ShareChat
click to see wallet page
#⛳భారతీయ సంస్కృతి భారతీయుడి గుండెల్లో ఉద్భవించే నాదం..వందేమాతరం వందేమాతరం.. సుజలాం సుఫలాం...ఈ పదాలు పలికినా, విన్న చాలు ప్రతీ భారతీయుడికి గుండెలోతుల్లోంచి దేశభక్తి భావం ఉప్పొంగుతుంది. స్వాంతంత్ర్య సంగ్రామంలో సమరయోధులకు ఊపిరిపోసిన గేయం వందేమాతరం..ఇది ఒక గేయం మాత్రమే కాదు నినాదం కూడా.. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ వందేమాతర నినాదం ఎందరికో స్పూర్తినిస్తూనే ఉంది. జాతీయ గేయంగా అజరామర కీర్తిని పొందిన వందేమాతరం నవంబర్ 7 కల్లా సరిగ్గా 150 సంవత్సరాలను పూర్తి చేసుకోబోతోంది..ఈ సందర్భంలో అసలు ఈ గీతం ఎలా పుట్టింది..దీనికి స్పూర్తినిచ్చిన చారిత్రక సంఘటనలేంటి అనేవి మనం ఇప్పుడు చూద్దాం. బెంగాల్ సాయుధ పోరాటదళం నుంచి యోధుడు కుదీరాంబోస్ కు 1908 ఆగస్టు 11న ఉరిశిక్ష ఖరారైంది. ఆ సమయంలో ఉరికంబానికి ముద్దాడి, వందేమాతరం అని నినదిస్తూ ప్రాణాలొదిలాడు. ఆ సమయంలో యావత్ భారత్ వందేమాతరం అంటూ నినదించింది. ఇలా వందేమాతరం అంటూ నినదించిన వీరులు మన చరిత్రపుటల్లో ఎందరో ఉన్నారు వందేమాతరం’ గేయం బంకిమ్ చంద్ర ఛట్టోపాధ్యాయ్‌ రచించిన ‘ఆనంద్‌మఠ్’ నవలలోనిది. ఈ నవల రచనకు బీజం పడింది 1770ల నాటి బెంగాల్‌లో. దారుణమైన కరువుతో ప్రజలు అల్లాడుతుండగా, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకుల పన్నుల పీడనానికి వ్యతిరేకంగా అందరూ ఏకమై చారిత్రాత్మక తిరుగుబాటు చేశారు. ఈ ఐక్య పోరాటమే బంకిమ్ చంద్రుడిలో జాతీయతా భావాన్ని రగిలించి ‘ఆనంద్‌మఠ్’ నవలకు ప్రాణం పోసింది. భారతీయులలో నెలకొన్న నిరాశను తొలగించి మాతఈభూమి కొరకు సర్వస్వాన్ని సమర్పించే వారిగా భారతీయులను తీర్చిదిద్దడం అవసరం అని భావించిన ఠాగూర్, అందులో రాసిన గేయమే వందేమాతరం. 1875, నవంబరు 7న వందేమాతరం మొదటి రెండు చరణాలను వారు రాశారు. బంకిమ్‌చంద్ర రాసిన ‘దుర్గేశనందిని’, ‘అనుశీలన మిత్ర’ వంటి నవలలు బెంగాల్‌లో కొత్తతరం పాఠకులను ఆకట్టుకుంటున్న సమయం అది. కానీ ఆయన ‘వందేమాతరం’ మాత్రం పండితులకి పెద్దగా నచ్చలేదు, పామరులకు ఏమాత్రం అర్థం కాలేదు. ఆయన బతికున్నంత కాలం వందేమాతర గీతం సామాన్యులకు చేరలేదు. ఆలోపు దానికి మరో రెండు పాదాలు చేర్చి ప్రార్థన గీతంగా తన ‘ఆనందమఠ్‌’ నవలలో ఉపయోగించాడు. 1895లో బంకిమ్‌ చనిపోయాడు. ఆయన ఊహించినట్టే... అప్పటికీ ఆ పాట పెద్దగా ప్రజల్లోకి వెళ్లలేదు. ఆ మహత్తు జగత్తుకు తెలియడానికి ఇంకో పదేళ్లు పట్టింది. ఆరు చరణాలున్న ఈ గీతంలో సంస్కృతం పదాలతో పాటు కొన్ని బెంగాళీ భాషా పదాలున్నాయి. అయినా ఈ గీతం ఓ అనుభూతి అందరి హృద‌యాల‌ను స్పృశిస్తుంది. 1882లో ప్రచురితమైన ‘ఆనంద్‌మఠ్’ నవల, ఆ తర్వాత 1905 నాటి బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలో లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. ‘వందేమాతరం’ నినాదం యావత్ దేశాన్ని ఏకతాటిపై నడిపించింది. దాన్నే మనం వందేమాతర ఉద్యమమని, స్వదేశీ ఉద్యమమని అంటున్నాం. ఈ వందేమాతర ఉద్యమం లక్ష్యం విభజనను వ్యతిరేకించడమే కాకుండా, స్వదేశీ వస్తువలును ఉపయోగించడం, విదేశీ వస్తువులను బహిష్కరించడం, విద్యావ్యవస్థలో స్వదేశీ పద్ధతులను ప్రవేశపెట్టడం అనేవి దీని లక్ష్యాలు. వందేమాతరం నినాదాన్నీ, గేయాన్నీ వాయువేగంతో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా తీసుకెళ్లారు బెంగాలీ విప్లవకారులు. వివిధ భాషల్లో కరపత్రాలుగా ముద్రించి పంచారు. అదే పేరుతో పత్రికలూ నడిపారు. ఆ సాయుధ దళాల ముఖ్యనేత అరవింద్‌ ఘోష్‌ (తర్వాతి కాలంలో అరవింద యోగి అయ్యారు) మొదటిసారిగా వందేమాతర గీతాన్ని ఇంగ్లిషులోకి అనువదించాడు. ఆ ప్రతి 1905-1907 మధ్య దక్షిణాది భాషలన్నింటిలోకీ తర్జుమా అయ్యింది. 1906లో పాథేఫోన్స్‌ కంపెనీ దాన్ని గ్రామఫోన్‌ రికార్డుగా తీసుకొచ్చింది. మరో ఏడాది తర్వాత కానీ, బ్రిటిష్‌ పాలకులు ఆ గేయ తీవ్రతను గ్రహించలేకపోయారు. ‘ఆనందమఠ్‌’ నవలలో భాగమైన వందేమాతరం గీతంలోని చివరి పాదాల్లో ప్రస్తావించిన దుర్గమ్మను మృత్యుదేవతగా అభివర్ణించుకున్నారు. అందులోని ‘రాక్షసులు’ అనే మాటను తమకు అన్వయించున్నారు. ఆ పాటపైన నిషేధాజ్ఞలు విధించారు. ఆ నిరంకుశమైన నిర్ణయం భారతీయుల్లో ఆగ్రహాన్ని పెంచింది. కార్మికులూ కర్షకులూ రైతులూ మహిళలూ... ఒకరేమిటి, సమస్త ప్రజానీకం పోరాటయోధులుగా మారారు. భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో 1905-11 మధ్య కాలాన్ని ‘వందేమాతర యుగం’ అంటున్నా, ఆ ప్రభావం 1947 వరకూ మహోజ్జ్వలంగా కొనసాగింది. 1920వ సంవత్సరం వరకుకూడా వందేమాతరం అందరికీ ఉమ్మడి నినాదంగా ఉండేది. కానీ బ్రిటిష్ వారు ఈ గేయానికి హిందువుల ప్రార్థనా గీతమనే దుష్ప్రచారం చేశారు. ఈ భావనతో 1920 30 లలో చోటుచేసుకున్న మతకల్లోలాలు ఆజ్యం పోశాయి. కొందరు ముస్లిం నేతలు కూడా ఈ గేయానికి అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ గేయాన్ని కొంతమంది పాడకుండా నిషేధించారు కూడా.. పాటలోని తొలి రెండు పదాలు ఏ మతానికి వ్యతిరేకం కావని, దేశాన్ని కలిపి ఉంచే ఒక దారంలాంటిది ఈ గీతమని స్పష్టం చేశారు రవీంద్రనాథ్ ఠాగూర్. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన రోజున వందేమాతర గేయాన్నే ఆకాశవాణిలో తొలి విజయగీతంగా వినిపించారు. దాంతో అప్పటి వరకు ఉన్న నిషేధం తొలిగిపోయింది. ఇక 1950 రాజ్యాంగ పరిషత్తు వందేమాతర గీతాన్ని ‘జనగణమన’తో సమానంగా గౌరవిస్తూ జాతీయ గేయంగా అధికారికంగా స్వీకరించింది. కేవలం స్వతంత్ర్య సంగ్రామంలోనే కాదు, తెలంగాణలోనూ వందేమాతరం విద్యార్థి ఉద్యమంగానే రాజుకుంది. 1938 నవంబర్ 28న బి హాస్టల్ కమ్యూనిటీ హాలులో సమావేశమైన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు వందేమాతర గేయాన్ని గళమెత్తి పాడారు. అది సహించని అధికారలు వారిని లోపలే బంధించి తాళం వేశారు. సాయంత్రానికి వదిలేశారు. వారిని క్లాసులకు అనుమతించలేదు. దాంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఈ ఉద్యమం తీవ్రరూపం దాల్చి నిజాం పాలకులకు చెమటలు పట్టేలా చేసింది. దాంతో వారు ఈ నిరసనల్లో పాల్గొన్న 1550 మంది విద్యార్థుల్ని విద్యాసంస్థ నుండి బహిష్కరించి దేశంలోని ఏ యూనివర్సిటీ వాళ్లకు సీటివ్వొద్దంటూ కఠినంగా ఆదేశించారు. కానీ నాగ్ పూర్ విశ్వవిద్యాలయం వారికి అవకాశం ఇచ్చింది. అలా అక్కడ చదివిన విద్యార్థుల్లో ఒకరు మన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు. ఇక జనగణమన గేయాన్ని తప్పనిసరిగా 52 సెకన్లలో పాడాలి కానీ వందేమాతరానికి ఆ పరిమితి లేదు కాబట్టి చాలామంది చాలారకాలుగా ఈ గేయాన్ని పాడారు. అయినప్పటికి మొదటిసారిగా 1947 ఆగస్టు 15న ప్రఖ్యాత సంగీతకారుడు ఓం ప్రకాశ్ వందేమాతర పూర్తి గేయాన్ని ఎలాంటి వాద్యసంగీతం లేకుండా స్వచ్ఛమైన భావన అర్థమయ్యేలా పార్లమెంట్ లో వినిపించారు. ఇప్పుడు మనం పాడుతున్న వందేమాతరం మొదటి చరణం వరకు మాత్రమే పాడుతున్నాం. ఇక బీబీసీ వరల్డ్ సర్వీస్ నిర్వహించిన పోల్ లో ప్రపంచ ప్రసిద్ధ జాతీయ గేయాల్లో వందేమాతర గేయం రెండో స్థానం గెలుచుకుంది. వందేమాతర గేయం"అమ్మ" అన్న పిలుపులోని ఆప్యాయత, ప్రేమ, భక్తి కలగలసినది.ఇది కేవలం ఒక పాట కాదు,అది ఒక జాతిని మేల్కొలిపిన ఒక చైతన్య స్పూర్తి. ఇది నేటిక కూడా కొనసాగుతూ వస్తోంది అంటే అందులో ఆశ్చర్యమేమీ అక్కర్లేదు. సంతోషి దహగాం #✋బీజేపీ🌷 #🔹కాంగ్రెస్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🌅శుభోదయం
⛳భారతీయ సంస్కృతి - ShareChat

More like this