Annamani Siripurapu
536 views
4 months ago
మెడికల్ కాలేజీలు - వాటి చరిత్ర ! వందేళ్ళ క్రితం నుండి , ఇప్పటివరకు రాష్ట్రం లో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండగా... అందులో 8 కాలేజీలు టీడీపీ ఆవిర్భావం కన్నా ముందే ఏర్పాటయ్యాయి మిగతా 3 కాలేజీలను దివంగత నేత వైఎస్సార్ తెచ్చారు ఆ తరువాత 2019 లో వైయస్ జగన్ అధికారం చేపట్టాక... చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ... అందులో 5 కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేశారు , అడ్మిషన్లు కూడా మొదలయ్యాయి , మరికొన్నింటి పనులు కొద్దిగా పూర్తి కావాల్సి ఉన్నాయి ఇలా మొత్తంగా చూస్తే 28 మెడికల్ కాలేజీలలో 20 మెడికల్ కాలేజీలు నాడు వైఎస్సార్( 3) , నేడు ఆయన కుమారుడు వైయస్ జగన్( 17) ఏర్పాటు చేసినవే ! మరి నేను విజనరీని , విస్తరాకుల కట్టని ... తోపుని తురుముని ...అని చంద్రబాబు పొద్దున్న లేచింది మొదలు మనకు చెబుతాడు కదా ..? ఇప్పటికి బాబు సీఎంగా మన రాష్ట్రానికి పనిచేసింది ఈ ఏడాదితో కలిపి 15 ఏళ్లు అవుతుంది ... కనీసం ఒక్క మెడికల్ కాలేజ్ ని కూడా ఎందుకు తీసుకు రాలేకపోయాడు..? తీసుకురాలేకపోయాడు సరే... వైయస్ జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం ఎంతవరకు సమంజసం..? ప్రజలు ఆలోచించాలి... పేదవాడికి విద్య , వైద్యం , వైద్య విద్య చేరువ చేయాలని నాడు వైఎస్ఆర్ , నేడు వైఎస్ జగన్ మాత్రమే ప్రయత్నించారు... వాటిని సుసాధ్యం చేశారు కూడా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి .. వీటిని సాధ్యమైనంత వరకు ప్రజలకు దూరం చేస్తూనే ఉన్నాడు ! ఇటువంటి వాస్తవాలను ఈనాడు , ఆంధ్రజ్యోతి , ETV , ABN ,TV 5 వంటి బాబు భజన మీడియా సంస్థలు ప్రజలకు చెప్పవు కాబట్టి ... విజ్ఞులైన ప్రజలు , ముఖ్యంగా యువత వాస్తవాలను గమనించండి.. ఇటువంటి వాస్తవాలను నలుగురికి తెలియజేయండి #MedicalCollege #ysrliveson #ysjagan #CBNfailedCM