Magic Share BannerEpisodic Banner

🌷🙏🕉️ధన త్రయోదశి శుభాకాంక్షలు🕉️🙏🌷

1 Post • 85 views
Rochish Sharma Nandamuru
612 views • 7 hours ago
ధనత్రయోదశి : దీపావళిలోని అయిదురోజుల పండుగను కలిపి పంచపర్వాలంటారు. ఈ అయిదు రోజులూ లక్ష్మీపూజ చేస్తారు. దీపావళికి ముందువచ్చే త్రయోదశినిఅంటారు. ఉత్తరాదివారు ధన్ తేరస్ అంటారు. మానవుని సుఖ జీవనానికి ధనం ప్రధాన సాధనం. ఆ ధనార్జన ధర్మమార్గంలో ఉన్నప్పుడే సమాజానికి క్షేమం కలుగుతుంది. ధనానికి అధిదేవత అయిన లక్ష్మీదేవిని పూజించడం ఓ అలవాటుగా పెట్టుకుంటే ధనార్జన కూడా పవిత్ర మార్గంలో చేయడం సాధ్యమవుతుంది. చతుర్వర్గ చింతామణి అనే ధర్మగ్రంథంలో ఈ ధనద త్రయోదశి పర్వ విశిష్టతలకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. ధన త్రయోదశి రోజున లక్ష్మీపూజతో పాటు గోత్రిరాత్ర వ్రతాన్ని కూడా నిర్వహిస్తారు. వ్యాపార వర్గాలవారు దీపావళి నాటికి గత సంవత్సరానికి సంబంధించిన లెక్కలన్నీ సరిచూసుకుని దీపావళినాడు కొత్తగా లెక్కల పద్దు ప్రారంభిస్తారు. ఈ పండుగరోజున ఇళ్లను సుందరంగా అలంకరిస్తారు. రంగురంగు ముగ్గులు చిత్రించి లక్ష్మీ దేవికి స్వాగతం చెబుతారు. తెల్లవారుజామునే అభ్యంగన స్నానం చేసి కొత్త దుస్తులు ధరిస్తారు. ఇంట్లో ఉన్న బంగారు వస్తువులను, వెండి వస్తువులను పాలతో శుభ్రం చేసి వాటిని పూజలో ఉంచుతారు. పుత్రపౌత్ర ధనం ధాన్యం హస్తశ్వాది గవేరథమ్ ప్రజానాం భవసిమాతా ఆయుష్మంతం కరోతుమాం పుత్రులు, గోవులు, ధనధాన్యాలు, ఏనుగులు, గుర్రాలు, రథాలు సకలం ప్రసాదించు. జనులకు నీవు తల్లిగా భాసిస్తున్నావు అని ధనత్రయోదశినాడు లక్ష్మీదేవిని ప్రార్ధించాలి. #🌅శుభోదయం #🙏🏻ఆదివారం భక్తి స్పెషల్ #🌼ఆదివారం స్పెషల్ విషెస్ #🙏🌺ధన త్రయోదశి శుభాకాంక్షలు🌺🙏 #⚛ధనత్రయోదశి & దీపావళి పరిహారాలు🪔
17 shares