ShareChat
click to see wallet page
*🛐 ప్రార్థన 🛐* యెషయా 2:5. “రండి మనము యెహోవా వెలుగులో నడుచుకొందము.” *🙇🙇‍♀️🙇🏻..మహిమగల తండ్రి, మహోన్నతుడా మహిమాస్వరూపి, శాశ్వతమైన ప్రేమతో మమ్ములను ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా జీవితాలలో ఈ దినమువరకు మీరు చూపించిన కృపకై, నడిపింపుకై, ఆశీర్వాదములకై, మీరు మమ్ములను వెలుగులో నడిపించినందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభువా యేసయ్యా, ఈ గడియలో అంధకారము, అయోమయం, పాపపు మార్గాలు, లోకపు మోసములు చుట్టుముట్టిన ఈ లోకములో జీవించుచున్న మీ బిడ్డలందరిని మీరు జ్ఞాపకం చేసుకొనుము. మీ వాక్యములో మీరు సెలవిచ్చిన ప్రకారము — “రండి మనము యెహోవా వెలుగులో నడుచుకొందము” అనే ఈ దివ్యమైన పిలుపును మా హృదయాలలో స్థిరపరచుము ప్రభువా. తండ్రి, మా జీవితాలలో ఉన్న ప్రతి అంధకారాన్ని తొలగించుము. మా ఆలోచనలలో వెలుగును, మా హృదయాలలో పరిశుద్ధతను, మా నడకలో నీతిని అనుగ్రహించుము. మేము ఎటు వెళ్లాలో తెలియక నిలిచిపోయినప్పుడు, మీ వెలుగుతో మా అడుగులను సరిచేయుము. మా స్వంత జ్ఞానములో కాదు గాని, మీ వెలుగులోనే నడుచుకొనే కృప మాకు దయచేయుము. ప్రభువా, మాకు వ్యతిరేకంగా లేచిన ప్రతి అంధకార శక్తిని, భయాన్ని, అయోమయాన్ని మీ వెలుగుతో పారద్రోలుము. మీ వెలుగులో నడిచేటప్పుడు మాకు సమాధానం కలుగునట్లు, ధైర్యము పెరుగునట్లు, సత్యములో స్థిరపడునట్లు చేయుము. మా గృహాలలో మీ వెలుగు ప్రకాశించునట్లు చేయుము, మా కుటుంబాలలో ప్రేమ, ఐక్యత, సమాధానం రాజ్యముచేయునట్లు చేయుము. మా పనిలో, మా సేవలో, మా సాక్ష్యంలో మీ వెలుగు ఇతరులకు కనబడునట్లు మమ్ములను ఉపయోగించుము తండ్రి. మీ వెలుగులో నడిచేవారిని నీవు ఎప్పుడూ విడువని దేవుడవని మేము నమ్ముచూ స్తుతిస్తున్నాము. మా జీవితమంతయు అంధకారాన్ని విడిచి, మీ వెలుగులో నడుచుకొనే విధేయ హృదయమును మాకు అనుగ్రహించుము. ఈ దినమునుండి మా అడుగులను మీ వెలుగులో స్థిరపరచి, మా హృదయాలను మీ సత్యముతో నింపి, మీ మహిమకై జీవించు జీవితం మాకు దయచేయుమని, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకున్నాము మా పరమతండ్రి. ఆమేన్. 🙏 *🤝🏻 దేవుని పనివాడు.* ప్రార్ధన ఫొటోస్ కొరకు వాట్సప్ లో మెసేజ్ చేయండి 9573770951. #💖నా యేసయ్య ప్రేమ #bible #teluguchristian #christian #prayer
💖నా యేసయ్య ప్రేమ - ShareChat

More like this