#🙏ఓం నమః శివాయ🙏ૐ #ధనుర్మాసం శుభాకాంక్షలు #ధనుర్మాసంలో శివ సుప్రభాతం "ఏలోరెంబావై తిరువెంబావై" #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🕉️హర హర మహాదేవ 🔱
ఓం నమః శ్శివాయ 🙏🙏
ధనుర్మాసం సందర్భంగా శైవి సాహిత్యమైన తిరువెంబావైలోని 17వ పటికం 🙏🙏
గానం రోజు :: 01.01.2026(17వ రోజు)
సాహిత్యం :: శ్రీమాణికవాచగర్
ఓం గం గణపతయే నమః 🙏🙏
ఓం నమః శ్శివాయ 🙏🙏
తిరుచిత్రలంబలం 🙏🙏
17వ పటికం ::
సెంగణవన్ పాల్ దిశైముఖన్ పాల్ దేవర్గళ్ పాల్
ఎంగుం ఇలాదదు ఓర్ ఇన్బం నవ్పాలదా
కొంగు ఉణ్ కరుం కుళలి నం తమ్మై కోదాటి
ఇంగు నం ఇల్లంగళ్ తోరుం ఎళుందరుళి
చెంగమలం పొన్ పాదం తందు అరుళుం సేవకనై
అంకణ్ అరసై అడియోం గట్కు ఆర్ అముదై
నంగళ్ పెరుమానై పాడి నలం తిగళ
పంగయం పూంవునల్ పాము ఆడు ఏల్ ఓర్ ఎంబావాయ్.
భావం (తెలుగు లో) ::
తాత్పర్యం : మహావిష్ణువు వద్ద, బ్రహ్మ వద్ద, దేవతల వద్ద ఎక్కడాలేని మహానందం మనకు సొంతమైనది. సుగంధభరితమైన నల్లని కురులు కల ఓ బాలా! మన అందరి దోషాలను తొలగించి, ఇక్కడ మన ఇంటింటికీ వచ్చి అనుగ్రహించి, ఎర్రని తామర పువ్వు వంటి బంగారపు పాదములను ఇచ్చి ఇతరులకు సాధ్యం కాని విధంగా అనుగ్రహించే, కరుణాదృష్టి గల మన ప్రభువుని, భక్తులకు నిండైన అమృతాన్ని, మన దైవాన్ని కీర్తించి, మేలయ్యేలా తామరపూల తటాకంలో మునిగి స్నానమాడుదాము! మేలుకో! ఆలోచించు, ఓ మా చెలియా!.
హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏
తిరుచిత్రలంబలం 🙏🙏

