janu reddy
3K views • 2 days ago
కడప అంటే అంత అలుసా?
పాతికేళ్ల నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టిన ప్రజాతీర్పు!
మహిళా ఎమ్మెల్యేను అవమానించింది అక్కడే!
రాయలసీమ గుండెకాయ కడప గడ్డపై పాతికేళ్లుగా పేరుకుపోయిన ఏకఛత్రాధిపత్యానికి చివరకు తెరపడింది! కడప కార్పొరేషన్ అయినప్పటి నుంచి ఎన్నడూ లేని విధంగా, పాతికేళ్ల తరువాత తెలుగుదేశం పార్టీ విజయబావుటా ఎగురవేసి చరిత్ర తిరగరాసింది. ఇది కేవలం ఒక రాజకీయ కూటమి సాధించిన విజయం కాదు... అహంకారంపై సామాన్యుడు సాధించిన సంచలన విజయం!
భయాందోళనల నడుమ సాగిన రాజకీయం!
సొంత వైకాపా కార్యకర్త పెద్ద దస్తగిరిని ఆసుపత్రి వద్ద దారుణంగా దాడి చేసి చంపారనే తీవ్ర ఆరోపణలు... అదే మార్చురీ వద్దకు వెళ్లి కంటినీరు పెట్టుకుంటూ ఆడిన నాటకాలు... ఈ కేసులోనే మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డి అరెస్ట్ అయి బెయిల్ మీద బయటపడ్డారు. అంతటి తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి భార్య బండి దీప్తికి మేయర్ టికెట్ కట్టబెట్టిన జగన్ దంపతులు, అసలు కడప ప్రజలకు ఏ సందేశం ఇవ్వాలనుకున్నారు?
బాబాయి వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో ప్రధాన సూత్రధారికి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నామనే అహంకారమే ఇక్కడ కూడా పనిచేస్తుందని భావించారా? జనాన్ని మరీ గొర్రెల లెక్కన జమకట్టారా?
సోషల్ మీడియా నాటకాలు & ట్రోలింగ్!
కడప మహిళా ఎమ్మెల్యే మాధవి రెడ్డి గారు కార్పొరేషన్ సర్వసభ్య సమావేశానికి వస్తే కనీసం కుర్చీ కూడా ఇవ్వకుండా అవమానించారు.
ఆఖరికి నగర కూడళ్లలో నేరస్థుల కదలికలను కనిపెట్టేందుకు సీఎస్ఆర్ (CSR) కింద ఎమ్మెల్యే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే, దానిపై కూడా హేళన చేస్తూ ట్రోల్స్ చేశారంటే వీరి తెగింపు ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు!
ఎన్నికల సమయంలో బండి దీప్తితో రోజుకో భయానక సీన్, కన్నీటి నాటకాలతో సాక్షి, వైకాపా సోషల్ మీడియా సాగించిన హారర్ ప్రచారాలు ప్రజలను మభ్యపెట్టలేకపోయాయి.
తిరగబడ్డ కడప పౌరుషం!
కానీ... భయం కూడా ఒక పరిమితి వరకే ఉంటుంది! సహనం నశించి, బరితెగింపు హద్దులు దాటినప్పుడు, అదే జనం తిరగబడి ప్రజాస్వామ్య బడితపూజ ఎలా ఉంటుందో రుచి చూపిస్తారు!
కడప ప్రజలు సరిగ్గా అదే చేశారు.
భయాన్ని గుండెల్లోంచి తరిమేసి, అరాచక మూకకు చరమగీతం పాడుతూ, అభివృద్ధి మరియు ప్రజాస్వామ్యం వైపు 'దేవుని కడప' గడ్డ అడుగులు వేసింది. భయాన్ని బద్దలు కొట్టి, కొత్త చరిత్రకు నాంది పలికిన కడప ప్రజలకు శుభాభినందనలు!
#📢ప్రభుత్వ పథకాలు #🔥దుమ్మురేపుతున్న టాక్సిక్..ఆడియన్స్ ఏమంటున్నారంటే
39 shares

