ShareChat
click to see wallet page
🙏🙏Praise the Lord🙏🙏 క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన బిడ్డవా...??🤔🤔 అయితే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు..🗣️🗣️ ఈరోజుల్లో ఇంకా బాప్తిస్మము అంటే చాలామందికి తెలీదు,🙆🏻‍♂️🙆🏻‍♂️ బాప్తిస్మము గురించి అనేకమంది అనేకరకాలుగా అర్ధం చేసుకుంటూ ఉంటారు.🤷🏻‍♂️🤷🏻‍♂️ చాలామంది చాలా కారణాలుబట్టి బాప్తిస్మము తీసుకుంటూ ఉంటారు.🤷🏻‍♂️🤷🏻‍♂️ కొందరు పెళ్ళిళ్ళకి,🤦🏻‍♂️🤦🏻‍♂️ కొందరేమో పెద్దవారి ప్రోత్సాహం వలనో,🤷🏻‍♂️🤷🏻‍♂️ కొందరు తీసుకోకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో🤷🏻‍♂️🤷🏻‍♂️ అని బాప్తిస్మము తీసుకుంటూ ఉంటారు. తీరా బాప్తిస్మము తీసుకున్నాక వారికి నచ్చినట్లే జీవిస్తూ ఉంటారు.🙆🏻‍♂️🙆🏻‍♂️ అసలు క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన ప్రతీ ఒక్కరు మనము ఎందుకు బాప్తిస్మము పొందాము,🤔🤔 బాప్తిస్మము తీసుకున్న మన జీవితాలు ఎలా ఉండాలి..??🤔🤔 ఎలా ఉండకూడదు..??🤔🤔 ఎలా ఉంటున్నాయి..?? అనే విషయాన్ని గ్రహించాలి తెలుసుకోవాలి,🙏🏻🙏🏻 దాని ప్రకారము జీవించుటకు ఇష్టపడాలి.🙏🏻🙏🏻 అప్పుడే బాప్తిస్మానికి అర్ధం ఉంటుంది.✅✅ “బాప్తిస్మము” అంటే ముంచబడుట, పాపముల విషయమై పాతిపెట్టబడుట అని అర్ధం.✅✅ మరి పాపముల విషయమై పాతిపెట్టబడాలి అనుకుని బాప్తిస్మము పొందుకునే/పొందుకున్న మనము ఎలా ఉండాలి..??🤔🤔 మనము ఏమై ఉన్నవారము..??🤔🤔 దేవుని వాక్యము ఈలాగు సెలవిస్తుంది..📖📖 క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు. Galatians(గలతీయులకు) 3:27 అవును.✅✅ బాప్తిస్మము పొందుకున్నామంటే మనము యేసు క్రీస్తును ధరించుకున్నవారము అవుతాము.🙏🏻✅ వాస్తవానికి మనము బాహ్యంగా ఏమి శరీరంపై ధరిస్తామో అదే ఎదుటివారికి కనిపిస్తుంది.🧏🏻🙏🏻 మనము ఒకటి ధరించుకుంటే ఎదుటివారికి వేరొకటి కనిపించదు కదా..!!🤔🤔 అలాగే.. బాప్తిస్మము పొందుకున్న మనము క్రీస్తును ధరించుకున్నవారముగా జీవించాలి, అలా జీవిస్తే అప్పుడు మనలో క్రీస్తు మాత్రమే కనిపిస్తాడు.🙏🏻🙏🏻 క్రీస్తును మనము ధరించుకుని జీవిస్తున్నప్పుడు మనలను చూసేవారికి మనలో లోకము/ లోకపు ఆశలు కనిపిస్తాయా..???🤔🤔 కనిపించవు కదా..!!🤷🏻‍♂️🤷🏻‍♂️ అసలు క్రీస్తును మనము ధరించుకున్నప్పుడు మనలో లోకము కనిపించవచ్చా..?? కనిపించకూడదు కదా..!!🧏🏻🧏🏻 ఒకసారి ఆలోచించుకుందాం..🧏🏻🧏🏻 నిజముగా బాప్తిస్మము పొందుకున్న మనము క్రీస్తును ధరించుకున్నవారముగా జీవించగలుగుతున్నామా..??🤔🤔 క్రీస్తు మన జీవితాలలో కనిపిస్తున్నాడా..??🤔🤔 మన క్రియలలో, మన మాటలలో, మన ప్రవర్తనలో క్రీస్తును చూపించగలుగుతున్నామా..??🤔🤔 ఏ విషయములోనైనా క్రీస్తును చూపించలేనివారముగా ఉంటే మనము క్రీస్తును ధరించుకున్నవారము కానేకాదు.🙅🏻‍♂️🙅🏻‍♂️ అంటే.. ఊరకనే బాప్తిస్మము తీసుకుని జీవించేస్తున్నామా..??🤔🤔 ఇంకా పాప/పాత జీవితమే జీవిస్తున్నామా..??🤔🤔 అలా అయితే బాప్తిస్మము తీసుకున్నది ఎందుకు..??🤔🤔 దేవునితో ప్రమాణాలు చేసింది ఎందుకు..??🤔🤔 అంతా అబద్ధమేనా..??🧏🏻🧏🏻 మన అవసరాలకోసం బాప్తిస్మము తీసుకుని మన ఇష్టం వచ్చినట్టు జీవించే వ్యక్తుల జాబితాలో మనము ఉన్నామా..???🤔🤔 ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి..🧏🏻🧏🏻 మనము దేని నిమిత్తం బాప్తిస్మము తీసుకున్నా బాప్తిస్మము బాప్తిస్మమే కానీ వేరొకటి అవ్వదు.🙅🏻‍♂️🙅🏻‍♂️ బాప్తిస్మము తీసుకుని క్రీస్తును ధరించుకోలేనివారముగా మనముంటే మన భక్తిజీవితం ఎంతైనా అది అంతా వ్యర్ధమే.🙏🏻🙏🏻 మన జీవితాలలో క్రీస్తుని ధరించుకున్నాము అని మనము చెప్పుకోవడం కాదు మనలను చూసినవారు మనము ధరించుకున్న క్రీస్తుకొరకు చెప్పగలగాలి.🥳🤩 అప్పుడే మన జీవితానికి, మనము బాప్తిస్మము తీసుకున్నదానికి అర్ధం ఉంటుంది.🤩🤩 మనము బాప్తిస్మము పొందుకున్న బిడ్డలమైతే మనము సాధారణ వ్యక్తులముగా జీవించడానికి వీలులేదు, క్రీస్తును ధరించుకున్నవారముగానే జీవించాలి.🙏🏻🙏🏻 కాబట్టి...🧏🏻🧏🏻 ఆలోచించుకుందాం...🙏🏻🙏🏻 సరిచేసుకుందాం...🙏🏻🙏🏻 క్రీస్తును ధరించుకొనిన బిడ్డలముగా జీవిస్తూ దేవుని నామమును మహిమపరుద్దాం..🙏🏻🙏🏻 అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్..!! ఆమెన్..!! God bless you. #🔱దేవుళ్ళు #యేసయ్య దీవెనలు #✝యేసయ్య ఆదరణ📿 #📕బైబిల్ వాక్యాలు #✝జీసస్

More like this