#😇My Status #లాల్ బహదూర్ శాస్త్రి జయంతి
*మేక వన్నె పులులతో తొక్కి వేయబడ్డ మహానుభావుడు...మరువలేని 'మహాత్ముడు' లాల్ బహదూర్ శాస్త్రి..*
*"జై జవాన్ - జై కిసాన్" నినాదానికి ప్రాణం పోసిన ధీరుడు భారత దేశ స్వతంత్ర పోరాటం లో ప్రముఖ పాత్రధారుడు ఇండో-పాకిస్థాన్ యుద్ధ కాలంలో మన దేశాన్ని నడిపించిన రాజనీతిజ్ఞు మొట్ట మొదటి భారత రైల్వే శాఖ మంత్రిగా, హోమ్ మంత్రిగా సమర్థ పాలనను అందించిన దేశ అధ్యక్షులు అంతటి రాజనీతి గల భారత దేశ 2 వ ప్రధాని జయంతి నేడు....*
*గుజరాత్‌లోని ఆనంద్ యొక్క అమూల్ మిల్క్ కో-ఆపరేటివ్ సొసైటీకి మద్దతు ఇవ్వడం ద్వారా మరియు నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్‌ను సృష్టించడం ద్వారా అతను పాల ఉత్పత్తి మరియు సరఫరాను పెంచే దిశగా-శ్వేత విప్లవాన్ని ప్రోత్సహించారు. భారతదేశ ఆహార ఉత్పత్తిని పెంచాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన శాస్త్రి 1965 లో భారతదేశంలో హరిత విప్లవాన్ని ప్రోత్సహించారు. గాంధీయవాదం, అహింస అంటే శత్రవులకి భయపడుతూ, వాళ్లకి లొంగి వుండటం కాదనీ, మనల్ని మనం రక్షించుకుంటూ పక్క వాళ్లని ఇబ్బంది పెట్టకపోవటమేనని.. లాల్ బహదూర్ బహు గొప్ప నిరూపించారు! అదే ఇప్పటికీ, ఎప్పటికీ భారతీయులందరికీ గొప్ప పాఠం!*
*దేశ భక్తులందరికీ శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి శుభాకాంక్షలు*