ఫాలో అవ్వండి
@ విజ్జి @
@607885459
3,440
పోస్ట్
11,226
ఫాలోవర్స్
@ విజ్జి @
600 వీక్షించారు
16 గంటల క్రితం
శ్రీ మహిషాసుర మర్దినీ స్తోత్రం అయి గిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందినుతే గిరివరవింధ్యశిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే । భగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువనపోషిణి శంకరతోషిణి కల్మషమోషిణి ఘోరరతే । [కిల్బిష-, ఘోష-] దనుజనిరోషిణి దితిసుతరోషిణి దుర్మదశోషిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 2 ॥ అయి జగదంబ మదంబ కదంబవనప్రియవాసిని హాసరతే శిఖరి శిరోమణి తుంగహిమాలయ శృంగనిజాలయ మధ్యగతే । మధుమధురే మధుకైటభగంజిని కైటభభంజిని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 3 ॥ అయి శతఖండ విఖండితరుండ వితుండితశుండ గజాధిపతే రిపుగజగండ విదారణచండ పరాక్రమశుండ మృగాధిపతే । నిజభుజదండ నిపాతితఖండ విపాతితముండ భటాధిపతే [-చండ] జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 4 ॥ అయి రణదుర్మద శత్రువధోదిత దుర్ధరనిర్జర శక్తిభృతే చతురవిచారధురీణ మహాశివ దూతకృత ప్రమథాధిపతే । దురితదురీహ దురాశయ దుర్మతి దానవదూత కృతాంతమతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 5 ॥ అయి శరణాగత వైరివధూవర వీరవరాభయదాయకరే త్రిభువన మస్తక శూలవిరోధి శిరోధికృతామల శూలకరే । దుమిదుమితామర దుందుభినాద మహో ముఖరీకృత తిగ్మకరే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 6 ॥ అయి నిజహుంకృతిమాత్ర నిరాకృత ధూమ్రవిలోచన ధూమ్రశతే సమరవిశోషిత శోణితబీజ సముద్భవశోణిత బీజలతే । శివ శివ శుంభ నిశుంభ మహాహవ తర్పిత భూత పిశాచరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 7 ॥ ధనురనుసంగ రణక్షణసంగ పరిస్ఫురదంగ నటత్కటకే కనక పిశంగ పృషత్కనిషంగరసద్భట శృంగ హతావటుకే । కృతచతురంగ బలక్షితిరంగ ఘటద్బహురంగ రటద్బటుకే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 8 ॥ సురలలనా తతథేయి తథేయి కృతాభినయోదర నృత్యరతే కృత కుకుథః కుకుథో గడదాదికతాల కుతూహల గానరతే । ధుధుకుట ధుక్కుట ధింధిమిత ధ్వని ధీర మృదంగ నినాదరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 9 ॥ జయ జయ జప్య జయే జయ శబ్దపరస్తుతి తత్పర విశ్వనుతే భణ భణ భింజిమి భింకృతనూపుర సింజితమోహిత భూతపతే । [ఝ-, ఝిం-] నటితనటార్ధ నటీనటనాయక నాటితనాట్య సుగానరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 10 ॥ అయి సుమనః సుమనః సుమనః సుమనః సుమనోహర కాంతియుతే శ్రిత రజనీ రజనీ రజనీ రజనీ రజనీకర వక్త్రవృతే । సునయన విభ్రమర భ్రమర భ్రమర భ్రమర భ్రమరాధిపతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 11 ॥ సహిత మహాహవ మల్లమ తల్లిక మల్లిత రల్లక మల్లరతే విరచిత వల్లిక పల్లిక మల్లిక భిల్లిక భిల్లిక వర్గ వృతే । సితకృత ఫుల్లసముల్లసితారుణ తల్లజ పల్లవ సల్లలితే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 12 ॥ అవిరలగండగలన్మదమేదుర మత్తమతంగజ రాజపతే త్రిభువనభూషణ భూతకలానిధి రూపపయోనిధి రాజసుతే । అయి సుదతీజన లాలసమానస మోహనమన్మథ రాజసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 13 ॥ కమలదలామల కోమలకాంతి కలాకలితామల భాలలతే సకలవిలాస కళానిలయ క్రమకేలిచలత్కలహంసకులే । అలికుల సంకుల కువలయ మండల మౌలిమిలద్భకులాలి కులే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 14 ॥ కరమురళీరవ వీజిత కూజిత లజ్జితకోకిల మంజుమతే మిలిత పులింద మనోహర గుంజిత రంజితశైల నికుంజగతే । నిజగుణభూత మహాశబరీగణ సద్గుణసంభృత కేళితలే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 15 ॥ కటితటపీత దుకూలవిచిత్ర మయూఖతిరస్కృత చంద్రరుచే ప్రణతసురాసుర మౌళిమణిస్ఫుర దంశులసన్నఖ చంద్రరుచే । జితకనకాచల మౌళిపదోర్జిత నిర్భరకుంజర కుంభకుచే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 16 ॥ విజిత సహస్రకరైక సహస్రకరైక సహస్రకరైకనుతే కృత సురతారక సంగరతారక సంగరతారక సూనుసుతే । సురథసమాధి సమానసమాధి సమాధి సమాధి సుజాతరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 17 ॥ పదకమలం కరుణానిలయే వరివస్యతి యోఽనుదినం స శివే అయి కమలే కమలానిలయే కమలానిలయః స కథం న భవేత్ । తవ పదమేవ పరంపదమిత్యనుశీలయతో మమ కిం న శివే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 18 ॥ కనకలసత్కల సింధుజలైరనుసించినుతే గుణరంగభువం భజతి స కిం న శచీకుచకుంభ తటీపరిరంభ సుఖానుభవమ్ । తవ చరణం శరణం కరవాణి నతామరవాణి నివాసి శివం జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 19 ॥ తవ విమలేందుకులం వదనేందుమలం సకలం నను కూలయతే కిము పురుహూత పురీందుముఖీ సుముఖీభిరసౌ విముఖీక్రియతే । మమ తు మతం శివనామధనే భవతీ కృపయా కిముత క్రియతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 20 ॥ అయి మయి దీనదయాలుతయా కృపయైవ త్వయా భవితవ్యముమే అయి జగతో జననీ కృపయాసి యథాసి తథాఽనుభితాసిరతే । యదుచితమత్ర భవత్యురరి కురుతాదురుతాపమపాకురు తే [మే] జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 21 ॥ ఇతి శ్రీ మహిషాసురమర్దిని స్తోత్రమ్ ॥ 🙏🌹🙏🪷🙏🌹🙏🪷🙏🌹🙏 #"భక్తి సమాచారం" #🙏🏻భక్తి కోట్స్📝 #🙏భక్తి స్పెషల్ #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status
@ విజ్జి @
718 వీక్షించారు
17 గంటల క్రితం
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం పంచారామం శక్తిపీఠం శ్రీమాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి దేవాలయ చీకటి కోణంలో శతాబ్దాల క్రింద కొలువైన దేవతా ప్రతిష్ట నాగ స్తంభం. సకల సర్పదోష రాహు కేతు దోష నివారణ నిమిత్తం భక్తులు ఆలయ గోడకు స్తంభానికి మధ్యనున్న సన్నటి దారి ద్వారా దూరి భక్తి శ్రద్ధలతో స్వహస్తాలతో సర్ప శీర్ష భాగం నుండి తోక భాగం వరకు స్పర్శించి సర్పాన్ని చూస్తూ వెనకకి నడవడం ఇక్కడ వందల ఏళ్ల నుంచి ఆచారం. #"భక్తి సమాచారం" #🙏🏻భక్తి కోట్స్📝 #🙏భక్తి స్పెషల్ #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status
@ విజ్జి @
1.6K వీక్షించారు
18 గంటల క్రితం
ది:17-10-2025 శుక్రవారం రోజున శివ కామేశ్వరి దేవి గా దర్శనమిస్తున్న శ్రీ బగళాముఖీ అమ్మవారు #"భక్తి సమాచారం" #🙏🏻భక్తి కోట్స్📝 #🙏భక్తి స్పెషల్ #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status
@ విజ్జి @
3.6K వీక్షించారు
1 రోజుల క్రితం
కార్తీకమాసంలో ఏ తిథి రోజున ఏం చేయాలి? విధానాలు తెలుసుకుందా..!! 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 🌸దీపావళి మరుసటిరోజు నుంచి మొదలయ్యే కార్తీక మాసం కానీ ఈసారి మనకు ఒకరోజు లేటుగా మొదలైంది సోమవారం దీపావళి బుధవారం నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుంది. అన్ని మాసాల్లో కెల్లా విశిష్టమైనదని మొట్టమొదట వశిష్ట మహర్షి జనక మహారాజుకు చెప్పాడని పురాణోక్తి. 🌿న కార్తీక సమో మాసో న శాస్త్రం నిగమాత్పరమ్ | నారోగ్య సమముత్సాహం న దేవః కేశవాత్పరః|| 🌸అంటే కార్తీక మాసంలోని ప్రతీ రోజు పుణ్యప్రదమే. ఒక్కో రోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది. 🌷 ఈ మాసంలో ఏ తిథిలో ఏమి చేయాలో తెలుసుకుందాం. 🌷 🌿కార్తీక శుద్ధ పాడ్యమి : తెల్లవారుజామునే లేచి, స్నానం చేసి, గుడికి వెళ్లాలి. కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేట్టుగా అనుగ్రహించమని ప్రార్థించి, సంకల్పం చెప్పుకొని, ఆకాశదీపాన్ని సందర్శించుకోవాలి. 🌸విదియ : సోదరి ఇంట ఆమె చేతి భోజనం చేసి, కానుకలు ఇచ్చి రావాలి. ఇలాంటివారికి యమగండం తప్పుతుందంటారు. 🌿తదియ : అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి. 🌸చవితి : నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి. పుట్టలో పాలు పోయాలి. 🌿పంచమి : దీన్ని జ్ఞాన పంచమి అంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే జ్ఞానవృద్ధి కలుగుతుంది. 🌸షష్ఠి : ఈరోజున బ్రహ్మచారికి ఎర్ర గడుల కండువాను దానం చేస్తే సంతానప్రాప్తి కలుగుతుంది. 🌿సప్తమి : ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానం ఇస్తే ఆయుఃవృద్ధి ప్రాప్తిస్తుంది. 🌸అష్టమి : ఈరోజున చేసే గోపూజ మంచి ఫలితాలను ఇస్తుంది. దీన్ని గోపాష్టమి అని కూడా అంటారు. 🌿నవమి : నేటి నుంచి మూడు రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి. 🌸దశమి : నేడు రాత్రిపూట విష్ణుపూజ చేయాలి. 🌿ఏకాదశి : దీన్నే బోధనైకాదశి అంటారు. ఈరోజున విష్ణుపూజ చేస్తే సద్గతులు కలుగుతాయి. 🌸ద్వాదశి : ఈరోజు క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. సాయంకాలం ఉసిరి, తులసి మొక్కల వద్ద విష్ణుపూజ చేసి, దీపాలను వెలిగించాలి. దీంతో సర్వపాపహరణం అవుతుంది. 🌿త్రయోదశి : సాలగ్రామ దానం చేస్తే కష్టాలు దూరమవుతాయి. 🌸చతుర్దశి : పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే మంచిది. 🌿కార్తీక పూర్ణిమ : కార్తీక మాసంలోకెల్లా అతి పవిత్రమైన రోజు. ఈరోజున నదీస్నానం చేసి, శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవాలి. ఈరోజున సత్యనారాయణ వ్రతం చేస్తే సర్వపాపాలూ తొలగిపోతాయి. 🌸కార్తీక బహుళ పాడ్యమి : ఆకుకూర దానం చేస్తే మంచిది. 🌿విదియ : వనభోజనాలు చేయడానికి అనువైన రోజు. 🌸తదియ : పండితులు, గురువులకు తులసిమాలను సమర్పిస్తే తెలివితేటలు పెరుగుతాయి. 🌿చవితి : రోజంతా ఉపవాసం చేసి, సాయంకాలం గరికతో గణపతిని పూజించాలి. ఆ గరికను దిండు కింద పెట్టుకుని పడుకుంటే పీడకలలు పోతాయి. 🌸పంచమి : చీమలకు నూకలు చల్లడం, శునకాలకు అన్నం పెట్టడం మంచిది. 🌿షష్ఠి : గ్రామదేవతలకు పూజ చేయాలి. 🌸సప్తమి : జిల్లేడు పూల దండను శివునికి సమర్పించాలి. 🌿అష్టమి : కాలభైరవాష్టకం చదివి, గారెల దండను భైరవుడికి (శునకం) సమర్పిస్తే ధనప్రాప్తి కలుగుతుంది. 🌸నవమి : వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి, పండితునికి దానమిస్తే పితృదేవతలు సంతోషిస్తారు. 🌿దశమి : అన్నదానం చేస్తే విష్ణువు సంతోషించి, కోరికలు తీరుతాయి. 🌸ఏకాదశి : విష్ణు ఆలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ చేస్తే మంచి ఫలితాలుంటాయి. 🌿ద్వాదశి : అన్నదానం లేదా స్వయంపాకం సమర్పిస్తే శుభం. 🌸త్రయోదశి : ఈరోజున నవగ్రహారాధన చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి. 🌿చతుర్దశి : ఈరోజున మాస శివరాత్రి. కాబట్టి శివారాధన, అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు, గ్రహబాధలు తొలగుతాయి. 🌸అమావాస్య : పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే పెద్దలకు నరక బాధలు తొలగుతాయి..స్వస్తి..🙏🌹🎻 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 #"భక్తి సమాచారం" #🙏🏻భక్తి కోట్స్📝 #🙏భక్తి స్పెషల్ #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status
@ విజ్జి @
600 వీక్షించారు
1 రోజుల క్రితం
*_𝕝𝕝ॐ𝕝𝕝 నవ బ్రహ్మలు 𝕝𝕝ॐ𝕝𝕝 *━❀ ꧁ 🔆 ꧂ ❀━* బ్రహ్మదేవుడు తొమ్మిది రూపాలలో భక్తులను అనుగ్రహిస్తున్నాడని ఐహీకం. ఈ నవ బ్రహ్మల రూపాలు 1. కుమార బ్రహ్మ 2. అర్క బ్రహ్మ ౩. వీర బ్రహ్మ 4. బాల బ్రహ్మ 5. స్వర్గ బ్రహ్మ 6. గరుడ బ్రహ్మ 7. విశ్వ బ్రహ్మ 8. పద్మ బ్రహ్మ 9. తారక బ్రహ్మ ఈ తొమ్మిది రూపాలతో, తొమ్మిది శివలింగాలను విడి విడిగా ఆలయాలలో ప్రతిష్టించి, బ్రహ్మ దేవుడు పూజించిన ఆలయాలు ఆంధ్రప్రదేశ్ లోని మెహబూబ్ నగర్ జిల్లా, అలంపూర్. ఇక్కడ యీ ఆలయాలు ఖ్యాతిగాంచినవి. 1. కుమార బ్రహ్మ: శ్రీ మహావిష్ణువు కి పుత్రుడైన బ్రహ్మదేవుడు సృష్టి కార్యాని విజయవంతంగా నిర్వహించడానికి ఇక్కడ తపస్సు చేసిన మూర్తి తెలుపుతుంది 2. అర్క బ్రహ్మదేవుడు : సూర్య మండలంలో నివసించే బ్రహ్మదేవుడు.పరమ శివుని పంచభూత రూపములలో ఒకటి అయిన సూర్య మండలంలో, యీ అర్క బ్రహ్మదేవుడు ఉన్నతంగా పూజింపబడుతున్నాడు. 3. వీర బ్రహ్మ రూపం: మూర్ఖులైన అసురులతో యుద్ధం చేసిన భంగిమని తెలియచేస్తున్నది. 4. బాల బ్రహ్మ రూపం: అత్రి, అనసూయ దంపతుల వద్ద బాలునిగా వున్న రూపం. 5. స్వర్గ బ్రహ్మ: యాగాలు చేసి ఉన్నతి పొందిన వారి స్వర్గ రక్షకుని రూపం. 6. గరుడ బ్రహ్మ: ఒకసారి పక్షి రూపంలో వున్న మునులకు, గరుడ పక్షి రూపంలో ఉపదేశంచేసినందున యీ పేరు వచ్చింది. 7. విశ్వ బ్రహ్మ రూపం: ఈ విశ్వాన్ని సృష్టించిన సమయంలో విశ్వబ్రహ్మ రూపం దాల్చాడు. 8. పద్మ బ్రహ్మ రూపం: శ్రీ మహావిష్ణువు నాభినుండి ఉద్భవించి పద్మంలో ఆశీనుడైనందున యీ పేరు వచ్చింది. 9. తారక బ్రహ్మ: తారక మంత్రానికి అధిదేవత అయినందున యీ పేరుతో పిలువబడుతున్నాడు. "ఓం వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి, తన్నో బ్రహ్మ ప్రచోదయాత్" #"భక్తి సమాచారం" #🙏🏻భక్తి కోట్స్📝 #🙏భక్తి స్పెషల్ #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status
@ విజ్జి @
1.3K వీక్షించారు
2 రోజుల క్రితం
ఈచిత్రాన్ని చిత్రించిన చిత్రకారుడి ప్రతిభ గమనించారా?🙏🌷🙏🌷🙏🌷🙏 తీక్షణంగా గమనించండి! సహకుటుంబంతో హనుమంత సమేతంగా త్యాగరాయులవారి కీర్తనలకు తన్మయత్వం చెంది శ్రీరాములవారు విచ్చేశారు. చిత్రకారుడు ఆనాటి కుటుంబనియమాలను మరువలేదు. తలుపుచాటునుండి త్యాగరాజులవారి ధర్మపత్నిని గమనించారా? పతియే ప్రత్యక్షదైవంగా భావించే ఆనాటి ఇల్లాళ్ళు సాక్షాత్ పరమాత్ముడే ఇంటికొచ్చినా పతి అనుమతి లేనిదే ఎదుటపడేవారుకాదు. ఇప్పటికీ నియమ నిష్టాగరిష్ఠుల ఇంటిస్త్రీలు తమవారి అదుపాజ్ఞలను జవదాటరు. అటువంటి స్త్రీమూర్తులకు పాదాభివందనం. 🙏🌷🙏🌷🙏🌷జై శ్రీరామ్ 🌷🙏🌷🙏🌷🙏 #"భక్తి సమాచారం" #🙏🏻భక్తి కోట్స్📝 #🙏భక్తి స్పెషల్ #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status
@ విజ్జి @
763 వీక్షించారు
2 రోజుల క్రితం
ఈ గుడిలో వినాయకుడు చెవిలో చెబితే కోరిక తిర్చేస్తాడుట!🌹🙏* ఇక్కడి వినాయకుడు చెవిలో ఏది చెబితే అది జరుగుతుంది. వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ, నిర్విజ్ఞం కురుమేదేవా, సర్వ కార్యేషు సర్వదా అంటూ వేడుకుంటే వినాయకుడు కోరిన కోరికలు తీరుస్తాడు. విజ్ఞానలన్నిటికీ అధిపతి అగ్రజుడుగా అగ్ర పూజలందుకున్న గణేశుడిని నిత్యం దేవతలందరూ ఆరాదిస్తారంటే ఆయన ఎంతటి శక్తి వంతమైన దేవుడనేది అందరికీ తెలుస్తోంది. అలాంటి వినాయకుడు అన్ని చోట్ల కొలువై భక్తులకు అండగా ఉంటాడు. స్వామి కొలువై ఉన్న పుణ్యక్షేత్రాలలో ఒకటైన శ్రీ లక్ష్మి గణపతి దేవాలయం తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు లో ఉంది. ఇక్కడ వెలసిన వినాయకుడు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాడు. ఎంతో పురాతనమైన ఈ ఆలయంలో వినాయకుడిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని చెబుతుంటారు. క్రీ శ 840 సంవత్సరంలో చాళుక్యులు ఈ ఆలయం నిర్మించినట్టు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉండే శాసనాల ద్వారా ఇది ఎంతటి పురాతన ఆలయమో అర్ధమవుతుంది. నిజానికి ఇక్కడున్న ఆలయం భూమిలోనే ఉండేదట. 19 వ శతాబ్దంలో ఒక భక్తుడికి వినాయకుడు కలలో కనిపించి తన ఉనికిని చాతినట్టుగా ప్రచారంలో ఒక కధ వినిపిస్తుంది. అప్పుడా భక్తుడు గ్రామస్తులకు ఆ విషయం చెప్పిఅ ఆలయాన్ని తవ్వించాడట. ఆ తరువాత వినాయకుడు బయటపడ్డాడని అప్పటి నుంచి ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినదనీ చెబుతున్నారు. భూమిలో నుండి బయటపడిన తరువాత వినాయక విగ్రహం పెద్దదయిందని ఇక్కడ ప్రచారం జరుగుతోంది ఈ వినాయకుడి ఆలయానికి ఎక్కడెక్కడి నుంచే భక్తులు వచ్చి తమ కోరికలను విన్నవించుకుంటున్నారు. విఘ్నేశ్వరుడి చెవిలో తమ కోరికలను చెప్పుకొని ముడుపు కడితే తమ కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అంతే కాకుండా నందీశ్వరుడిని, భూలింగేస్వరుడిని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ రాజరాజేశ్వర ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం లోకి వెళ్ళగానే దివ్యానుభూతి కలుగుతుందని భక్తులు చెబుతున్నారు. వీరభద్రుడు, సుబ్రమణ్య స్వామి కొలువై ఉన్నారు. ప్రతీ సంవత్సరం గణపతి నవరాత్రులతో పాటు సుబ్రమనయేశ్వర ఉత్సవాలు కూడా జరుగుతాయి. పూజలు, పారాయణాలు,దీపోత్సవాలను ఇలా అన్ని కార్యక్రమాలను కన్నుల పండువగా తిలకించవచ్చు. ఇక్కడ గణపతి హోమమ చేయిస్తే సాక్షాత్తూ ఆ కుటుంబానికి గణపతి అండగా ఉంటాడని భావిస్తారు. రాజమండ్రి నుంచి గాని, అనపర్తి నుంచి గాని బిక్కవోలుకు చేరుకోవచ్చు. #"భక్తి సమాచారం" #🙏🏻భక్తి కోట్స్📝 #🙏భక్తి స్పెషల్ #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status
@ విజ్జి @
618 వీక్షించారు
2 రోజుల క్రితం
చెట్టుకు ప్రదక్షణ చేయడం వల్ల ఫలితం :: ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క దేవతాశక్తి ఉంటుంది. ఈ సృష్టిలో మొత్తము 7 కోట్ల రకాల వృక్షజాతులు, 7 కోట్ల మహామంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రములన్నియు స్వర ప్రధానములు. ఉచ్చారణ, అక్షరదోషాలు లేకుండా చెయ్యాలి.* భూలోకంలో ఉన్న మానవుల యొక్క ముఖ యంత్రములలోని లోపాల వల్ల కొంతమంది మంత్రఉచ్చారణ సరిగ్గా చేయలేరు అందుకని అమ్మవారు ఈ 7 కోట్ల మంత్రములను 7 కోట్ల వృక్షజాతులుగా సృష్టించింది.* *వృక్షములన్నియు అమ్మవారి సృష్టిలో భాగమే. అమ్మవారి స్వరూపమే. అందువలనే అమ్మ వారిని వన దుర్గ స్వరూపంగా పూజిస్తారు.* *మంత్రఅనుష్ఠాన ఫలితమును చెట్టుకు ప్రదక్షిణ చేయడం ద్వారా పొందవచ్చును.* *రావిచెట్టుకు ఒకసారి ప్రదక్షిణ చేస్తే "ఓం నమో నారాయణాయ" అనే అష్టాక్షరీ మంత్రమును 108 సార్లు జపం చేసిన ఫలితం పొందుతారు. అదే 3 సార్లు ప్రదక్షిణ చేస్తే 1008 సార్లు అష్టాక్షరీమంత్రజపం చేసిన ఫలితం పొందుతారు.* *మఱ్ఱిచెట్టుకు ప్రదక్షిణ చేస్తే "ఓం క్లీం కృష్ణాయ గోపీజనవల్లభాయ స్వాహా" అనే కృష్ణమంత్రం జపం చేసిన ఫలితం వస్తుంది.* *ఇంటిలో తులసి చెట్టుకి ప్రదక్షిణ చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇంట్లో లక్ష్మి దేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది .* *ఇంటిలో కడిమి చెట్టు (కదంబవృక్షం) పెట్టుకొని దానికి ప్రదక్షిణ చేస్తే నిత్యం లలితాసహస్రనామం, బాలామంత్రం, పంచదశీ మహామంత్రం, షోడశాక్షరీ మంత్రం జపం చేసిన ఫలితం పొందవచ్చు.* *మేడిచెట్టుకు (ఔదుంబర వృక్షము) ప్రదక్షిణ చేస్తే అమ్మవారి యొక్క నవార్ణ మంత్రమును మరియు శ్రీ దత్త మూల మంత్రమును నిత్యం అనుష్ఠానం చేసిన ఫలితం పొందుతారు.* *బిళ్వ వృక్షానికి ప్రదక్షిణ చేస్తే 1000 సార్లు పంచాక్షరీ మంత్రజపం చేసిన ఫలితం లభిస్తుంది.* *జిల్లేడు చెట్టుకు ప్రదక్షిణ చేస్తే సూర్యభగవానుడిని అనుష్ఠానం చేసిన ఫలితం పొందవచ్చు.* 🕉️ ఓం నమశ్శివాయ || నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర #"భక్తి సమాచారం" #🙏🏻భక్తి కోట్స్📝 #🙏భక్తి స్పెషల్ #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status
See other profiles for amazing content