ఫాలో అవ్వండి
🌿🥀 BHAGYA SRI EDITS🥀🌿 ✍️
@1141332361
9,845
పోస్ట్
34,142
ఫాలోవర్స్
🌿🥀 BHAGYA SRI EDITS🥀🌿 ✍️
1K వీక్షించారు
14 గంటల క్రితం
పాలపిట్ట దర్శనం ఎందుకు? ******* విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా ద‌స‌రా రోజున పాల‌పిట్ట‌ను దర్శించుకోవ‌డం వ‌ల్ల‌ అన్నీ శుభాలే క‌లుగుతాయ‌ని పురాణాలు చెబుతున్నాయి. అయితే అస‌లు పాల‌పిట్ట‌ను ఎందుకు ద‌ర్శించుకోవాలి ? దాని వెనుక ఉన్న అస‌లు కార‌ణం ఏమిటి ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. పాండ‌వులు అర‌ణ్య‌, అజ్ఞాత వాసాల‌ను ముగించాక విజ‌య‌ద‌శ‌మి రోజు శ‌మీ వృక్షంపై ( జమ్మి చెట్టు) ఉన్న త‌మ ఆయుధాలను తీసుకుని హ‌స్తినాపురం వైపు ప్ర‌యాణానికి ఉద్యుక్తులు కాగా ఆ స‌మ‌యంలో వారు ఎదురుగా వచ్చిన పాల‌పిట్ట‌ను చూస్తారు. అప్పటి నుండి పాండవులకు అన్నీ శుభాలే క‌లుగుతాయి. కురుక్షేత్ర యుద్ధంలో కౌర‌వుల‌పై వారు విజ‌యం సాధిస్తారు. అప్పటి నుండి ద‌స‌రా రోజున ( విజయదశమి రోజున) పాల‌పిట్ట‌ను చూడ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంద‌ని పురాణాలు చెబుతున్నాయి. పాల‌పిట్ట సాక్షాత్తూ దేవీ స్వ‌రూప‌మ‌ని, అది ఉత్త‌ర దిక్కు నుంచి వ‌స్తే ఇంకా మంచిద‌ని, శుభాలు, విజ‌యాలు క‌లుగుతాయని పండితులు చెబుతున్నారు. #🐦పాల పిట్ట దర్శనం 🙏
See other profiles for amazing content