ఎర్రకోటపై తిరంగా జెండా: ఈ కోటను 1639 నుండి 1648 వరకు నిర్మించారు. మొఘల్ రాజు షాజహాన్ దీన్ని నిర్మించగా, ఢిల్లి మొఘల్ రాజ్యానికి రాజధానిగా ఉన్నది. యునెస్కో గుర్తింపు పొందిన ఈ కోట 1648 నుండి 1857 వరకు మొఘల్ రాజ్యంలో, 1857 నుండి 1947 వరకు బ్రిటిష్ ఇండియా ఆధీనంలో, 1947 నుండి భారత ప్రభుత్వ ఆధీనంలో ఉంది. స్వాతంత్ర్యం పొందిన తొలిరోజు 1947 ఆగస్టు 15న నాటి ప్రధాని ఈ కోటలోని లాహోరీ గేటుపై మన జాతీయ జెండాను ఎగురవేశారు. ఇక అక్కడి నుండి ప్రతి ఏడు ఇక్కడ భారత ప్రధాని మన జాతీయ జెండా ఎగురవేసి, జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. వివిధ దేశాధినేతలు అతిథులుగా హాజరు అవ్వగా... త్రివిధ దళాలు కవత్తూ, ప్రదర్శనలు చేస్తాయి. ఆగస్టు 14న దేశ రాష్ట్రపతి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇక ఈరోజు అనగా ఆగస్టు 15న మన దేశంలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రభుత్వేతర సంస్థలు, వేరే దేశాల్లోని రాయబార కార్యాలయాలు అన్నీ చోట్ల మన జాతీయ జెండా ఎగుర వేసి జెండా వందనం చేస్తారు. ఇక ఇదే రోజు పాఠశాలల్లో ఘనంగా ఈ వేడుకలను జరుపగా... 1974 నుండి రాష్ట్రాల ముఖ్యమంత్రులు జెండాలు ఎగుర వేయడం ఆనవాయితీగా వస్తుంది.
.....
#redFort #flagHosting #IndianIndependenceDay #TodaySpecial #manavoiceSpecialStory #HappyIndependenceDay
#happy independence day #స్వాతంత్య దినోత్సవ శుభాకాంక్షలు #🇮🇳HAPPY INDEPENDENCE DAY🇮🇳 #happy independence day 15th august #independence day