#VESTIGE 21st CENTURY NETWORK MARKETING BUSINESS
మీ జీవితం కష్టమని అనిపిస్తే ఒక్కసారి బయటకు వెళ్లి ప్రపంచాన్ని గమనించు…
ఫుట్‌పాత్ మీద, బస్ స్టాప్‌లో, రైల్వే స్టేషన్‌లో, గుడి మెట్ల మార్గంలో, సిగ్నల్ దగ్గర
మనము ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు
మన కళ్ల ముందే నడుస్తున్న జీవితాలు కనిపిస్తూనే ఉంటాయి.
నీ ఖర్మకాలి గట్టిగానే తగిలింది,
వ్యూహం లేని యుద్ధమేదో నిన్ను పడేసింది నిజమే.
కానీ ఇంకెన్నాళ్లని ఆ జ్ఞాపకాల్నే త్రవ్వుతావ్?
తలుచుకునే కొద్దీ అదే గతం… అదే గాయం.
వాళ్ల జీవితాలతో పోలిస్తే
మనది దారుణమైన జీవితం కాదు కదా?
అయితే ఎందుకు ఈ ఓవర్ యాక్షన్?
నీకు ఒక్కడికే బాధలు ఉన్నట్టు,
నువ్వే ఒక్కడివి మోసపోయినట్టు ఈ ఆలోచన ఎందుకు?
మర్చిపోవడం తప్ప ఏమైనా మార్చగలవా?
ఇక్కడిదాకా వచ్చినోడివి, అక్కడినుంచి జరగలేవా!
బాధని నువ్వనుకుంటే… భయమని లోకమంటుంది.
అలాంటప్పుడు నువ్వు భయపడితే ఎలా ఉంటుందో
ఒక్కసారి నీ జీవితంతోనే చూపించలేవా?