Rochish Sharma Nandamuru
862 views
6 months ago
26th July 2025 అన్నవరం సత్యదేవుని ఆవిర్భావోత్సవం : సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియమ్ ప్రియంచ నానృతమ్ బ్రూయాత్ ఏష ద్ధర్మస్సనాతనః.... సత్యం పలకాలి. ప్రియంగా పలకాలి. కష్టం కలిగించేదైతే సత్యాన్ని మానివేయాలి కానీ, చెప్పకూడదు. అలాగే ఇతరులకు మనపై ఇష్టం పుట్టించేందుకు అసత్యాన్ని ఎప్పుడూ చెప్పకూడదు. సత్యంలోనే దైవం ఉంటాడని చెబుతోంది మన సనాతన ధర్మం. అటువంటి సత్యమే మూర్తిరూపాన్ని ధరించి అన్నవరంలో కొలువై ఉన్నాడు. ఏ ఇంటిలో కళ్యాణం జరిగినా, గృహప్రవేశం జరిగినా సత్యనారాయణ స్వామి వ్రతం తప్పనిసరి. శ్రీ సత్యనారాయణ స్వామివారిని "మూలతో బ్రహ్మరూపాయ.. మధ్యతశ్చ మహేశ్వరం.. అధతో విష్ణురూపాయ.. త్ర్యైక్య రూపాయతేనమః" అని స్తుతిస్తారు. పర్వతశ్రేష్ఠుడు అయిన మేరు పర్వతం ఆయన భార్య మేనకా దేవి శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేసి విష్ణువు అనుగ్రహంతో రెండు పర్వతాలను పుత్రులుగా పొందాడు. అందులో ఒకరు భద్రుడు, ఇంకొకరు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తి గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తి కి నివాస స్థానమైన భద్రాచలంగా మారాడు. రత్నకుడు కూడా విష్ణువు గురించి తపస్సు చేసి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామిగా వెలసిన రత్నగిరి కొండగా మారాడు. తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురానికి సమీపంలో ఆరెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. సామాన్యశకం 1891లో ఆ గ్రామంలో నివసించే ఈరంకి ప్రకాశరావుకి, ఆ గ్రామాధికారి రాజా ఇనుగంటి వేంకట రామనారాయణకు ఏక కాలంలో ఒకనాడు శ్రీమహావిష్ణువు కలలో కనపడి, 'రాబోయే శ్రావణ శుక్ల య, మఖ నక్షత్రం, గురువారం నాడు తాను రత్నగిరిపై వెలుస్తున్నానని, తనను శాస్త్ర నియమానుసారం ప్రతిష్టించి. సేవించమని చెప్పి అంతర్ధాన మయ్యారు.. మరుసటి రోజు ఇద్దరూ కలిసి అన్నవరం వెళ్లి అక్కడ పొదలో వెతుకుతుండగా అంకుడు చెట్టు పొదలో స్వామి పాదాలపై సూర్య కిరణాలు ప్రసరిస్తుండగా చూసి, ఆ పొదలను తొలగించి స్వామివారి విగ్రహాన్ని రత్నగిరి కొండ పైకి తీసుకెళ్లారు. కాశీ నుంచి తెచ్చిన శ్రీమత్రిపాద్విభూతి మహా వైకుంఠ నారాయణ యంత్రాన్ని విష్ణు పంచాయతన పూర్వకంగా ప్రతిష్టించారు. 1891, ఆగస్టు 6వ తారీకున, ఆ యంత్రంపై స్వామిని దేవేరియైన అనంతలక్ష్మీ సత్యవతీ సమేతంగా ప్రతిష్టించారు. హరి హరులకు బేధం లేదని నిరూపిస్తూ సత్యనారాయణ స్వామి ప్రక్కనే పరమేశ్వరుడు పూజలందుకుంటాడు. రత్నగిరి పై ఎప్పుడూ నిత్య కళ్యాణం. పచ్చతోరణమే... #🌅శుభోదయం #🙏🏻ఆదివారం భక్తి స్పెషల్ #🌼ఆదివారం స్పెషల్ విషెస్ #🙏శ్రీ సత్యనారాయణ స్వామి🕉️ #🕉అన్నవరం సత్యనారాయణ స్వామి 🙏🙏🙏🙏🙏🕉