#💮వసంత పంచమి శుభాకాంక్షలు✨ *వసంత పంచమి శుభాకాంక్షలు*
వాక్కుకు విద్యకు కళలకు
సకల వేద అధిదేవతగా..
అజ్ఞానం తొలగించి
జ్ఞాన సంపదలు అందించు వాగ్దేవిగా..
మంచు ముత్యంలా మెరిసే
తెల్లని వస్త్రాలంకరణతో..
ఒకచేతిలో సంగీతానికి మూలమైన వీణను ధరించి.. మరోచేత్తో సకల ఆగమాలకు ఆలవాలమైన పుస్తకాన్ని..
మూడో చేతిలో అక్షయమైన తపస్సుకు చిహ్నం అక్షమాలను ధరించి..
పూలలో పవిత్రమైన కమలంలో సుఖాసీనమై..
పాలు నీరు వేరుచేసే వివేకం గల హంస వాహనంపై
ప్రశాంత వదనంతో బ్రహ్మ ముఖం నుండి..
మాఘ శుద్ధ పంచమి నాడు
దివ్య తేజస్సుతో..
ఉద్భవించిన పుణ్య తిథి
వసంత పంచమి..
దేవి అనుగ్రహం తోనే మాటకు స్వరం, స్వరానికి అందం, జ్ఞానానికి దారి చూపి పరిపూర్ణత
సిద్ధింప చేసి..
బ్రహ్మ సృష్టించిన రూపాలకు ప్రాణం పోసిన వేదవాణి..
తన కరుణా కటాక్షాలతో
పుట్టు మూగవాడైన మూక శంకరుడిని మహాకవిగ..
పొట్ట కోసినా అక్షరం ముక్క రాని కాళిదాసు చేత ఘనమైన కవనాలను రాయించి మహా పండితుడిగా మలిచిన దేవేరి..
మనుషులకు లౌకిక అలౌకిక అగణిత గుణ గణాలను అంతర్వాహినిగ మేల్కొలిపే ప్రణవరూపిణికి
అక్షర సుమాంజలి..!
గోవర్ధన్ ఆముదాలపల్లి
#⛳భారతీయ సంస్కృతి #📙ఆధ్యాత్మిక మాటలు #షేర్ చాట్ బజార్👍 #🎶భక్తి పాటలు🔱