ShareChat
click to see wallet page
"వైకుంఠము"అనే శబ్ధంలో విశేష అర్థము వుంది..🛕🚩 కుంఠనం అంటే కలిసి వుండే స్థితిని చెడగొట్టడం అని అర్థము..అంటే వియోగము కలిగించడం..🛕🚩 వికుంఠ అంటే వియోగాన్ని తొలగించడం ,కలిసి ఉండవలసిన వారిని,సన్నివేశాలని, పదార్థాలని కలిపి ఉంచే పరమాత్మకు"వైకుంఠ" శబ్ధం సార్థకమైనది."వైకుంఠము" అంటే"సర్వేషాం సంశ్లేషితా భూమిః అద్భిః వ్యోమః చ వాయునా వాయుశ్చ తేజసా సార్ధం వైకుంఠత్తం అంతతో మయా"అని పంచ భూతాల, పంచీకరణాదులు చేసేది నేనే.అందుకే నన్ను వైకుంఠ వాసుడు అంటారు.🛕🚩 ఆనాడు..ఆయన మనకు దర్శనం ఇచ్చి భిన్నత్వం గల సృష్టి లోని జీవులకు ఏకత్వం బోధించే ఏకాదశి కి " వైకుంఠ ఏకాదశి" అని పేరు వచ్చింది..దీనినే "ముక్కోటి ఏకాదశి" అని కూడా అంటారు. 🛕🚩 "వైకుంఠ ఏకాదశి" .. విష్ణు ఆలయాలన్నీ భక్తులతో క్రిక్కిరిసి ఉంటాయి.. తెల్లవారు జామునుంచే "ఉత్తర ద్వార దర్శనం" కోసం బారులు తీరి ఉంటారు..ఈ ద్వారం గుండా భగవంతుని దర్శిస్తే ముక్కోటి దేవతల ఆశీస్సులు లభిస్తాయని భక్తుల విశ్వాసం..భావన..🛕🚩 ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంలో వచ్చే పర్వం ఇది..మనకు పునర్జన్మ అంటూ ఉండదు..దక్షిణముఖంగా ఉన్న స్వామిని మనం దర్శించు కోవాలంటే ఉత్తర ముఖంగా నిలవాలి.. దక్షిణ ద్వారం సంసారానికి దారి చూపుతుంది..ఉత్తర ద్వారం మోక్షానికి మార్గం చూపుతుంది..నవద్వరాలున్న దేహంలోని జీవుని దృష్టి సప్త ద్వారాలకు ఆవల యున్న భగవంతుని వైపు మరలడమే ఈ పర్వదినం విశేషం..🛕🚩 ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభ సమయాన మనం ఉత్తరాభిముఖులమై స్వామిని సేవించి కార్యసిద్ధిని సాధించి జ్ఞానం పొందుదాం.. పితృదేవతలు, ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు పొందుదాము..ఓం నమో వేంకటేశాయ.. ఓం నమో నారాయణాయ... విష్ణు వైభవాన్ని కళ్ళారా ఉత్తర ద్వారము గుండా వెళ్ళి దర్శించుకుని ఆనందిద్దాము...పునీతులం అవుదాము...(సేకరణ) 🌹 లోకాస్సమస్తాః సుఖినోభవంత🌹 🙏🏼 సమస్త సన్మంగళాని భవంతు 🙏🏼 #తెలుసుకుందాం #ఓం నమో లక్ష్మీ నారాయణాయ నమః #🕉️🙏 ఓం శ్రీ నమో నారాయణాయ 🕉️🙏 #🙏 Om Namo Narayana 🙏 #🙏 ఓం నమో నారాయణ
తెలుసుకుందాం - ~o೦noo೦೦o ANANHASAYANAH ~o೦noo೦೦o ANANHASAYANAH - ShareChat

More like this