ఫాలో అవ్వండి
KR (king Rules)
@852466011
115
పోస్ట్
54
ఫాలోవర్స్
KR (king Rules)
673 వీక్షించారు
9 గంటల క్రితం
*“దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము; యెహోవా గొప్పకార్యములు చేసెను.” యోవేలు 2:21* ప్రియులారా, పాపం మన జీవితాన్ని బంధిస్తుంచి బానిసను చేస్తుంది. శాపం మన భవిష్యత్తును మూసివేస్తుంది. అయితే దేవుడు “భయపడకుము… నేను గొప్ప కార్యములు చేసెదను.” అంటున్నాడు. యోవేలు కాలంలో దేశం పాపం వల్ల కరువు, నష్టం, నిరాశ రాజ్యమేలింది. అయితే పశ్చాత్తాపం ఉన్న చోట దేవుని కృప ప్రవహిస్తుంది. 1. పాపం మనిషిని దేవుని నుండి దూరం చేస్తుంది. కానీ దేవుని కృప పాపం కంటే గొప్పది. యేసు క్రీస్తు రక్తము మన పాపాలను కడిగి, మనలను నీతిమంతులుగా నిలుపుతుంది. 2. శాపం నుండి ఆశీర్వాదానికి తీసుకొచ్చే దేవుడు. శాపమును కొట్టివేసి చెడిపోయిన సంవత్సరాలను కూడా పునరుద్ధరించే దేవుడు. “నాశనమైన సంవత్సరాలను మీకు తిరిగి ఇస్తాను” 3. దేవుడు బానిసత్వం నుండి స్వాతంత్ర్యానిస్తాడు. పాప బంధాలన్నీ బానిసత్వమే. కానీ మన దేవుడు విమోచకుడు. అందుకే సంతోషించి గంతులు వేయుము. యెహోవా గొప్ప కార్యములు చేసాడు అందుకే భయపడక, విశ్వాసంతో నిలబడి, ఆనందంతో దేవుని స్తుతిద్దాం. 🙏 http://youtube.com/post/UgkxseoMcne3mOJDSEG8pj_8bmmevtkLRvEK?si=fUZDhgILwqxrxqgp #💪పాజిటీవ్ స్టోరీస్ #😇My Status #🙆 Feel Good Status #🌅శుభోదయం #✝జీసస్ *Plz Subscribe, Share, Like and Comment*
KR (king Rules)
516 వీక్షించారు
1 రోజుల క్రితం
*రూతు 3:11 “నా కుమారీ, భయపడకుము; నీవు చెప్పినదంతయు నీకు చేసెదను…”* ఈ వాగ్దానం ఆధారం కోల్పోయి, ఒంటరిగా, నిరాధరమైన జీవితం గలవారికి ఇది ఒక భరోసా. రూతు తన భర్తను కోల్పోయిన వితంతువు. భవిష్యత్తు అంధకారంగా కనిపించిన ఆ క్షణంలో దేవుడు ఆమెను నిర్లక్ష్యం చేయలేదు. భయపడుతున్న హృదయాన్ని చూసి, “భయపడకుము” అని ముందుగా చెప్పాడు. మన జీవితాల్లో ఏ ఆధారం లేనప్పుడు, మనతో ఉంటారని నమ్మినవారు దూరమైనప్పుడు. ఒంటరితనం మనల్ని బలహీనపరుస్తుంది. కానీ దేవుడు మన పరిస్థితిని మాత్రమే కాదు, మన కన్నీళ్లను కూడా గమనిస్తాడు. “నీవు చెప్పినదంతయు నీకు చేసెదను” అన్న మాటలో దేవుని బాధ్యత, కరుణ, నిబద్ధత స్పష్టంగా కనిపిస్తాయి. భయంతో వణికే హృదయాలకు ధైర్యం పోసి, నిలబెట్టే శక్తి ఆయన వాగ్దానాల్లోనే ఉంది. దేవుడు నిరాధారులకు ఆశ్రయం, ఒంటరితనంలో చేయి పట్టుకునేవాడు, జీవితాలను నిలువపెట్టేవాడు. కాబట్టి ఈ రోజు ఎవరికైనా జీవితం అర్థంలేనిదిగా అనిపిస్తే “భయపడకుము.” దేవుడు నిన్ను చూస్తున్నాడు, నిన్ను విలువైనవాడిగా భావిస్తున్నాడు, నీ జీవితాన్ని తిరిగి నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్ 🙏 http://youtube.com/post/UgkxJctM1FklxgISHUpc_omafKk1dZNCm5Kp?si=McwBb9reTTPPCXB3l #✝జీసస్ #🌅శుభోదయం #🙆 Feel Good Status #😇My Status #💪పాజిటీవ్ స్టోరీస్
KR (king Rules)
432 వీక్షించారు
2 రోజుల క్రితం
కీర్తనలు 55:22 నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. ప్రియమైనవారలారా, మన జీవితంలో భారాలు లేని రోజు ఉందా? ఆర్థిక సమస్యలు, కుటుంబ ఆందోళనలు, ఆరోగ్య భయాలు, భవిష్యత్తుపై సందేహాలు. ఇవన్నీ మన హృదయాన్ని బరువెక్కిస్తాయి. కానీ ఈ వాగ్దానం మనకు ఒక గొప్ప ఆహ్వానం ఇస్తుంది: “నీ భారము యెహోవామీద మోపుము.” అంటే మన ఒంటరి బలంతో మోయకూడదు; యేసయ్య చేతుల్లో పెట్టాలి. “ఆయనే నిన్ను ఆదుకొనును.” మనం వదిలేసిన క్షణాలను దేవుడు పట్టుకుంటాడు. మన కన్నీళ్లను లెక్కపెట్టే దేవుడు, మన భారాన్ని కూడా మోస్తాడు. దేవుని కార్యం ఆలస్యం అనిపించవచ్చు గానీ, నిర్లక్ష్యం కాదు. మరింత ధైర్యం ఇచ్చి “నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.” పరిస్థితులు కదిలినా, మన పునాది కదలదు. దేవునిపై విశ్వాసం ఉంచినవాడు పడిపోకుండా ఆయన నిలబెడతాడు. కాబట్టి ఈ రోజు, మన హృదయ భారాన్ని ప్రార్థనగా మార్చుదాం. మన భయాలను విశ్వాసంతో మార్పు చేద్దాం. భారాన్ని వదిలేసి, భరోసాను ధరించుదాం. యెహోవా మన భారాన్ని మోసే దేవుడు—మనము ఒంటరివాళ్లు కాదు. 🌿 http://youtube.com/post/Ugkxw8PbWkh6l7UgJtyAJzRtrPwCwuIkfE4U?si=7BwoNzqDdyfd7cKZ #💪పాజిటీవ్ స్టోరీస్ #😇My Status #🙆 Feel Good Status #🌅శుభోదయం #✝జీసస్ *Plz Subscribe, Share, Like*
KR (king Rules)
345 వీక్షించారు
3 రోజుల క్రితం
కీర్తనలు 94:18 “యెహోవా, నీ కృప నన్ను బలపరచుచున్నది.” ప్రియ సహోదరులారా, మన జీవితంలో కొన్ని సమయాలు మన శక్తి పూర్తిగా క్షీణించినట్లు అనిపిస్తుంది. మన ప్రయత్నాలు, జ్ఞానం, బలం అన్నీ అయిపోతాయి. అటువంటి వేళ మనలను నిలబెట్టేది ఒక్కటే దేవుని కృప. దేవుని కృప లేకుండా మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. అది మన అర్హత వల్ల, ప్రతిభ వల్ల కాదు; ఆయన అపారమైన ప్రేమ వల్ల మనకు లభించే వరం. మనం జారిపడుతున్నప్పుడు, “నా కాలు తొట్రిల్లింది” దేవుడు తన కృపతో బలపరచినప్పుడు, బలహీనుడైన మనిషి ధైర్యవంతుడవుతాడు, నిరాశలో ఉన్న హృదయం ఆశతో నిండుతుంది, ఓడిపోయానని అనుకున్న జీవితం మళ్లీ ముందుకు సాగుతుంది. మన పరిస్థితులు మారకపోయినా, మన అంతరంగంలో బలం కలుగుతుంది. కన్నీళ్ల మధ్యలోనూ శాంతి అనుభవిస్తాం. ఎందుకంటే దేవుని కృప మనలను లోపల నుండి బలపరుస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం ప్రార్థించవలసింది ఇదే“ప్రభువా, నీ కృప నాకు చాలును. నా బలహీనతలో నీవే నా బలం.” ఆ కృప ఉన్నచోట మన జీవితం నిలబడుతుంది, ముందుకు నడుస్తుంది, విజయం అనుభవిస్తుంది. http://youtube.com/post/Ugkxs3ZBAqctmmtG9CNZfeYbbtnyM1dfnLCo?si=_67IvE1Zf8SJyZw4 #✝జీసస్ #🌅శుభోదయం #🙆 Feel Good Status #😇My Status #💪పాజిటీవ్ స్టోరీస్ Plz Subscribe, Share, Like and Comment
KR (king Rules)
632 వీక్షించారు
6 రోజుల క్రితం
యెషయా 66:12 యెహోవా సెలవిచ్చుచున్నాడు “ఐశ్వర్యము అనుభవించునట్లు ఒడ్డుమీద పొర్లిపారు జలప్రవాహమువలె మీయొద్దకు దానిని రాజేతును.” ఈ వాగ్ధానము దేవుని దయ ఎంత విస్తారమో చూపిస్తుంది. దేవుని ఆశీర్వాదం అడ్డుకట్టలు చెదిరిపోయిన ప్రవాహంలా వస్తుంది. మనుషులు కొలుస్తారు, అంచనా వేస్తారు; దేవుడు మాత్రం హద్దులు పెట్టడు. ప్రపంచం నీవు పనికి రాని వాడివి అని ముద్ర వేస్తే, దేవుడు “నీవు నా చేతిలో పాత్రవు అంటాడు. మన అర్హతలు లేని చోటే ఆయన కృప మొదలవుతుంది. ఎందుకంటే ఆయన దయ మన స్థితిపై కాదు, ఆయన స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ఇశ్రాయేలు జనులు చెరలో ఉన్నప్పుడు కూడా దేవుడు “ప్రవాహంలా” ఆశీర్వాదాన్ని విడుదల చేశాడు. అదే విధంగా, నేడు నిన్ను నీవే పనికిరాని వాడిగా భావించినా, దేవుడు నిన్ను తన సమృద్ధికి వారసుడిగా చూస్తున్నాడు. ఆయన దయ నిన్ను పోషిస్తుంది, పునరుద్ధరిస్తుంది, గౌరవంతో నింపుతుంది. కాబట్టి భయపడకు నీవు శూన్యమని అనుకున్న చోటే ఆయన ఐశ్వర్యం వెల్లువెత్తుతుంది. దేవుని చేతిలో ఉన్నవాడు ఎప్పటికీ పనికిరాని వాడు కాడు ప్రవాహం మధ్య నిలిచిన ఆశీర్వాదపు పాత్ర. ఆమేన్ http://youtube.com/post/UgkxypyuClJeJyV3rwlKyBAmVxPk1hXdpGyr?si=Ubwtft7ApQ42n9_b #✝జీసస్ #🌅శుభోదయం #🙆 Feel Good Status #😇My Status #💪పాజిటీవ్ స్టోరీస్
KR (king Rules)
490 వీక్షించారు
7 రోజుల క్రితం
*యిర్మియా 33:6 లో దేవుడు చెప్పిన మాట ఒక సాధారణ వాగ్ధానం కాదు, “నేను ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించుచున్నాను” అని దేవుడు మనుష్యుని మొత్తం జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు. శరీరం నొప్పితో ఉన్నప్పుడు మాత్రమే కాదు, మనసు అలసిపోయినప్పుడు, ఆత్మ నిరాశలో మునిగినప్పుడు దేవుడు స్వస్థతను ప్రకటిస్తున్నాడు.* మన శారీరక బలహీనతలు దేవునికి తెలుసు. రోగం, నొప్పి, అలసటతో ఉన్నవారికి ఆయన “నేనే నీ స్వస్థత” అని ధైర్యం ఇస్తున్నాడు. అదే విధంగా మనసులో దాగిన భయాలు, గాయాలు, నిరాశలను కూడా దేవుడు నయం చేస్తాడు. మనం మానసికంగా కూలిపోతున్న వేళ, దేవుడు మనస్సుకు శాంతిని, స్థిరత్వాన్ని ఇస్తాడు. అన్నిటికన్నా ముఖ్యంగా మనం పాపం, అపరాధ భావనతో దేవుని నుండి దూరమైనప్పుడు దేవుడు ఆత్మను స్వస్థపరుస్తాడు, తిరిగి జీవింపజేస్తాడు. మన ఆశను వెలిగించి, కొత్త ఆరంభాన్ని ఇస్తాడు. దేవుడిచ్చే స్వస్థత నుంచే ధైర్యం పుడుతుంది. పరిస్థితులు మారకపోయినా, భయానికి చోటు లేకుండా, విశ్వాసం పుడుతుంది. ఆయన వాగ్ధానం నెరవేరే వరకు మన జీవితం ఆశతో కొనసాగించబడుతుంది. ఆమెన్ http://youtube.com/post/Ugkxf9DgWX8_pgrVji9B98NHDdivzPMl9WMD?si=BTndWPLz5da7TCXf #💪పాజిటీవ్ స్టోరీస్ #😇My Status #🙆 Feel Good Status #🌅శుభోదయం #✝జీసస్
KR (king Rules)
524 వీక్షించారు
9 రోజుల క్రితం
*"1 రాజులు 6:12 నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను”* ప్రియులారా, దేవుడు మనతో చేసిన వాగ్దానాలు మన పరిస్థితులపై ఆధారపడి ఉండవు—అవి దేవుని నమ్మకత్వంపై ఆధారపడి ఉంటాయి. మనం బలహీనులమైనప్పుడు ఆయన వాగ్దానము మన కొరకై నిలుస్తుంది. ఆలయం నిర్మాణం మధ్యలో ఉన్నప్పుడు సొలొమోనునికి దేవుడు చెప్పిన ఈ మాట, పని పూర్తయ్యేలోపు భరోసాను ఇచ్చింది. అదే విధంగా, మన జీవితంలో అర్ధాంతరాలు, ఆలస్యాలు, అనిశ్చితులు ఎన్ని ఉన్న దేవుని వాగ్దానము మన పక్షముగా నిలిచి మన జీవితమునకు దిశను, ధైర్యానిస్తుంది. ఎందుకంటే పరిస్థితులు మారినా దేవుడు మారడు. మనం విశ్వాసంతో నడిచినప్పుడు, ఆయన చెప్పిన మాటను నెరవేర్చుటకు తానే కట్టుబడి ఉంటాడు. అందుకే ఈ రోజు భయపడకండి. నిరుత్సాహపడకండి. దేవుడు చెప్పినది ఆయన చేస్తాడు. మీ జీవితములలో దేవుని వాగ్దానం అవునన్నట్లుగానే ఉన్నది మరియు మీ పక్షముగానే స్థిరపరచబడుతుంది. ఇట్టి నమ్మకత్వంలో నిలిచి ముందుకు సాగుదాం. దేవుడు మనతో ఉన్నాడు. ఆమెన్.. http://youtube.com/post/UgkxS-QIZT_t5kug53bB3MyxiOj_rkTMjTuF?si=yCKWGpG2pL61CDSe #💪పాజిటీవ్ స్టోరీస్ #😇My Status #🙆 Feel Good Status #🌅శుభోదయం #✝జీసస్ *Plz Subscribe, Share, Like and Comment*
KR (king Rules)
793 వీక్షించారు
10 రోజుల క్రితం
*యెషయా 54:10 పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు...* ప్రియమైన సహోదరులారా, మన జీవితాల్లో కొన్నిసార్లు పర్వతాల్లాంటి బలమైన ఆధారాలు కూలిపోతున్నట్టు అనిపిస్తుంది. నమ్ముకున్న సంబంధాలు దూరమవుతాయి, ఆశలు మెట్టలులా తత్తరిల్లినట్టు కనిపిస్తాయి. అప్పుడు మన గుండెల్లో భయం, అనిశ్చితి చోటుచేసుకుంటాయి. కానీ యెహోవా చెబుతున్నాడు. “పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు.” మన చుట్టూ ఉన్న ప్రతిదీ మారిపోయినా, దేవుని కృప మాత్రం మారదు. మన స్థితిపై కాదు, ఆయన స్వభావంపైనే ఆ కృప ఆధారపడింది. ఈ రోజు నీ పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నట్టు కనిపించినా, దేవుని ప్రేమ నీ పక్షాన నిలిచివుంది. నీవు ఒంటరివాడివి కాను. ఆయన కృప నీకు కవచమై ఉంది, నీ భవిష్యత్తుకు భరోసాగా ఉంది. కాబట్టి భయపడకుము. గుండెల్లో నిబ్బరం పెట్టుకొనుము. ఈ క్షణికమైన కదలికలు నిన్ను కూల్చలేవు—ఎందుకంటే కదలనిది అయిన దేవుని కృప నిన్ను పట్టుకొని ఉంది. ఆ కృపలో నిలబడి, ధైర్యంగా ముందుకు సాగుము. ✨ http://youtube.com/post/Ugkx6oqUX_Shkf6Pk1UErwhU_RVIba9bXLwO?si=DeIyPZ1pIfvqRtCD #✝జీసస్ #🌅శుభోదయం #🙆 Feel Good Status #😇My Status #💪పాజిటీవ్ స్టోరీస్ *Plz Subscribe, Share, Like and Comment*
See other profiles for amazing content