ShareChat
click to see wallet page
పరమభక్తి కౌరవ సభలో దుర్యోధనుడు శ్రీకృష్ణునికి గొప్ప విందు ఏర్పాటు చేసినా, అధర్మపరుడైన దుర్యోధనుని విందును కృష్ణుడు తిరస్కరించాడు. కృష్ణుడు నేరుగా విదురుని ఇంటికి వెళ్ళాడు. విదురుడు ధర్మం పట్ల నిబద్ధత, జ్ఞానం, పేదల పట్ల దయ కలిగినవాడు, అందుకే కృష్ణుడు అతన్ని గౌరవించేవాడు. కృష్ణుడు ఆకలితో ఉన్నానని చెప్పగానే, విదురుని భార్య సుధామాత ఆనందంతో వంటగదిలోకి పరిగెత్తింది, కానీ అక్కడ వండిన ఆహారం కనిపించలేదు. ఆమె కంగారులో, అరటిపండును పక్కకు విసిరి, తొక్కలను కృష్ణునికి సమర్పించింది. కృష్ణుడు వాటిని అత్యంత ఆనందంతో స్వీకరించి, వాటి రుచిని ఆస్వాదించాడు, "ఈ అరటి తొక్కల రుచి, ద్వారకలో రుక్మిణీ సత్యభామలు వండిన వాటికంటే గొప్పది" అని పలికాడు. కృష్ణుడు వస్తువులను కాకుండా, వాటి వెనుక ఉన్న భక్తిని, ప్రేమను మాత్రమే కోరుకుంటాడని ఈ సంఘటన తెలియజేస్తుంది. కేవలం అరటి తొక్కలు తిన్నా, కృష్ణుని ఆకలి తీరింది, అది విశ్వవ్యాప్తంగా అందరి ఆకలి తీర్చినంతటి తృప్తినిచ్చింది. ఒకసారి భగవంతుడు సూదంటురాయి అయితే భక్తుడు సూది అవుతాడు. మరొక్కప్పుడు భక్తుడు సూదంటురాయి అయితే భగవంతుడు సూది అయిపోతాడు. భక్తుడు భగవంతుని తనవైపుకు లాక్కుంటాడు . భగవంతుడు భక్తవత్సలుడు, భక్తాధీనుడు కదా!” #🙏🏻భక్తి సమాచారం😲 #🌅శుభోదయం #🔱హిందూ దేవుళ్ళు🙏🏻 #జై శ్రీకృష్ణ 🚩 #జై శ్రీకృష్ణ
🙏🏻భక్తి సమాచారం😲 - Xm Xm - ShareChat

More like this