ఫాలో అవ్వండి
త్యాడ రామకృష్ణారావు(బాలు)
@1180637796
257
పోస్ట్
261
ఫాలోవర్స్
త్యాడ రామకృష్ణారావు(బాలు)
1.5K వీక్షించారు
13 గంటల క్రితం
సూర్యనమస్కారములపై అవగాహనా కార్యక్రమం (అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో) ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ విజయనగరం,ఆదివారం, జనవరి 25: 🔸రధ సప్తమి సందర్బంగా సూర్య నమస్కారాలు 🔸నెలవారీ సమావేశం నిర్వహించిన క్లబ్ సభ్యులు అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం కామాక్షినగర్,అయ్యన్నపేట జంక్షన్ వద్దనున్న మున్సిపల్ నడక మైదానంలో ఆదివారంతో కూడిన రధసప్తమి పడిన సందర్బంగా క్లబ్ యోగా గురువు సాలూరు చక్రధర్ పట్నాయక్ చే సూర్యనమస్కారలపై అవగాహనా కార్యక్రమాన్ని క్లబ్ అధ్యక్షులు సి. హెచ్. రమణ నిర్వహించారు. ఈ సందర్బంగా క్లబ్ గౌరవ అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు) మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమనే నినాదంతో వాకర్స్ ఇంటర్నేషనల్ పనిచేస్తుందని, యోగాసానాలకు భారతదేశం, ప్రభుత్వం ఎంతో ప్రాముఖ్యతను ఇస్తుందని, అదే స్ఫూర్తితో కార్యక్రమం చేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా క్లబ్ యోగా గురువు, మేధావి చక్రధర్ పట్నాయక్ క్లబ్ సభ్యులకు సూర్యనమస్కారం వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తూ.. హై బీపి, మధుమేహం, అధికబరువు, గ్యాస్ట్రిక్, మలబద్ధకం, కీళ్ళ నొప్పులు, కోపం, భయం, ఆందోళన వంటివి తగ్గించుకొని ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చని తెలిపి, క్లబ్ సభ్యులచే సూర్యనమస్కార ఆసనాలు వేయించారు. అనంతరం క్లబ్ నెలవారీ సమావేశాన్ని నిర్వహించి జనవరి నెలలో చేసే కార్యక్రమాల నివేదికను క్లబ్ కార్యదర్శి కోట్ల ఈశ్వరరావు వివరించి,ఫిబ్రవరి నెలలో చేయబోయే కార్యక్రమాలపై సభ్యులంతా చర్చించారు. చివరిగా క్లబ్ యోగా గురువు చక్రధర్ పట్నాయక్ ను క్లబ్ పెద్దలు, డిస్ట్రిక్ట్ 102మాజీ గవర్నర్ ఎడ్ల గణేష్,మాజీ డిప్యుటీ గవర్నర్ పతివాడ నారాయణ రావు మాష్టారు,పెద్దలు కోట్ల సత్యనారాయణ,కర్రోతు ఈశ్వర ప్రసాద్, ప్రసాద్ మాష్టారు,జాలీ వాకర్ వై. నలమహారాజు, ఉపాధ్యక్షులు పి. అప్పలరాజు,జి. సూర్యప్రకాశరావు, జాయింట్ సెక్రటరీ ఐ. అప్పలరాజు, మహేష్ మాష్టారు తదితరులు దుస్సాలువాతో సత్కరించారు. ~త్యాడ రామకృష్ణారావు(బాలు) #🥳హ్యాపీ రిపబ్లిక్ డే🇮🇳 #🇮🇳టీమ్ ఇండియా😍 #🇮🇳 మన దేశ సంస్కృతి
త్యాడ రామకృష్ణారావు(బాలు)
571 వీక్షించారు
6 నెలల క్రితం
"అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్" ఆధ్వర్యంలో విద్యార్థులకు "నోట్ పుస్తకాలు" పంపిణీ ----------------------------- విజయనగరం,గురువారం, జులై 10th: స్థానిక 42వ డివిజన్, కామాక్షినగర్ లో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకులు త్యాడ రామకృష్ణారావు (బాలు) ఆధ్వర్యంలో గురువారం ఉదయం నోట్‌ పుస్తకాలు, పెన్నులను ప్రధానోపాధ్యాయరాలు శ్రీమతి ఎన్.రోజా నిర్మల చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ గౌరవ అధ్యక్షులు, ప్రముఖ సంఘసేవకులు ఎ.ఎస్. ప్రకాశరావు మాష్టారు మాట్లాడుతూ.. సేవాకార్యక్రమంలో భాగంగా నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని, ప్రతీయేటా విద్యార్థినీ విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పౌష్టికాహారాన్ని అందజేస్తుంటామని, అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో క్లబ్‌ ఉపకార్యదర్శి ముదిలి శ్రీనివాస్,పాఠశాల ఉపాధ్యాయులు బి. హరికిషోర్ తదితరులు పాల్గున్నారు ~త్యాడ రామకృష్ణారావు(బాలు) #🇮🇳 మన దేశ సంస్కృతి #🔱శక్తీ సాధన🙏 #🇮🇳టీమ్ ఇండియా😍
See other profiles for amazing content