'చిరుత ఆ ప్రాంతంలోనే సంచరిస్తోంది - ప్రజలు రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలి' -
DFO Bharani on Leopard Roaming : తూర్పుగోదావరి జిల్లాలో చిరుతపులి సంచారం స్థానిక ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. రాజమహేంద్రవరం శివారు ప్రాంతంలోనే చిరుత సంచరిస్తోందని డీఎఫ్‌వో భరణి తెలిపారు. చిరుత జాడ కనిపెట్టేందుకు 50 ట్రాప్ కెమెరాలు, నాలుగు బోన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. శివారు గ్రామాల ప్రజలు రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.