ఫాలో అవ్వండి
Ravi Talluri
@91775
67,165
పోస్ట్
30,844
ఫాలోవర్స్
Ravi Talluri
553 వీక్షించారు
16 గంటల క్రితం
*_ఇది సినిమా కథ అని భ్రమపడకండి. ఎందుకంటే ఏ సినిమా రైటర్ కూడా ఇంత దారుణమైన కష్టాలను ఊహించలేడు. ఏ డైరెక్టర్ కూడా ఇంతటి ఎమోషన్ ని స్క్రీన్ మీద చూపించలేడు._* *_ఇది ఒక ఆడది.. అగ్నిపర్వతంలా మారిన కథ_*. *సమాజం "ఛీ, కుక్క" అని తరిమేస్తే.. అదే సమాజానికి అమ్మగా మారిన ఒక దేవత కథ.* *_ఆమె పేరు.._* *సింధుతాయ్ సప్కల్.* *మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామం. వర్ధా జిల్లా.* *అది ఒక అమావాస్య రాత్రి. బయట కుండపోత వర్షం. ఉరుములు, మెరుపులు ఆకాశాన్ని చీల్చేస్తున్నాయి.* *ఆ ఊరి చివర ఉన్న ఒక పాడుబడ్డ గొడ్డు చావిడి అది. లోపల కటిక చీకటి. పేడ వాసన.* *ఆ బురదలో, ఆవుల మధ్య ఒక 20 ఏళ్ల నిండు గర్భిణి ప్రాణభయంతో వణికిపోతోంది.* *కొద్దిసేపటి ముందే.. ఆమె భర్త ఆమెను చితకబాదాడు. ఎవరో గిట్టనివాళ్ళు చెప్పిన అబద్ధపు మాటలు నమ్మి, కడుపుతో ఉన్న భార్య అని కూడా చూడకుండా, ఆ నిండు గర్భిణి పొట్ట మీద బలంగా తన్నాడు.* *"నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు.. పో.. ఎక్కడైనా చావు" అని జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి ఆ గొడ్డు చావిడిలో విసిరేశాడు*. *పురిటి నొప్పులు మొదలయ్యాయి*. *అరుపులు గొంతులోనే ఆగిపోతున్నాయి. బయట ఉరుముల శబ్దం.. లోపల ఆ తల్లి ఆర్తనాదం*. *సహాయం చేయడానికి మనిషి లేడు. మంచి నీళ్ళు ఇచ్చే నాధుడు లేడు*. *చుట్టూ ఉన్న ఆవులు ఆమె బాధను చూసి దగ్గరకు వచ్చాయి. ఎక్కడ తొక్కుతాయో అని ఆమె భయపడింది. కానీ ఆ మూగజీవాలు ఆమె చుట్టూ రక్షణగా నిలబడ్డాయి*. *ఆ అర్ధరాత్రి.. ఆవు పేడలో, బురదలో.. ఆమె ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టింది.. కానీ బొడ్డు తాడు కోయడానికి కత్తి లేదు*. *_రక్తం కారుతోంది. ఏం చేయాలి?_* *ఆమె కళ్ళలో నిప్పులు రగిలాయి. పక్కనే పడి ఉన్న ఒక పదునైన రాయిని తీసుకుంది. తన చేతితోనే.. ఆ రాయిని పట్టుకుని.. దాన్ని బలంగా మోదుతూ, తన కడుపు పేగును తనే తెంచుకుంది*. *_ఊహించగలరా ఆ నరకాన్ని?_* *ఒక ఆడది.. అంతకంటే దారుణమైన స్థితిలో ఉండగలదా?* *అక్కడితో అయిపోలేదు. ఆ రాత్రే బిడ్డను గుండెలకు హత్తుకుని, రక్తమోడుతున్న శరీరంతో కిలోమీటర్లు నడిచింది. తన పుట్టింటికి వెళ్ళింది. కనీసం కన్నతల్లి అయినా చేరదీస్తుంది కదా అని*. *కానీ ఆ తల్లి, "భర్త వదిలేసిన దానివి.. నీవల్ల మాకు పరువు తక్కువ. పో..* *ఎక్కడైనా చావు" అని ముఖం మీద తలుపు వేసింది. ఇప్పుడు ఆమెకు రెండే దారులు ఉన్నాయి*. *_ఒకటి ఆత్మహత్య చేసుకోవడం. రెండు.. ఆకలితో చావడం._* *_ఆమె రైల్వే స్టేషన్లకు వెళ్ళింది. బిచ్చగత్తెలా మారింది._* *_పగలు రైల్వే ప్లాట్ఫారమ్ మీద పాటలు పాడుతూ బిచ్చం ఎత్తుకునేది. రాత్రి ఎక్కడ పడుకునేదో తెలుసా?_* *_స్మశానంలో!_* *అవును. ఎందుకంటే స్మశానంలో దెయ్యాలు ఉంటాయని మనుషులు భయపడతారు. కానీ ఆమెకు దెయ్యాల కంటే మనుషులంటేనే ఎక్కువ భయం.* *"ఇక్కడైతే ఏ మగాడు నన్ను రేప్ చేయడు" అనే నమ్మకంతో శవాల మధ్య నిద్రపోయేది*. *ఆకలి వేస్తే.. శవాల మీద చల్లిన పిండిని, అక్కడ పడేసిన తిండిని తినేది.* *కొన్నిసార్లు చలికి తట్టుకోలేక, కాలుతున్న చితిమంటల దగ్గర కూర్చుని చలి కాచుకునేది. ఆమె చేతిలో ఉన్న పసిగుడ్డు ఆకలితో ఏడుస్తోంది. తన కడుపులో పేగులు కాలిపోతున్నాయి.* *ఒకరోజు.. ఇక బతకడం వేస్ట్ అనిపించింది. రైలు కింద పడి చచ్చిపోదాం అని డిసైడ్ అయ్యింది*. *అప్పుడే ఆమెకు ఒక దృశ్యం కనిపించింది*. *ఒక ముసలి బిచ్చగాడు.. ఆకలితో "అమ్మా.. అన్నం" అని అరుస్తూ చనిపోయే స్థితిలో ఉన్నాడు*. *ఆమె చేతిలో తను బిచ్చమెత్తుకోగా వచ్చిన ఒక రొట్టె ముక్క ఉంది. ఆమె ఆలోచించింది. "నేను ఎలాగూ చచ్చిపోవాలనుకుంటున్నాను కదా*. *చచ్చే లోపు ఈ రొట్టె వాడికి ఇస్తే, కనీసం వాడైనా బతుకుతాడు కదా" అనుకుంది.* *వెళ్లి ఆ రొట్టె ముక్క వాడి నోట్లో పెట్టింది.* *వాడు కళ్ళలో నీళ్లతో ఆమెను చూసి చేతులు జోడించాడు.* *ఆ క్షణం.. ఆమెలో ఒక ప్రళయం వచ్చింది.* *"నా ఆకలి నా ఒక్కదానిదే కాదు. ఈ ప్రపంచంలో ఎంతోమందికి అమ్మ లేదు. ఎంతోమందికి తిండి లేదు. వాళ్ళందరికీ నేను అమ్మను అవుతాను. నేను బతకాలి.. వాళ్ళ కోసం బతకాలి."* *అంతే.. సింధుతాయ్ సప్కల్ అనే అబల.. "మదర్ ఆఫ్ ఆర్ఫన్స్" గా మారింది*. *ఆమె రోడ్ల మీద దొరికిన అనాథ పిల్లలను చేరదీసింది. వాళ్ళ కోసం భిక్షాటన చేసింది. "నా పిల్లలకు ఆకలి వేస్తోంది.. ధర్మం చేయండి" అని గొంతెత్తి అరిచింది*. *ఆమె ఆవేదన చూసి జనం కదిలిపోయారు. డబ్బులు ఇచ్చారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. అక్షరాలా 1400 మంది అనాథ పిల్లలకు ఆమె అమ్మ అయ్యింది*. *ఎవరు విసిరేసినా, ఎవరు వద్దన్నా.. వాళ్ళందరినీ తన కొంగులో దాచుకుంది. వాళ్ళని చదివించింది. డాక్టర్లను చేసింది. ఇంజనీర్లను చేసింది. ఆమె పడుకున్న స్మశానం ప్లేస్ లోనే పెద్ద ఆశ్రమాలు కట్టింది*. *ప్రపంచం మొత్తం ఆమెను నెత్తిమీద పెట్టుకుంది. 750కి పైగా అవార్డులు ఆమె కాళ్ళ దగ్గరకు వచ్చాయి. భారత ప్రభుత్వం "పద్మశ్రీ" ఇచ్చి గౌరవించింది*. *కానీ ఈ కథలో అసలైన "ట్విస్ట్" ఇప్పుడు ఉంది*. *చాలా ఏళ్ల తర్వాత.. ఆమె బాగా ముసలిది అయ్యాక.. ఆమె ఆశ్రమానికి ఒక ముసలివాడు వచ్చాడు*. *చినిగిపోయిన బట్టలు, వణుకుతున్న శరీరం.* *వచ్చి ఆమె కాళ్ళ మీద పడి బోరున ఏడ్చాడు. "నన్ను క్షమించు సింధు.. నేను పాపాత్ముడిని. నిన్ను గొడ్డు చావిడిలో తన్ని తరిమేసిన నీ భర్తని నేనే. ఇప్పుడు నాకు ఎవరూ లేరు. నన్ను కూడా నీ అనాథాశ్రమంలో చేర్చుకో" అని వేడుకున్నాడు*. *_ఆ ప్లేస్ లో వేరే ఆడది ఉంటే ఏం చేస్తుంది?_* *"ఛీ కుక్క.. ఆరోజు నన్ను చంపాలని చూసావ్.. ఇప్పుడు నా కాళ్ళ దగ్గరికి వచ్చావా?" అని కాలితో తన్ని తరిమేస్తుంది.* *ప్రతీకారం తీర్చుకుంటుంది.* *కానీ సింధుతాయ్ చేసింది చూస్తే.. మీ గుండె బరువు ఎక్కాల్సిందే*. *ఆమె నవ్వింది. "నేను ఇప్పుడు కేవలం సింధుని కాదు.. వేల మందికి తల్లిని. ఒక తల్లి తన బిడ్డను ఎలా కాదంటుంది?" అంది*. *ఆ ముసలివాడిని లేపి, కన్నీళ్లు తుడిచి..* *"ఇదిగో.. ఇన్నాళ్లూ నువ్వు నా భర్తవి. కానీ ఈ రోజు నుండి నువ్వు నా భర్తవి కాదు.. నా పెద్ద కొడుకువి. ఈ ఆశ్రమంలో మిగతా పిల్లల్లాగే నువ్వు కూడా నా బిడ్డగా ఉండు" అని చెప్పింది*. *ఆమె గొప్పతనం చూసి ఆ భర్త అక్కడే కుప్పకూలిపోయాడు*. *ప్రతీకారం అంటే చంపడం కాదు.. క్షమించి బ్రతకనివ్వడం అని ప్రపంచానికి చాటి చెప్పింది*. *నీకు కష్టాలు వచ్చాయని ఏడుస్తున్నావా?* *వర్షంలో, పేడలో, కత్తి కూడా లేని టైంలో రాళ్ళతో బొడ్డు కోసుకున్న సింధుతాయ్ ముందు నీ కష్టం ఎంత?* *స్మశానంలో శవాల మధ్య రొట్టెలు కాల్చుకుతిన్న ఆమె దారిద్ర్యం ముందు నీ పేదరికం ఎంత?* *జీవితం నిన్ను ఎంత కిందకి తొక్కితే.. నువ్వు అంత పైకి ఎగరాలి*. *బంతిని నేలకేసి కొడితేనే అది ఆకాశం వైపు లేస్తుంది.* *నిన్ను ఎవరైనా అవమానిస్తే.. వాళ్ళని తిరిగి తిట్టకు.* *నీ సక్సెస్ తో వాళ్ళు సిగ్గుపడి తలదించుకునేలా చెయ్.* *ఎంతలా అంటే..* *నిన్ను తన్ని తరిమేసిన వాళ్ళే, చివరికి నీ కాళ్ళ దగ్గరకు వచ్చి బ్రతుకును అడుక్కునేలా ఎదగాలి.* *ఆమె దగ్గర డబ్బు లేదు, ఆస్తి లేదు, అందం లేదు, చదువు లేదు.* *ఉన్నదల్లా ఒక్కటే.. "గుండె ధైర్యం".* *చావు అంచుల దాకా వెళ్ళావా? పర్లేదు.* *అక్కడ నుండే అసలైన జీవితం మొదలవుతుంది*. *లే.. కన్నీళ్లు తుడుచుకో.* *నీ జీవితాన్ని ఒక చరిత్రగా మార్చుకో. ఎందుకంటే నువ్వు సామాన్యుడివి కాదు.. ఒక యోధుడివి!* *_నల్లమోతు శ్రీధర్_* *_గారి పోస్టు_* #మన సంప్రదాయాలు సమాచారం
Ravi Talluri
558 వీక్షించారు
16 గంటల క్రితం
*_వింత దేవాలయం!🙏_* *[మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్రసాదం పెడితే ప్రత్యక్షంగానే ఆయన భుజిస్తారు. సమర్పించిన నైవేద్యం అందరూ చూస్తుండగానే మాయమవుతుంది*. *గ్రహణం సమయంలో కూడా తెరిచి ఉండే ఏకైక కేరళ దేవాలయం తిరువరపు శ్రీకృష్ణ దేవాలయం, కొట్టాయం*. *అర్ధరాత్రి ఏకాంతసేవ తర్వాత కూడా దీపారాధన చేసే ప్రపంచంలోని అరుదైన హిందూ దేవాలయంగా పిలుస్తారు*. *ఇక్కడి కృష్ణపరమాత్మ మూర్తి చాలా ఆకలితో ఉంటారు. ఇక్కడ అర్చకులు రోజుకు 7 సార్లు స్వామికి మహా నైవేద్యాన్ని సమర్పిస్తారు. సమర్పించిన నైవేద్యం ప్రతిసారి కొంచెం తగ్గుతూ ఉండటం తరుచుగా గమనిస్తుంటారు. స్వామివారు స్వయంగా తింటారు అని ఇక్కడి భక్తుల విశ్వాసం. అదే విధంగా అందరూ చూస్తుండగానే ప్రసాదం మాయమవుతుంది*. *గుడి తెల్లవారుజావున 2 గంటలకు తెరుస్తారు. సాధారణంగా అన్ని దేవాలయాలలో అభిషేకం, అలంకరణ అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు కానీ ఈ దేవాలయంలో నైవేద్యం నివేదన చేసిన తర్వాత అభిషేకం, అలంకరణ చేస్తారు*. *నైవేద్యం సమర్పించడంలో కొంత ఆలస్యమైనా, ఆలయ ప్రధాన ద్వారం తెల్లవారుజామున తెరవకపోయినా చాలా దోషంగా భావిస్తారు. అందుకే ప్రధాన అర్చకుడి చేతిలో గొడ్డలి పట్టుకుంటారు. ఏదేని కారణం చేత తాలం పనిచేయకపోయినా, తాలం పోయినా, గొడ్డలితో తాలాన్ని పగలకొట్టడం ఇక్కడి ఆనవాయితీ.* *📿 కృష్ణుడికి చేసే నైవేద్యం చాలా రుచికరంగా ఉంటుంది. స్వామికి నివేదించిన అనంతరం భక్తులందరికీ ప్రసాదం పంచుతారు. ప్రసాదం తీసుకోకుండా ఏ భక్తుడూ ఆకలితో వెళ్ళకూడదని ఇక్కడి నియమం. అందుకే అర్చక స్వాములు “ఇంకా ఎవరైనా ప్రసాదం తీసుకోనివారు* *ఉన్నారా అని పెద్ధగా అరుస్తారు”.* *📿 కృష్ణుడికి సమర్పించే నైవేద్యం ఆలస్యమైతే ఆకలికి తట్టుకోలేక కడుపు ఖాళీ అవ్వడం చేత స్వామివారి నడుము చుట్టూ కట్టిన ఆభరణం వదులై కొన్ని ఇంచులు క్రిందకు దిగడం మనం చూడవచ్చు. పూర్వం గ్రహణం సమయంలో ఆలయం మూయడం వలన ఇలాంటి అపసృతి చోటు చేసుకోవడం వలన, ఈ దేవాలయాన్ని గ్రహణం సమయంలోనే కాదు మరెప్పుడూ మూయరు .* *📿 గ్రహ దోషాలు, గ్రహణ దోషాలు, సంతాన దోషాలు, సర్పదోషాలు, వ్యాపారాలలో నష్ట దోషాలు, వివాహ దోషాలు, బ్రహ్మహత్య వంటి మహాపాతకాలు ఏమున్నా సరే ఇక్కడికి వచ్చి కృష్ణపరమాత్మను దర్శించి, పూజిస్తే దోషాలు నివారింపబడుతాయి. దేవతలు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు కృష్ణభగవాణుడి సేవకులు కనుక ఇక్కడి కృష్ణభక్తులకు ఎటువంటి జాతక దోషాలు అంటవని స్వామిని భక్తితో కొలుస్తారు.* *📿 సైంటిష్టులకు కూడా అంతుచిక్కని ఎన్నో అద్భుతాలు ఈ ఆలయంలో జరిగాయి. భగవంతుడు ఉన్నాడు అని చెప్పడానికి ఇంత కన్నా గొప్ప దేవాలయం ఎక్కడ ఉంటుంది!* #మన సంప్రదాయాలు సమాచారం
Ravi Talluri
534 వీక్షించారు
16 గంటల క్రితం
*_మహాభారతంలో మొత్తం మీద అత్యంత అదృష్టవంతుడు #ధృతరాష్ట్రుడు.._* *పుట్టిన దగ్గర నుండి రాజభోగాలు అనుభవించాడు*. *రాజుగా అర్హత లేకపోయినా తమ్ముడైన పాండురాజు వల్ల రాజపీఠం దక్కింది*. *పాండురాజు ప్రపంచాన్ని జయించి సంపదలు తెస్తే వాటిని అనుభవించాడు*. *గాంధారి ద్వారా నూట ఒక్కమంది సంతానాన్ని పొందాడు.* *దాసి ద్వారా సంతానాన్ని పొందాడు. మొత్తం 100మంది భార్యలు*.. *"గుఱ్ఱం గుడ్డిదైనా దాణాకి తక్కువ లేదు " ఇందుకే వచ్చింది ఈ సామెత..* *పాండురాజు అనంతరం పాండవులు రాజ్యాలు గెలిచి సంపదలు తెచ్చిచ్చారు*.. *ధర్మరాజు ధృతరాష్ట్రుడి మాట శాసనంగా భావించేవాడు*. *కొడుకు పాండవుల మీద ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా మందలించేవాడు కాదు. పైగా రాజ్యకాంక్ష బాగా ఉంది. తదనంతరం అంతా కొడుక్కి ఇవ్వాలని తీవ్రమైన కోరిక వల్ల* *దుర్యోధనుడు ఏమి చేసినా ఏమి అనేవాడు కాదు*. *భాగం పంచాల్సిన సమయంలో కొడుక్కి రాజ్యం ఇచ్చి,* *ఎందుకు పనికిరాని బీడు భూమిని, అరణ్యాన్ని భాగంగా ధర్మరాజుకి ఇచ్చాడు.* *పెదనాన్న ఇచ్చాడు కనుక కిమ్మనకుండా సరేనన్నాడు ధర్మరాజు.. తనభాగం తీసుకొని ఆ ప్రదేశానికి వెళుతుండగా అప్పటికే పాండవులు మహాత్ములుగా జనంలో పేరు రావడంతో సగంమంది పైగా ఆ రాజ్య జనం పాండవుల వెంట వచ్చేశారు. ఆ బీడు భూమిని శ్రీకృష్ణుడి సాయంతో మయుడి ద్వారా 8నెలల కాలంలో ఈ భూమిమీద ఎవరు నిర్మించలేని అద్భుత నిర్మాణం నిర్మింపజేశాడు. అందులో మయసభ ఒకటి..* *యుధిష్ఠిరుడు తన తమ్ముళ్ళ ప్రతాపం ద్వారా ప్రపంచాన్ని గెలిచి, లెక్కలేనంత సంపదలు పొంది, రాజసూయయాగం చేశాడు. ఆ సంపదలు, వచ్చిన బహుమతులు లెక్కపెట్టడానికి దుర్యోధనుడికి చేతులు పడిపోయాయి*. *నీరసం కమ్మేసింది. ఇంత సంపదలు ఈర్ష్యద్వేషాలు ఉన్నవారికి నిద్రపట్టనిస్తాయా?* *కుట్రపన్ని జూదం ద్వారా మొత్తం లాగేసారు. ద్రౌపతి ఏకవస్త్రగా ఉన్నా కూడా పట్టించుకోకుండా చీరలు ఊడదీయడానికి వెనుకాడలేదు. ఇన్ని జరుగుతున్నా నోరుమెదపలేదు దృతరాష్ట్రుడు.* *భీమసేనుడి శపథం విన్నాక భయపడి ద్రౌపతి వంకతో రాజ్యం ఇచ్చినట్లు ఇచ్చి పునః జూదం ఆడించి మళ్ళీ లాగేశారు. అన్ని భోగాలు పోయి చివరికి అడవులపాలయ్యారు. అయినా దృతరాష్ట్రుడు దుర్యోధనాదులకు శాంతి లేదు. ఆజ్యం పోయడానికి కర్ణుడు, శకుని ఉండనే ఉన్నారు. అడవుల్లో వాళ్ళ మానాన వాళ్లంటే వెళ్ళి రెచ్చగొట్టబోయారు. గంధర్వులు వచ్చి కర్ణుడిని సైన్యాన్ని చితక్కొట్టి దుర్యోధనుడిని జుట్టుపట్టి కట్టి బంధించి తీసుకుపోతుంటే, దుర్యోధనుడి భార్యల ద్వారా విషయం తెలిసిన ధర్మరాజు భీముడిని అర్జునుడిని పంపించి విడిపించి "అన్నిసార్లు తెగింపు మంచిది కాదు" ఇక రాజ్యానికి తిరిగి వెళ్ళు అంటే దుర్యోధనుడికిచచ్చినంత పనైంది..* *ప్రాయోపవేశం చేయబోతే పాతాళ లోక వాసులు వచ్చి దుర్యోధనుడి జీవుడిని తీసుకెళ్లి "నాయనా! మేమంతా ఎంతో తపస్సు చేసి నిన్ను కనుగొన్నాం. శ్రీకృష్ణుడి చేతిలో నరకాసురుడు మరణిస్తే ఆయన ఆత్మని నీలో అవహింపజేశాము. భూలోకాన్ని అల్లకల్లోలం చేయడానికి నిన్నే నమ్ముకుని ఉంటే నువ్వు ప్రాయోపవేశానికి పూనుకుంటే మేమంతా ఏమైపోవాలి. ఆనాడు మాయాజూదంలో దైవశక్తులైన వారు భీష్మద్రోణాదులను దుష్టశక్తులమైన మేము అవహించి ఉండటం వలన వారు నీకు ఎదురు చెప్పలేకపోయారు. వారు నీతో కలిసే యుద్ధం చేసేలా రంగాన్ని సిద్ధం చేశాం. కాబట్టి దిగులు చెందకుండా రాజ్యానికి తిరిగి వెళ్ళు. అంటే తిరిగి వచ్చాడు.* *వచ్చిన దగ్గర నుండి అనేక విధాలుగా పాండవుల్ని ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. అయినా నియమానికి కట్టిబడి ఉన్నారు తప్ప అతిక్రమించలేదు.* *ఉత్తర గ్రహణం లో అర్జునుడు కర్ణుడిని వెంటపడి మరీ కొట్టాడు.. కర్ణుడి తమ్ముడి తల నరికేశాడు. భీష్మాదులను ఓడించాడు. దుర్యోధనుడిని చితక్కొట్టాడు.. అనవసరంగా వెళ్ళి తన్నించుకొని వచ్చాడు*.. *(రాయబార ఘట్టాల్లో సంజయ్ రాజభారం ఒక అద్భుతమని చెప్పాలి.)* *రాయబారిగా వచ్చిన శ్రీకృష్ణుడిని బంధిస్తున్నారని తెలిసి ఊరుకున్నాడు*. *కృష్ణుడు విశ్వరూపం చూపిస్తే దృతరాష్ట్రుడు కోరిక మేరకు కళ్ళు ఇచ్చి తన దివ్యమంగళ స్వరూపాన్ని చూపించాడు. ఎంత దుర్మార్గుడైన శ్రీకృష్ణుడి విశ్వరూప దర్శనం చేసుకోగలిగిన అదృష్టవంతుడు. అయినా దృతరాష్ట్రుడు యుద్ధాన్ని నివారించలేదు.* *సరికదా సంజయుడి ద్వారా భగవద్గీత విని కూడా నాకొడుకులు గెలిచారా అని అడిగిన మహాపాపి*. *యుద్ధంలో పుత్రలందరూ చనిపోయినా పాండవుల వల్ల రాజ్యభోగాలు తక్కువ కాలేదు*. *చివరికి వృద్దాప్యంలో కుంతి గాంధారి తో కలిసి తపోవనానికి వెళ్ళి తీవ్ర తపస్సు చేశారు. వ్యాసుడి దయతో మానవ శరీరాలు ధరించిన చనిపోయిన 100మంది కొడుకుల్ని తిరిగి ఒకరోజంతా గడిపాడు...* *చూశారా ఎన్ని దుర్మార్గపు పనులు చేసినా చివరి వరకు కాలు కదపకుండా రాజ్యం వదలకుండా యుద్ధం చేయకుండా భోగాలు అనుభవించిన ఘనత ధృతరాష్ట్రుడికి దక్కింది...* *మహాభారతంలో అత్యంత అదృష్టవంతుడు ఈయన ఒక్కడే*.. *కాదంటారా! సంజయ రాయభారం లో చూడాలి ధృతరాష్ట్రుడి విశ్వరూపం. ఆయన మాటలు వింటే ఎంత నీచుడో అర్థమవుతుంది*. *కాకపోతే ప్రస్తుత లోకంలో దృతరాష్ట్ర దుర్యోధనుడు వంటి వారే ఎక్కువ ఉన్నారు. వారు సంపాదించని సొమ్ముకోసం ఆరాటపడేవారు ఈరోజుల్లో కోకొల్లలు..* #మన సంప్రదాయాలు సమాచారం
Ravi Talluri
627 వీక్షించారు
17 గంటల క్రితం
*_77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు_* *_పంచవక్త్రాయ నమః_* #మన సంప్రదాయాలు సమాచారం
See other profiles for amazing content