శీర్షిక : భ్రాంతి
మాటతో చెప్పాదు
మనసు ఎమో విప్పదు,
మౌనమే జవాబుగా
కరిగే కాలం ఇచ్చిన
ప్రశ్న పత్రంలో రాసేసింది.
కన్నీరు ఉబికి వచ్చి
కాటుకే కరిగి పోయి
కాన్వాస్ బుగ్గలపై
వేసిన చిత్రం చూసి
తన జీవితం అర్థం చేసుకోమంటుంది.
తన పైన ఇష్టాన్ని
చెప్పమని అడుగుతుంటే,
అద్దమంటి తన మనసులో
గులాబీకి వేసిన సంకెళ్లు
నీకేమీ కనిపించడంలేదా
నా వైపు చూస్తుంటే అంది.
విరహంతో వేగిన
ఎదురు చూపు తిరగబడితే,
నలిగిన ప్రేమ అరుస్తుంటే
నోరు ఎమో పెగల్లేదు,
నా చూట్టు కట్టిన బంధానాలు
తెగకుండా వికటాట్టహాసం చేసాయి.
అగ్నిలో దూకకుండా
దేహమంతా కాలుతుంటే,
రెక్కలున్నా పక్షిలా ఎగిరిపోయి
నీ దరికి చేరిపోవాలని
మనసంతా కోరుతోంది,
కట్టేసిన కాలం అడుగు ముందుకు
వెయ్యనివ్వడం లేదు.
శిలలాంటి శాసనం
నుదుటి మీద చెక్కి ఉంటే
కలలెందుకు వస్తాయో
రంగులెందుకు కురుస్తాయో
కనులకు కనికట్టు చేసేసి
కలయే బతుకు అనుకోమనడానికా.
____________
మల్లిన గణపతి
#✍️కవితలు