మినరల్ వాటర్ వ్యాపారం లో నిలదొక్కుకోలేకపోయాడు..
హోటల్ పెట్టీ నష్టపోయి పాతిక లక్షల అప్పు తీర్చడానికి అవస్థపడి వడ్డీలు కట్టలేక అప్పుల వాళ్ళ నుండి తప్పించుకోడానికి మారు వేషం వేసుకుని తిరిగిన రిషబ్ షెట్టి "సరైన వేషం వేయడం తన సమస్యకి పరిష్కారం అనుకున్నాడు..వేశాడు గెలిచాడు.".
అప్పులు ,ఆర్థిక సమస్యలు,మానసిక ఆందోళన వీటి మధ్య ఎదగడానికి సరైనదారి కనిపెట్టి ,రాత్రి పగలు కష్టపడితే విజయం అదే వస్తుంది అనడానికి పెద్ద ఎగ్జాంపుల్ రిషబ్ షెట్టి..
కాంతార సినిమా చేస్తుంటే నాలుగు సార్లు ప్రమాదం జరిగింది,ఒక్క యాక్షన్ సన్నివేశానికి కూడా డూప్ వాడలేదు,కత్తి యుద్ధం,గుర్రపుస్వారీ కళరియపట్టు అన్నీ నేర్చుకున్నాడు.ఏం మనిషి అసలు ప్రాణం పెట్టాడు కదా ఈ సినిమాకి ,అందుకే గొప్ప హిట్ సినిమా అయ్యింది.
నేను ఫ్రీక్వెల్ చూడలేదు ఇంకా..కానీ అతని కాంతార సినిమా చూసాకా ఇలా రాశాను అప్పట్లో..
.......
ఎవరేనా ఇబ్బందిలో ఉన్నప్పుడో, ఎవరికైనా కష్టం వచ్చినప్పుడో, పూర్తిగా జీవితం లో దెబ్బతిని లేవలేనప్పుడో ఒక మాట ,ఒక చెయ్యి ఊతం ఇచ్చి, ఉత్సాహం నింపితే వెంటనే మంచి జరిగితే అదో తృప్తి..
....
కాంతారా సినిమా నీ థియేటర్ లో చూడలేకపోయా అని నిజం గా బాధపడ్డా...
......
సినిమా ఆఖర్లో వరాహ రూపం పాటకి ముందు రిషబ్ షెట్టి దెబ్బలు తిని పడి పోయాక , కాంతారా వచ్చి( కోలం వేసే వ్యక్తి నీ నేను దేవుడే అనుకున్నా, కాంతారా అనేసా అంతే )వచ్చి "ఓ....."అంటూ.. ఒక సన్నటి గాలి వీస్తుంటే రిషబ్ మొహం మీద అరుస్తాడు..అంతే వెంటనే Rishab లేచి తాండవం చేసేస్తాడు.
నాకు ఆ ఊతం ఇవ్వడం విపరీతం గా నచ్చింది.
కాంతారా అనేది సినిమా అయినా Rishab పడే కష్టం, ఆ దేవుడే గుర్తించి సాయం చేస్తున్నాడు అనుకున్నా, అంతలా ఇన్వాల్వ్ అయ్యాను.
మళ్లీ ఇదే వరాహ రూపం పాటలోనే పోలీస్ ఆఫీసర్ చేసిన సాయం గుర్తుపెట్టుకుని, Rishab కృతజ్ఞత గా వచ్చి డాన్స్ చేస్తూ, అతన్ని ఆహ్వానించి, అతని చేతిని తన గుండెలమీద పెట్టుకుంటాడు.
దేవుడికి కూడా కృతజ్ఞత చెప్పుకోవాలని ఉంటుంది అనిపించింది.
ప్రవేట్ శాటిలైట్లు తయారు చేసి స్పేస్ లోకి పంపే రోజులు, గుండె ప్లేస్ లో గుండె పెట్టే అంత టెక్నాలజీ డెవెలప్ అయిన రోజులు,ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితాల్లోకి వచ్చేసిన ఈ రోజుల్లో... దేవుడ్ని విపరీతం గా నమ్మే నాకు, కష్టం వస్తే ఆ భగవంతుడు తోడుగా ఉండి నడిపిస్తాడు అనే నమ్మకం చాలా గొప్పగా అనిపించింది.
సినిమా చూస్తూ ఒక చెడ్డ భూస్వామి మీద ఒక సామాన్యుడు కత్తి దింపడం వెనుక అంతమంది జనం తో పాటు రిషబ్ షెట్టి గెలవాలని అనుకున్న వాళ్ళలో కాంతారా తో పాటూ నేనూ ఉన్నా..
Rishab Shetty 🙏🙏
జెనీవా ఐక్యరాజ్య సమితి లో కాంతారా సినిమాని ప్రదర్శించి ఆ తరువాత పర్యావరణ పరిరక్షణ లో భారతీయ సినిమాలు అనే అంశం మీద రిషబ్ షెట్టి ప్రసంగం చూసి ఏం మనిషి అసలు అని మరోసారి అనుకున్నా..
400 కోట్ల బిజినెస్ , కోట్లమంది కి నచ్చింది అనే ఫీలింగ్ ,
ఐక్యరాజ్య సమితి లో ప్రదర్శిస్తున్న మొదటి కన్నడ సినిమా కాంతారా అనే గౌరవం.... వీటన్నిటి వెనుక ఎంత హార్డ్ వర్క్ చేసుంటాడు అతని టీమ్ కృషి ముందు ఏదైనా తక్కువే.
#🌅శుభోదయం #💔హార్ట్ బ్రేక్ స్టేటస్ #షేర్ చాట్ బజార్👍 #😁Hello🙋♂️