Hare Krishna Prabhu dandvat pranam 🙏
Date 27th Tuesday January 2026
Topic ; నిత్యానంద ప్రభవు కృప ద్వారా మనలో భక్తిని బలపరిచే విధానం
speaker ; Chaitanya Krishna Prabhu
కలియుగంలో భగవంతుడి సిస్టం – గౌర నిత్యానంద తత్త్వం
1 . ఈ రోజుల్లో చాలా మంది వేదాలు, ఉపనిషత్తులు, భాగవతం, భగవద్గీత, పురాణాలు చదవడం లేదు. అందుకే కలియుగంలో నిజమైన తత్త్వం ఎవరికీ స్పష్టంగా తెలియడం లేదు. వాయు పురాణంలో చెప్పినట్లుగా బలరాముడే నిత్యానంద రాముడు. కానీ పురాణాలు చదవని కారణంగా ఈ సత్యం సామాన్యులకు తెలియకుండా పోయింది.
2 . భగవంతుడు అంటే ఎవరు? దేవాది దేవుడు అంటే ఏమిటి? భగవంతుడి సిస్టం ప్రిన్సిపల్స్ ఎలా పనిచేస్తాయి? ఏ శాస్త్రంలో ఎవరు ఏమి చెప్పారు?
ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఒకటి రెండు క్లాసులు వింటే సరిపోదు. సాధన అవసరం. నిరంతర ఎంక్వయిరీ అవసరం. జీవిత లక్ష్యం అంటే – ఏది సత్యం? ఏది అసత్యం? అని వెతుకుతూనే ఉండడం.
3 . భక్తి అంటే అక్కడే ఆగిపోవడం కాదు. భక్తి అంటే సత్యం దొరికే వరకూ వెతుకుతూనే ఉండడం.నిత్యానందంగా, నిరంతరం ఆనందంగా ఉండే స్థితిని చేరుకోవడమే భక్తి లక్ష్యం.మనము ఉన్న ప్లేస్ కరెక్టా? మనం జీవిస్తున్న జీవితం కరెక్టా?దీనికి ఒకే ఒక్క ప్రమాణం ఉంది –ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు 24 గంటలు నిత్యానందంగా ఉన్నామా?అలా ఉంటే మనం కరెక్ట్ ప్లేస్‌లో ఉన్నాం.అలా లేకపోతే – ఎంత ప్రయత్నించినా ఆనందం రాకపోతే – ఎక్కడో తప్పు ఉంది అని అర్థం.
4 . నిత్యానందం మన నిజమైన ఆస్తి.ధనం ఉన్నవాడు ధనవంతుడు కాదు – ధర్మం ఉన్నవాడే ధనవంతుడు.భక్తులకు నిజమైన సంపద నిత్యానందమే.
ఇంట్లో భార్యాభర్తలు, పిల్లలు ఎలా ఒకరిపై ఒకరు ఆధారపడి ప్రేమతో జీవిస్తారో, అలాగే భగవంతుడితో కూడా మనకు మోహం ఉండాలి.
ఇది భౌతిక మోహం కాదు – ఆధ్యాత్మిక మోహం.
ఆధ్యాత్మిక జీవితం అంటే భౌతిక మొహాన్ని ఆధ్యాత్మిక మోహo గా స్పిరిచ్లైట్ చేయడం అప్పుడే భగవంతుడితో నిజమైన సంబంధం ఏర్పడుతుంది.
5 . కలియుగంలో ఈ ఆధ్యాత్మిక మోహాన్ని కలిగించడానికి గౌర నిత్యానందులు అవతరించారు.భౌతిక మోహాన్ని ఆధ్యాత్మిక మోహంగా మార్చడానికే వారి అవతారం.నిత్యానంద ప్రభువు బలరాముడి అవతారం.
ఆయన ఆదిగురు. అందుకే ఆయనను సర్వెంట్ ఆఫ్ గాడ్ అంటారు.
సేవించబడేవాడు → సేవ్యక్ భగవాన్ (శ్రీకృష్ణుడు)
సేవ చేసే అత్యుత్తముడు → సేవక భగవాన్ (గురువు / నిత్యానందుడు)
నిత్యానంద ప్రభువు కృష్ణ ప్రేమ అనే రిజర్వాయర్‌ను పగలగొట్టి, ఎలాంటి తపస్సులు చేయకుండానే ప్రజలకు సులభంగా ప్రేమభక్తిని ఇచ్చారు.
6 . కృష్ణ ప్రేమ ఒక రిజర్వాయర్ లాంటిది.ఆ రిజర్వాయర్‌ను పగలగొట్టి, కోట్ల జన్మల తపస్సు చేయాల్సిన అవసరం లేకుండా, సాధారణ ప్రజలకూ కృష్ణ ప్రేమను సులభంగా అందించినవారు నిత్యానంద ప్రభువు.నిత్యానంద ప్రభువు ఏకచక్రధామంలో అవతరించారు.తండ్రి: అఘాయిపండిత తల్లి: పద్మావతి దేవి
కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు భీష్ముని చంపడానికి విసిరిన చక్రం పడిన స్థలమే ఏకచక్రధామo అక్కడే నిత్యానంద ప్రభువు అవతారం తీసుకున్నారు.
బాల్యంనుంచి ఆయన ఎన్నో లీలలు చేశారు.
7 . హనుమంతుడి పాత్రలు, రామాయణ లీలలు, కృష్ణ లీలలు – ఇవన్నీ సహజంగా ఆయనలో ప్రదర్శించేవి.ఎటువంటి ట్రైనింగ్ లేకుండానే భగవంతుని శక్తి వ్యక్తమయ్యేది.అప్పటి ధర్మం ప్రకారం ఒక సన్యాసి వచ్చి “మీ అబ్బాయిని మాకు ఇవ్వండి” అని అడిగితే, తల్లిదండ్రులు కన్నీళ్లతో అయినా ఇచ్చేవారు. అలా నిత్యానంద ప్రభువు సన్యాస మార్గంలోకి వచ్చారు.కాశీ, రామేశ్వరం, బృందావనం ప్రయాణాల్లో మాధవేంద్రపురిని కలుస్తారు. అక్కడి నుంచే గౌరవ వైష్ణవ సంప్రదాయం విస్తరించింది.చైతన్య మహాప్రభువుకి 20 సంవత్సరాలు, నిత్యానంద ప్రభువుకి 32 సంవత్సరాలు ఉన్నప్పుడు వారి కలయిక జరిగింది.
8 . కృష్ణుడు కలియుగంలో నామరూపంలో అవతరించాడు అని యోగమాయ ద్వారా తెలుసుకుని, ఒకే రోజులో నిత్యానంద ప్రభువు నవద్వీపానికి చేరుకుంటారు.చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభువుకి తన షడ్బుజ రూపాన్ని చూపిస్తారు.కృష్ణ–రామ–సన్యాసి రూపాల సమ్మేళనం అది.
9 . సన్యాస దీక్ష సమయంలో నిత్యానంద ప్రభువు చైతన్య మహాప్రభువు దండాన్ని విరుస్తారు –మీరు భగవంతుడు. మీకు ఈ దండం అవసరం లేదు” అని.
ఆ తరువాత చైతన్య మహాప్రభువు ఆజ్ఞ ఇస్తారు:“ప్రతి ఇంటికి వెళ్లి – బోలో కృష్ణ, భోజో కృష్ణ, కోరో కృష్ణ శిక్ష” అని ప్రచారం చేయండి.హరిదాస్ ఠాకూర్, నిత్యానంద ప్రభువు కలిసి ఇంటింటికి వెళ్లి హరినామ సంకీర్తన చేస్తారు.
10 .నిత్యానంద ప్రభవు చేసిన సంకీర్తన వలన జగాయి–మధాయి లాంటి మహా పాపులు కూడా మారిపోయారు.ఇది కలియుగ అవతారాల ప్రత్యేకత – ఒక్క రక్త బిందు కూడా పడకుండా రాక్షసులను మార్చడం.ఈ కలియుగంలో ఎనిమిదివందల కోట్ల జనాభాలో కోట్ల మంది బాధలో ఉన్నారు.
నిజమైన ఆనందం లేదు.
11 . నిత్యానందప్రభువు కృప లభించినవార నిజంగా అదృష్టవంతులు.
హరినామం లేకపోతే సమాజం ఎలా ఉంటుందో ఊహించండి –పోలీసులు, కోర్టులు, శిక్షలు… అయినా శాంతి ఉండదు.కానీ గౌర నిత్యానందుల కృపతో
రక్తం లేకుండా, ఆయుధం లేకుండా, నామంతోనే ప్రపంచాన్ని మార్చే శక్తి వచ్చింది. అదే కలియుగ ధర్మం.అదే నిజమైన భక్తి.అదే నిత్యానంద మార్గం.
12 . నిత్యానంద మహాప్రభువు అనగా నియమాలు–నిబంధనలు లెక్కచేయని కృప యొక్క అవతారం. ఆయన బలరామ స్వరూపుడు. బలరాముడు అంటే భక్తిని కల్టివేట్ చేసే నాగలి. నాగలి నేలని చీల్చినట్టు, నిత్యానంద ప్రభువు మన హృదయాన్ని చీల్చి అందులో భక్తి బీజాన్ని నాటుతారు. అందుకే ఆయన మార్గం Beyond rules and conditions – Mercy alone.
13 . ఒకసారి నిత్యానంద ప్రభువును ఎవరో అడిగారు –
“ప్రభూ, మీకు కదంబ పుష్పాలు కావాలంటారు కానీ మా ఇంట్లో లేవు.”
అప్పుడు ఆయన చిరునవ్వుతో అన్నారు –నిమ్మకాయ చెట్లు ఉన్నాయా? అవే చాలు. అవే కదంబ పుష్పాలైపోతాయి.”ఇది లీల కాదు – ఇది తత్వం.
14 . భగవంతుడికి కావాల్సింది మన దగ్గర ఉన్న వస్తువు కాదు, మన దగ్గర ఉన్న శరణాగతి.బృందావనంలో అన్నీ కల్పవృక్షాలే. అక్కడ ఏది అడిగినా ఇస్తాయి
నిత్యానంద ప్రభువుకు రాజు–పేద, కులం–వర్గం అనే భేదం లేదు. అందరికీ ఒకే ప్రసాదం. ఎందుకంటే ఆయన పతిత పావనుడు. మద్యం తాగేవాళ్లను కూడా శిక్షించలేదు – మోక్షాన్ని ఇచ్చారు. ఇంతటి కృప ఇంకెక్కడా కనిపించదు.
అవధూత నుంచి గృహస్థుడు – దివ్య వివాహం
15 . నిత్యానంద ప్రభువు మొదట అవధూత శిరోమణిగా తిరిగారు. ఊరు ఊరుగా తిరుగుతూ నామ ప్రచారం చేశారు. ఆయనకు పెళ్లి అవసరం లేదు. కానీ గృహస్థులకి మార్గం చూపించాలి కాబట్టి పెళ్లి చేసుకున్నారు. చైతన్య మహాప్రభువు గృహస్థుడిగా ప్రారంభించి సన్యాసం తీసుకున్నారు.నిత్యానంద ప్రభువు సన్యాసిలా ఉండి కూడా గృహస్థుడయ్యారు.ఇది లోకానికి ఒక గొప్ప సందేశం:
“16 . గృహస్థుడైనా భగవంతుడికి సంపూర్ణంగా అంకితమవచ్చు.”నిత్యానంద ప్రభువు లీలల ద్వారా ఒక గృహస్థుడు ఎలా జీవించాలి, ఎలా భక్తిని పెంచుకోవాలి, కుటుంబాన్ని భగవత్ సేవగా ఎలా మార్చుకోవాలి – అన్నది మనకు చూపించారు.నిత్యానందం అంటే ఏమిటి?నిత్యానందం అంటే –
భగవంతుడి నుంచి ఆనందాన్ని తీసుకోవడం.
17 . ప్రభుపాదులు చెబుతారు: దీక్ష తీసుకున్నవాడు భగవంతుడి ఆనందాన్నే స్వీకరించాలి భగవంతుడు తినేది తినాలి.భగవంతుడు చూడాలనుకున్నదే చూడాలి.బయటి రాజకీయ వార్తలు, సినిమాలు, లోకిక సుఖాలు – ఇవన్నీ నిత్యానందం కాదు.
18 .ఎవరికి నిజంగా నిత్యానంద ప్రభువు కృప ఉంటుందో, వారు బయట ప్రపంచపు తాత్కాలిక ఆనందాల వైపు చూడరు.కృప లేకపోతే బలం లేదు నిత్యానంద ప్రభువు కృప ఉంటేనే భక్తిలో బలం వస్తుంది.ఆ కృప లేకపోతే జపం నిలబడదు, సాధన నిలబడదు.అందుకే ఏకాదశి రోజు ప్రత్యేకంగా“భక్తులు స్ట్రాంగ్ కావాలంటే ఏకాదశి జపం డీప్‌గా చేయాలి.”
19 .మన స్థితి ఏమిటి? నేను గొప్ప భక్తుడిని కాదు.నేను పెద్ద జీవుడిని కాదు.
నేను అబద్ధ జీవులలో నెంబర్ వన్.”ఈ నిజాయితీనే శరణాగతి.
ఈ భావంతో మనం ప్రార్థించాలి:ప్రభూ, మీ కృప ఉంటేనే నేను చైతన్య మహాప్రభు ఉద్యమానికి సేవ చేయగలను.” అనే భావంతోమూడు రోజులు –జపం చేస్తే గొప్ప మార్పు వస్తుంది.
20 . శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి:ఎవరైతే మూడు రోజులు నిజంగా హరినామ జపం చేస్తారో,ఏ అలవాటు నుంచైనా బయటపడగలరు.
కలి యుగంలో శాస్త్రాలు చదవలేకపోయినా పరవాలేదు. అందరికీ
కనీసం హరినామాన్ని ఇవ్వాలి.ఇదే సకల శాస్త్రాల సారం.హరినామమే జ్ఞానం.
హరినామమే ధ్యానం. హరినామమే పోషణ.శాస్త్ర ప్రమాణం లేకపోతే మోసం
21 . ఈ రోజుల్లో చాలా మంది ప్రవచనకర్తలు తమను తామే గురువులమని అనుకుంటున్నారు .గురు పరంపర లేదు. సాంప్రదాయం లేదు.శాస్త్ర ప్రమాణం లేకుండా మాట్లాడుతున్నారు.ఒక డాక్టర్ మెడికల్ బుక్ ప్రకారం ఆపరేషన్ చేయకపోతే పేషెంట్ చచ్చిపోతాడు.అలాగే ప్రవచనకర్తలు శాస్త్రాలను as it is చెప్పకపోతే – ప్రజలు భ్రమలో పడతారు.
22 . దేవాది దేవుడు ఎవరు? ఆది పురుషుడు ఎవరు?ఇది కరెక్ట్‌గా చెప్పకపోతే – అది మోసం.ఈ విధంగా సనాతన ధర్మాన్ని రాబందుల్లా ముక్కలు చేస్తున్నారు.దాన్ని కాపాడేది ఒక్కటే – నామ సంకీర్తన.
23 . నిత్యానంద ప్రభువు అవతారం అంటే –నియమాల కంటే కృప గొప్పదని చెప్పే అవతారం.పాపిని చూసి శిక్షించని, శరణాగతిని చూసి కౌగిలించుకునే అవతారం.ఈ నిత్యానంద ప్రభువు ఆవిర్భావ దినం సందర్భంగా మనం ఒక్కటే ప్రార్థించాలి:“ప్రభూ,మీ కృపలో ఒక చిన్న భాగం నాకు ఇవ్వండి.మీ కృపతోనే నేను బ్రతకాలనుకుంటున్నాను.హరినామంలో నిలబడే బలం ఇవ్వండి.”
24 . ఈ సనాతన ధర్మాన్ని ఎవరు కాపాడతారు దీనిని కాపాడకపోతే ప్రజలు పూర్తిగా మోసపోతారు అందుకనే మనం అందరికీ హరినామాన్ని ఇవ్వాలి సకల వేదాల శాస్త్రాల సారమే హరినామం శాస్త్రాలన్నీ చదవకపోయినా అట్లీస్ట్ హరినామం చేస్తే చాలు హరినామం వింటే చాలు ఈ నామమే మనకి ధ్యానం జ్ఞానం పోషణ అన్ని ఇస్తుంది ఇది సకల శాస్త్రాల వేదాల సారం.
#📙ఆధ్యాత్మిక మాటలు #భగవద్గీత #🙏🏻కృష్ణుడి భజనలు