం, లీల—all-in-one గా ఉన్నాయి. 8. కలియుగంలో భగవంతుడు నామ స్వరూపంగా అవతరించారు. ద్వాపరంలో రూపస్వరూపం. కలియుగంలో నామస్వరూపం. డీటీలలో రూపస్వరూపం ప్రవేశిస్తుంది. భాగవతం చదివితే లీల స్వరూపం ప్రవేశిస్తుంది. జపం చేస్తే నామస్వరూపం ప్రవేశిస్తుంది. భక్తిసిద్ధాంత మహారాజులు నామప్రచారానికి 100 కోట్ల జప యజ్ఞం చేశారు. మనమూ అంటే ఐక్య విద్య ఒకటిన్నర సంవత్సరంలో 34 కోట్ల జపం కలిపి చేశాం. జపానికి అంతటి శక్తి ఉంది. 9. నామం – పరమ రక్షణ హరీనామం వినగానే వెంటనే లభించే ఆశీర్వాదం ఏంటంటే “నేను ఈ శరీరం కాదు, మనసు కాదు, కాలం కాదు, భయం కాదు — నేను కృష్ణుని భాగం.”ఈ స్థితి—ఆత్మసాక్షాత్కారం. మనసు చేసే పని కాదు. బుద్ధి చేసే పని కాదు.జపమే మనకు ఈ అనుభూతిని ఇస్తుంది.అందుకే ఎవరైనా అడిగితే చెప్పాలి: “నువ్వు శరీరం కాదు ఆత్మవి. ఆత్మకు ఆహారం నామసేవ. ఆ ఆహారం మందగిస్తే ఆత్మ బలహీనమవుతుంది. ఆత్మాహత్యలు, డిప్రెషన్, లోపలి ఒత్తిడి అన్నీ ఆత్మ ఆహారం లేకపోవడమే. పాత్రలు – శాశ్వతం కాదు ఈ జీవితంలో మనం పోషిస్తున్న పాత్రలు భార్య, భర్త, కొడుకు, కూతురు ఇవి శరీర సంబంధ పాత్రలు. ఇవి సెకండరీ. ప్రైమరీ పాత్ర నామసేవ, కృష్ణ సేవ. నామస్వరూపాన్ని మర్చిపోతే పునర్జన్మ. నామాన్ని పట్టుకుంటే పునర్జన్మ ఉండదు. శరీర సంబంధ “నా కొడుకు… నా భర్త అనే ఓనర్‌షిప్—ఇవే బంధనాలు. ఎక్స్పెక్టేషన్స్ నెరవేరకపోతే వచ్చే బాధ ఇవన్నీ మాయ. మన ఆత్మకి ఓనర్ మనం కాదు కృష్ణుడు. భక్తిలో బలమైన రక్షణ భక్తి ఎప్పుడు బలంగా ఉంటుందంటే— జపం బాగా చేయాలి, గ్రంథాలు చదవాలి,ప్రచారం చేయాలి,ప్రసాదం, తీసుకోవాలి పవిత్రంగా ఉండాలి బుక్ చదివితే ఇంటెలిజెంట్ రసం వస్తుంది. ప్రసాదం హృదయానికి తృప్తి. నామం ఆత్మకు ఆహారం. పుస్తకాలు చదవకపోతే—భక్తికి బోర్ వస్తుంది. అప్పుడు మాయ ఆకర్షణ పెరుగుతుంది స్త్రీ పురుష వికారాలు పెరుగుతాయి. అందుకే శాస్త్రం, నామం, సేవ మూడు అవసరం. *నామప్రచారం – పరమ సేవజపం నామస్వరూపానికి* సేవ*. ప్రీచింగ్ గుణ, లీల స్వరూపానికి సేవ.విగ్రహ సేవ రూపస్వరూపానికి సేవ. ఎక్కడైతే భక్తులు హరినామం చేస్తారో అక్కడ రూపం, గుణం, లీల all appear together. “యత్ర గాయంతి తత్ర తిష్ఠామి” అక్కడ నామం ఉంటే, నేను ఉంటాను. అందుకే భక్తిసిద్ధాంత సరస్వతి గారు చెప్పారు: “బుక్ డిస్ట్రిబ్యూషన్ హరిణామ ప్రచారం ఇదే గురువు సేవ.” మన ఆచార్యులు, గురువులు—మన ఆధ్యాత్మిక తాతగార్ల అందరూ మనతోనే ఉన్నారు. #భగవద్గీత #📙ఆధ్యాత్మిక మాటలు