🌹🙏శ్రీ కార్తవీర్యార్జున మంత్రం 🙏🌹
🌹మంత్రం 🌹
🙏సుమంతో,సుమంతో,శ్రీ కార్తవీర్యార్జునాయ నమః..🙏
అనే మంత్రముతో..జపిస్తే..
పోయిన వస్తువులు,
ఇంటినుండి వెల్లిపోయిన మనుషులు,
ధర్మముగా రావలసిన పైకము, ఉద్యోగము, వస్తువులు,
పశువులు,
వివాహము కావలసిన వారు,
ఇలా జపిస్తే, తప్పక తిరిగి పొందగలరు,
సమస్య తీవ్రత ను బట్టి జపము ఎక్కువగా చేసుకున్నట్లు అయితే త్వరలో అభీష్ట సిద్ది కల్గును!
🌹మంత్రం 🌹
🙏కార్త వీర్యార్జునొ నామ రాజా బాహు సహస్రవాన్
తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే..🙏
ఈ పై మంత్రమును ధృడ సంకల్పంతో చేసేవారికి చాలా వేగవంతమైన మంచి ఫలితం తప్పక కలిగితీరుతుంది.....
ఈ మంత్రాన్ని మన మనసులో కోరిక చెప్పుకుని రోజూ పూజ చేసేటప్పుడు స్మరిస్తే పోయినవన్ని తిరిగి మనకు దక్కుతాయి..
కార్తవీర్యార్జునుడు..
ఈతడు కృతవీర్యుని కొడుకు.
హైహయ వంశరాజు.
అసలు నామం అర్జునుడు.
కృతవీర్యుని కొడుకు కాబట్టి కార్తవీర్యార్జునుడుగా వ్యవహారం.
వింధ్య పర్వతానికి దక్షిణంగా వున్న నర్మదా నదీతీరము లోని మాహిష్మతీ పురం ఇతని రాజధాని.
ఇతను దత్తాత్రేయ భక్తుడు.
దత్తాత్రేయుని వరం వల్ల సహస్ర బాహుడవుతాడు.
యుద్ధంలో సర్వదా జయమే కలుగుతుందనీ,
అపార రాజ్యసంపద కలుగుతుందనీ
వరం పొందుతాడు.
ఒక బంగారు రథం కూడా పొందుతాడు.
అది అతన్ని యేవేళప్పుడైనా యెక్కడికైనా తీసుకొని పోగలదు.
విఖ్యాతుడైన ఒక వ్యక్తి చేతులో తప్ప అతనికి మరణం వుండదు.
ఈ ఘన సంపద గురించి విని రావణుడు ఇతని మీదికి దండెత్తి వస్తాడు.
ఆ సమయములో కార్తవీర్యార్జునుడు వన విహారంలో వుంటాడు.నా రాక విని పారిపోయి ఉంటాడని రావణుడు యెగతాళి చేస్తూ వెళ్ళిపోయాడు.
తర్వాత నర్మదా ఒడ్డున శివపూజ చేసుకుంటూండగా కార్తవీర్యార్జునుని సహస్ర బాహువుల్లో చిక్కి నర్మదా నది పొంగి వచ్చి రావణుడి పూజాద్రవ్యాలన్నిటినీ తోసి పారేస్తుంది.(కార్తవీరుడు రావణుణ్ణి
తన వేయి బాహువుల మధ్య ఇరికించి ఊపిరాడకుండా చేశాడని . అప్పుడు పులస్త్యుడువచ్చి రావణుణ్ణి విడిపిస్తాడని ఒక కథనం కూడా వుంది. )
రావణుడికి కోపము వచ్చి దండెత్తి వెళతాడు. కార్తవీర్యార్జునుడు రావణుడిని ఓడించి బంధిస్తాడు. పులస్త్యుడు వచ్చి కార్తవీర్యుని బ్రతిమాలి రావణుడిని విడిపించుకొని తీసుకెళ్తాడు.
ఒకసారి ఆహారనిమిత్తం అగ్ని వస్తాడు.
గిరి నగరారణ్యాన్నంతటినీ భక్షించమని చెప్తాడు.
అక్కడే మైత్రావరుణ ముని యొక్క ఆశ్రమం వుంటుంది.అదీ దగ్ధమైపోతుంది.
మైత్రావరుణుడి కొడుక్కు కోపం వచ్చి కార్తవీర్యుని సహస్ర బాహువులనూ పరశురాముడు ఖండిచివేస్తాడని శాపమిస్తాడు.
అందుకు భయపడి మంచివాడిలాగా ప్రవర్తిస్తుంటాడు
కానీ కొడుకులు దుర్మార్గులై చెడ్డ పనులు చేస్తుంటారు.
ఒకసారి కార్తవీర్యుడు జమదగ్ని ఆశ్రమాన్ని దర్శిస్తాడు. జమదగ్ని భార్య రాజుకీ పరివారానికి సకలమర్యాదలూ చేస్తుంది. ఇంతమందికి ఎలా సపర్యలూ,భోజనాలూ
చేశారని అడుగుతాడు.మా దగ్గర నందినీ ధేనువు (కామధేనువు) వుంది. అది అడిగినవన్నీ ఇస్తుందని జమదగ్ని చెప్తాడు.
ఇటువంటి ధేనువు రాజుదగ్గర వుండాలి. మీ దగ్గర ఎందుకు? నాకిచ్చేయమంటాడు కార్తవీర్యుడు.
దానికి జమదగ్ని నిరాకరిస్తాడు.
దానితో కోపగించిన కార్తవీర్యుడు ఆశ్రమంలోనున్న వనాన్నంతా ధ్వంసం చేసి బలవంతంగా కామధేనువుని తీసికెళ్ళి పోతాడు.
పరశురాముడు ఆశ్రమానికి వచ్చి కార్తవీర్యుని దౌష్ట్యానికి
ఆగ్రహించి అతన్ని వెంటాడి అతని సహస్రబాహువులూ ఖండించి అతన్ని వధిస్తాడు.
ఆ తర్వాత కార్తవీర్యుని కొడుకులు పరశురాముడు ఆశ్రమంలో లేని సమయంలో వచ్చి జందగ్నిని చంపేసి వెళ్తారు.
పరశురాముడు ఆశ్రమానికి తిరిగివచ్చి విషయము తెలుసుకొని క్షత్రియులందరినీ నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఇరవైఒక్క మార్లు రాజులందరినీ సంహరించి ఆ నెత్తురుతో అయిదు మడుగులు చేసి పితృ తర్పణం చేస్తాడు.
ఆ ప్రదేశమే శమంతపంచకమైంది.
ఆ తర్వాత కురుపాండవులు అక్కడ యుద్ధం చేస్తారు. అదే కురుక్షేత్రం.
🌹కార్తవీర్యార్జునుడి ఈ కథను అష్టమి రోజు పారాయణం చేసుకుంటే శుభం, కార్తీకమాసం సుద్ద అష్టమిరోజు శ్రీ కార్తవీర్యార్జున జయంతి 🌹
🌹శ్రీ మాత్రే నమః 🌹
#ప్రణవనాధం #🔱శక్తీ సాధన🙏 #📙ఆధ్యాత్మిక మాటలు