అలసినవానిని ఊరడించు మాటలు
🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞
DAILY MEDITATIONS FROM THE MINISTRY OF Bro. BAKTH SINGH
🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇
🌷🌷🌷 Thursday, January 8 🌷🌷🌷
*''యెహోవా వంతు ఆయన జనమే ఆయన స్వాస్థ్యభాగము యాకోబే'' (ద్వితీయో. 32:9).*
యాకోబు ఆయన స్వాస్థ్యభాగము, మరొక విధముగా చెప్పవలెననిన దేవుడు, ''యాకోబూ, నిత్యత్వమునకు నీవు నాకు చెందినవాడవు. సర్వలోకము కంటె నీవు నాకు ఎంతో ప్రశస్తమైన వాడవు'' అని చెప్పుచున్నాడు. దేవుడు సూర్యుడు, చంద్రుడు లేక నక్షత్రములను తన స్వాస్థ్యమని ఎన్నడును పిలువడు. యాకోబునకు ఇవ్వబడిన ఆధిక్యత నిజముగా ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రము, దేవుని ద్వారా అలాగే అదే ఆధిక్యత మనకు కూడా ఇవ్వబడినది. ''మీ మనోనేత్రముల వెలిగింపబడినందున, ఆయన మిమ్మును పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యమెట్టిదో, మీరు తెలిసికొనవలెను'' (ఎఫెసీ 1:18).
పిమ్మట ఆయన ''వాని కనుగొని ఆవరించి పరామర్శింన తన కనుపాపను వలె వాని కాపాడెను'' (ద్వితీయో. 32:10) అని చదువుదుము. దీని వలన నీ యొక్క అన్యదేవతలన్నిటిని ఇష్టపూర్వకముగా తీసిపారవేయుటకు నీకు సహాయపడును. ''సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా - మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు'' (జెకర్యా 2:8).
ద్వితీయో. 32:11లో ''పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయుము'' అని చదువుదుము. ప్రభువు నీవు ఉన్నత స్థలముపై ఎగురుటకు నేర్చుకొనవలెనని కోరుచున్నాడు గనుక ఆయన, నీ గూడు కూడా రేపును.
నేను యుగోస్లావియాలో ఉన్నప్పుడు ఉదయకాల, మధ్యాహ్నకాల భోజనము మరి టీ సమయములోను ద్రాక్షపండ్లు వడ్డించబడుటను కనుగొంటిని. అవి చాలా పెద్దవి, నిండుగా రసము గలవి మరియు పెద్ద పెద్ద గుత్తులు గల పండ్లు భోజనపు బల్లమీద సమృద్ధిగా ఉండును. మనము అన్యదేవతలన్నిటిని విడచిపెట్టి, బేతేలుకు తిరిగి వచ్చినప్పుడు దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునని అది నాకు జ్ఞాపకము చేసినది. దేవుని ఆశీర్వాదములను సంపూర్ణముగా పొందుటకు అదొక్కటే మార్గము. నీ భార్య, లేక భర్త, లేక స్నేహితులు, బంధువులు లేక నీ వ్యాపారము లేక సౌఖ్యములు నిన్ను బేతేలు నుండి దూరము చేయకుండ చూచుకొనుము. దేవుడు ''నేను సర్వశక్తిగల దేవుడను'' అని చెప్పుచున్నాడు. నిన్ను రక్షించుటకు, నిన్ను కాపాడుటకు, నిన్ను నడిపించుటకు మరియు నిన్ను ఆశీర్వదించుటకు ఆయన శక్తి గలవాడై యున్నాడు. ద్వితీయో. 32:7-14లను నీ వ్యక్తిగత అనుభవముగా చేసికొనుము. దేవుని మందిరమైన, బేతేలులో నీకు తన శ్రేష్టమైనది ఇచ్చి, నీ పూర్తి భాగమును నీకు చూపుమని ప్రభువును అడుగుము.
Download Daily Devotions by Brother Bakht Singh Mobile App, using link: https://rb.gy/iv32b1 #📀యేసయ్య కీర్తనలు🎙 #😇My Status
Download Songs Book Songs of Zion Mobile App, using link: https://rb.gy/ua3tlm
Listen to Songs of Zion by visiting Hebron World Youtube Channel: https://www.youtube.com/@Hebron_World
To Read Books written by Brother Bakht Singh, visit: https://hebronworld.com