🙏🙏Praise the Lord🙏🙏
మాట తప్పని దేవునియందు ఆశకలిగియున్నావా..??🤔🤔
దేవుని మాట మీద నీకు నిజముగా నమ్మికయుంటే.. నిజముగా మాట తప్పని దేవునియందు ఆశ కలిగియుంటే ఇక దేనికి భయపడకు..🙏🏻🙏🏻
దేవుని వాక్యము ఈలాగు సెలవిస్తుంది..📖📖
మనుష్యులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు.✅
రాజులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు.✅
(ఎందుకో తెలుసా...???🧏🏻🧏🏻🧏🏻)
రాజులచేతనైనను, నరులచేతనైనను రక్షణ (విడుదల, సహాయము) కలుగదు. వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. (కానీ...)
ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశపెట్టుకొనునో వాడు ధన్యుడు.
ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దాని లోని సర్వమును సృజించినవాడు, “ఆయన ఎన్నడును మాట తప్పనివాడు.”
“బాధపరచబడువారికి ఆయన న్యాయము తీర్చును ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును.” యెహోవా బంధింపబడిన వారిని విడుదలచేయును.
Psalms(కీర్తనల గ్రంథము) 118:8,9
Psalms(కీర్తనల గ్రంథము) 146:3,4,5,6,7
అవును.✅✅
మాట ఇచ్చిన మనుష్యులు మాట తప్పిపోవచ్చు,🤷🏻♂️🤷🏻♂️ మాట ఇచ్చిన అధికారులు మాట తప్పవచ్చు,🤷🏻♂️🤷🏻♂️ మాట ఇచ్చిన రాజులు మాట తప్పవచ్చు,🤷🏻♂️🤷🏻♂️ మాట ఇచ్చిన పెద్దలు మాట తప్పవచ్చు,🤷🏻♂️🤷🏻♂️ కానీ “నీవు నమ్మిన, నీకు మాట ఇచ్చిన దేవుడు ఎన్నడును మాట తప్పడు.”✅🤩
🔅 మనుష్యులను నమ్ముకుని మభ్యపడ్డవాళ్ళు ఉన్నారు,
🔅 తెలివిని నమ్ముకుని తూలిపడిన వారు ఉన్నారు,
🔅 ధనమును నమ్ముకుని ధగా పడినవారూ ఉన్నారు కానీ
♂️ దేవుని నమ్మిన వారిలో సిగ్గుపరచబడినవారు ఏ ఒక్కరూ లేరు. హల్లెలూయా.🙌🏻🙌🏻
దేవుని వాక్యము ఈలాగు సెలవిస్తుంది..📖📖
... యెహోవా మీద ఆశపెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును.
Psalms(కీర్తనల గ్రంథము) 130:7
దేవునికొరకు కనిపెడితే దేవుని కృపను పొందుకుంటాము, సమస్యలనుండి, బంధకాలనుండి సంపూర్ణ విమోచన, విడుదల పొందుకుంటాము.🙏🏻🙏🏻
మనము ఎప్పుడైతే మాట తప్పని దేవునియందు విశ్వాసముంచి, ఆయనమీద ఆశపెట్టుకుని జీవిస్తామో..🧏🏻🧏🏻
- ఆయన సహాయమును అన్నివేళల్లో పొందుకుని జీవించగలము.✅✅
- ఆయనిచ్చు విడుదలను, ఆయనిచ్చు సంతోషమును ఎల్లవేళలా పొందుకుని జీవించగలము.✅✅
కాబట్టి.. ఆ రీతిగా దేవునిమీద ఆశపెట్టుకుని జీవిద్దాం..🙏🏻🙏🏻 మాట తప్పని దేవునియెడల విశ్వాసము కలిగి జీవించి, మాట తప్పని దేవునినుండి ఆశ్చర్యకరమైన సహాయాన్ని అన్నివేళల్లో పొందుదాం..🙏🏻🙏🏻
దేవుని కృప పొందుకుందాం, సంపూర్ణ విమోచన పొందుకుందాం.🙏🏻
అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్..!! ఆమెన్..!!
God bless you. #✝యేసయ్య ఆదరణ📿 #🔱దేవుళ్ళు #✝జీసస్ #యేసయ్య దీవెనలు #📕బైబిల్ వాక్యాలు

