PSV APPARAO
656 views
3 months ago
#🙏చంద్రప్రభ వాహనంపై మలయప్ప స్వామి🙏 #చంద్ర‌ప్రభ వాహనం – సకలతాపహరం🙏 #తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవాలు 🙏🕉️🙏 TTD UTSAVS #తిరుమల శ్రీ వేంకటేశ్వరుని వైభవం🕉️ శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు చూద్దాం రారండి 🙏 #తిరుమల శ్రీ వేంకటేశ్వరుని నవరాత్రి బ్రహ్మోత్సవాలు 🕉️ శ్రీవారి వాహన సేవలు🔯 భక్తీ ముక్తిదాయకం 🙏 🙏చంద్రప్ర‌భ వాహ‌నంపై నవనీత కృష్ణుడి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌🙏 తిరుమల, 2025 సెప్టెంబ‌రు 30: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఏడో రోజు మంగ‌ళ‌వారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు చంద్రప్ర‌భ వాహ‌నంపై నవనీత కృష్ణుడి అలంకారంలో భ‌క్తుల‌ను క‌టాక్షించారు. *చంద్ర‌ప్రభ వాహనం – సకలతాపహరం* చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి అనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది. వాహ‌న సేవ‌లో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, పలువురు బోర్డు స‌భ్యులు, సివిఎస్వో శ్రీ ముర‌ళికృష్ణ‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి చేరి చేయబడింది