Chandrababu Naidu M
543 views
5 months ago
రికార్డు స్థాయిలో ఎంతో శ్రమకోర్చి హంద్రీనీవా కాలువ వెడల్పు పనులు పూర్తి చేశాం..... రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ వజ్రకరూరు మండలం రాగులపాడు వద్దనున్న పంప్ హౌస్ ను పరిశీలించిన మంత్రి.... అనంతపురం, ఆగస్టు 08 : రికార్డు స్థాయిలో.. కేవలం 100 రోజుల్లో.. ఎంతో శ్రమకోర్చి హంద్రీనీవా కాలువ వెడల్పు పనులు పూర్తి చేశామని రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు మండలం రాగులపాడు వద్ద ఉన్న పంప్ హౌస్ ను మంత్రి పయ్యావుల కేశవ్ పరిశీలించారు.... ఈ సందర్భంగా పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ రాగులపాడు లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద ప్రతిరోజు 8 నుంచి 10 పంపుల వరకు పనిచేస్తున్నాయన్నారు. వర్షాలు ఎక్కువ వచ్చిన రోజున కంట్రోల్ కోసం తగ్గించడం, తర్వాత వెంటనే పది పంపులకు పెంచడం, ఈ రకంగా మైంటైన్ చేస్తున్నారన్నారు. రికార్డు స్థాయిలో మొదటి సంవత్సరంలోనే, కేవలం 100 రోజులు లక్ష్యం పెట్టుకుని ఒకే దగ్గర, ఉరవకొండ ప్రాంతంలోనే దాదాపు రెండు 270 ఎక్సవేటర్లు ఒక కాంట్రాక్టర్ తో, దాదాపు అంతే స్థాయిలో రెండవ కాంట్రాక్టర్ తో పనిచేయించడంతో ఈరోజు హంద్రీనీవా కాలువ నీటి సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకోగలిగామన్నారు. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్లను ఏం చేయాలి, పిల్ల కాలువలకు నీరు ఎలా తీసుకువెళ్లాలి అనేది ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. ఎంతో కష్టమైనా కూడా, ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో తాము ఎప్పుడూ కష్టం అనుకోలేదని, ఇష్టపడి చేసిన పనిగా భావిస్తున్నామన్నారు. జిల్లా రైతులకు ఒక నమ్మకాన్ని ఇచ్చే నీళ్లను చూస్తే మాకు చాలా ఆనందంగా ఉందని, ఇదే రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి హంద్రీనీవా మీద ఉన్న అన్ని ప్రాజెక్టులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి మమ్మల్ని గెలిపించిన జిల్లా రైతాంగం రుణం తీర్చుకుంటామన్నారు. జగన్ మోహన్ రెడ్డి 2019లో ఉరవకొండ జలదీక్షకు వచ్చి మూడు నెలల్లో హంద్రీనీవా పనులు ప్రారంభిస్తామని చెప్పి ఐదు నెలల్లో గంప మన్ను తీయలేదని, అయితే ఇవాళ మీరు చూస్తున్నారని ఒక సంవత్సరంలో తాము పని చేయగలిగామన్నారు. తమకు రైతులు, జిల్లా పట్ల నిబద్ధత, చిత్తశుద్ధి ఉందని, వారు కేవలం మాటలు చెప్తే, మాకు అప్పుల సంసారాన్ని ఇచ్చినా సరే మేము ఎంతో శ్రమకోర్చి హంద్రీనీవా కాలువ వెడల్పు పనులు పూర్తి చేశామన్నారు. రైతుల నమ్మకాన్ని వమ్ము కానీయకుండా పనిచేస్తామని తెలియజేస్తున్నామన్నారు. హంద్రీనీవా కాలువ ద్వారా వస్తున్న నీటితో పీఏబీఆర్ డ్యాంను నింపుతున్నామని, మొత్తం జిల్లాకు నీటిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. వ్యవస్థలో ఎక్కడ తక్కువైతే అక్కడ నీరు వాడుకునేటట్టు పీఏబీఆర్ కు తీసుకువచ్చి, తుంగభద్రలో పది టీఎంసీలు తక్కువ పడుతున్నాయని, ఎంత మేరకు అయితే అంత మేరకు వాటిని కూడా కవర్ చేసేలా తీసుకెళ్తున్నామన్నారు. పీఏబీఆర్ ని, ఆ తర్వాత ఎంపిఆర్ ని బలోపేతం చేస్తామని, జిల్లాలో ఉన్న ప్రతి రిజర్వాయర్ కు, అవకాశం ఉన్న ప్రతి చెరువుకు నీరంధించే విధంగా హంద్రీనీవాని రూపొందిస్తామన్నారు. సాధ్యమైనంత తొందరగా అన్ని పనులు పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో ఉన్న పిల్ల కాలువల అభివృద్ధికి ప్రతిపాదనలు అన్ని సిద్ధమయ్యాయని, వాటిని కూడా తొందర్లోనే మంజూరు చేసి ఆ పనులను కూడా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.... #PayyavulaKeshav #😇My Status #✌️నేటి నా స్టేటస్ #🙆 Feel Good Status