రొట్టెల పండుగ:
• ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో జరిగే పండుగ ఇది. బారాషహీద్ దర్గా దగ్గర జరిగే ఈ ఘట్టానికి ప్రపంచ నలుమూలల నుండి భక్తులు తరలివస్తారు. ఇది 5రోజులపాటు సాగుతుంది. మొహర్రం నాడు మొదలవుతుంది.
• ఇది కథ: ఆర్కాడు నవాబు కాలంలో సుమారు 400 ఏళ్ల క్రితం సౌదీ, మక్కా నుండి 300 మంది ఇస్లాం మత ప్రచారకులు భారతదేశానికి వచ్చారు. ఆ టైంలో కర్ణాటకలో హైదర్ ఆలీ, నెల్లూరులో నవాబు పాలన ఉండేది. అందులో 12మంది నెల్లూరు జిల్లాలో పర్యటిస్తూ కొడవలూరు మం|| గండవరం చేరుకోగా, బ్రిటిష్ సైనికులకు.. మత బోదకులకు యుద్ధం జరుగగా, ఈ యుద్ధంలో ప్రచారకులు ప్రాణత్యాగం చేశారు. వారి మొండెలతో గుర్రాలు నెల్లూరు చేరాయి. స్థానికులు స్వర్ణల చెరువు వద్ద వారిని సమాధి చేశారు. కొన్నేళ్ల తర్వాత రాజక దంపతుల కలలో ఓ దైవ స్వరూపుడు కనపడి బారా షహీద్ దర్గా దగ్గర మట్టిని లేపనం చేసుకున్నవారికి సర్వరోగాలు పోతాయని చెప్పగా, ఈ విషయం ఆర్కాటు నవాబు దగ్గరికి వెళ్ళింది. అనారోగ్యంతో ఉన్న ఆయన కూతురికి దర్గా దగ్గరి మట్టిని లేపనంగా పూయగా ఆమె కోలుకుంటుంది. ఇది అందరికీ తెలియగా.. పూజలు చేయడం ప్రారంభించారు. ఆర్కాట్ నవాబు 1757లో రొట్టెల పండుగను ప్రారంభించారు. ఆయన అధికారి ఖాజీ ఆధ్వర్యంలో ఈ పండుగ జరిగేది. పూజల కోసం వచ్చే భక్తులు వారి వెంట రొట్టెలు తెచ్చుకునేవారు. రొట్టెలను తిని.. మిగిలిన రొట్టెలను దర్గా దగ్గరి వారికి ఇచ్చేవారు. అలా ఈ పండుగ మొదలైంది. స్వర్ణాల చెరువు దగ్గర ఈ జరిగే ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి రొట్టెలను ఇచ్చిపుచ్చుకుంటారు. మొత్తం 5 రోజులు జరుగుతుంది.
...
#baraShaheedhDarga #NelluruDargah #RottelaPanduga #RotiyaaaKiEid #Nelluru
#eid #eid muba #Eid ul fitar Mubarak🕋 #☪ Eid Mubarak #🌜🕋Eid Mubarak wishes 🕋🌜