*✳️ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము 📖*
╭┄┅┅─══════════════─┅┅┄╮
🌊 *బండసందులలో జీవజలములు* 🌊 ╰┄┅┅─══════════════─┅┅┄╯
*యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. సామెతలు 15:8.*
But the prayer of the upright is his delight... proverbs 15:8.
*💥 నిజాయితీగా జీవించే తన ప్రజలు తనకు ప్రార్థిస్తే దేవుడు మురిసిపోతాడు!💥*
God is delighted when his people, who behave honestly, pray to him!
నా ప్రియ స్నేహితులారా, తన ప్రజలు ప్రార్థించాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకంటే వారిని దీవించేందుకు, వారిలో,వారిద్వారా పని చేసేందుకు ఆయన నిర్దేశించిన సాధనాలలో ప్రార్థన ఒకటి. వారి ప్రార్థనలు వినాలనీ వారితో కలిసిమెలసి ఉండాలనీ ఆయన కోరిక. కాబట్టి నిజాయితీగా జీవించే తన ప్రజలు తనకు ప్రార్థిస్తే ఆయన మురిసిపోతాడు. తనకు ప్రార్థన చేసేవారందరికీ యథార్థంగా ప్రార్థించేవారికి యెహోవా దగ్గరగా ఉన్నాడు. ఈ గొప్పరాజు ప్రార్థన ఆలకిస్తాడు. అయితే మన ప్రార్థనలు మనఃపూర్వకంగా, ఆయన సంకల్పానుసారంగా ఉండాలి. యిర్మీయా 33:3లో నాకు ప్రార్థన చేయుము . నేను నీకు జవాబిస్తాను, నీకు తెలియని గూఢమైన గొప్ప సంగతులను తెలియజేస్తాను. అని చెప్పబడినది. బైబిల్లోని యెహోవా దేవునికి మనం ప్రార్థన చేస్తున్నామంటే సకల విశ్వాన్ని సృష్టించినవానికి చేస్తున్నామన్న మాట.when we pray to jehovah, it means we are praying to the one who created the entire universe యిర్మీయాలాగా నమ్మకం నిండిన యథార్థ హృదయంలోనుండి వచ్చిన ప్రార్థన ఆయన చెవులకు సోకుతుంది. అద్భుతమైన జవాబులు వస్తాయి. దేవుడు ఏమి చేయలేనివాడు కాడు. చెవిటివాడు కాదు. ఆయన తన ప్రజల ప్రార్థనలు వినిపించుకోకపోతే వారి తరఫున పనిచేయకపోతే ఆ తప్పు ఆయనది కాదు. వారిదే. పాపం మనలను దేవుని సహవాసం నుండి వేరుచేస్తుంది. అనేకసార్లు జవాబు రాని ప్రార్థనలకు కారణం ఇదే. సామెతలు 28:13లో అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఆమేన్.
సామెతలు 15:8. ఇది కూడ వాగ్దానంతో సమానమైనదే. ఎందుకంటే ఇందులో ఉన్న విషయం ప్రస్తుత కాలానికి సంబంధించిన నిజాన్ని వెల్లడి చేస్తున్నది. ఈ నిజం ఎన్ని తరాలైనా నిజంగానే ఉంటుంది. యధార్థవంతుల ప్రార్ధనలో దేవునికి గొప్ప ఆనందం దొరుకుతుంది. 'మీరే నా ఆనందం' అని దేవుడు వారితో చెపుతాడు. మన మొదటి ప్రాధాన్యత యధార్ధంగా జీవించడం. ఇటుగాని, అటుగాని పడిపోకుండ నిదానంగా సాగిపోవాలి. మన పద్ధతులలో కుటిలత్వం ఉండకూడదు. దుష్టత్వం ఎదుట మనం ఎట్టి పరిస్థితిలోను సాగిలపడకూడదు. ఖచ్చితమైన యధార్ధతతో సరాళమైన మార్గంలో సాగిపోదాం. మనం ఇటు అటు ఊగడం మొదలుపెట్టామా మన జీవితం కొట్టుకుపోతుంది. వంకర మార్గాల లోనికి వెళ్ళడానికి మనం ప్రయత్నిస్తే అసలు ప్రార్ధనే చేయలేం. ఒకవేళ ప్రార్ధించినా ఖచ్చితంగా ఆ ప్రార్ధనలు పరలోకం చేరవు. మనం తిన్నని మార్గంలో ఉండి దేవుడు బయలుపరచిన చిత్తాన్ని అనుసరిస్తున్నామా? అలా అయితే మనం ఎక్కువగా ప్రార్ధనలు చేద్దాం. మన ప్రార్ధనలు దేవునికి ఆనందం కలిగించాలనుకుంటే, ఆయనకు మనకు మధ్య ఉన్న ఆటంకాలు తొలగించుకోవాలి. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. మన ప్రార్ధనలోని వ్యాకరణాన్ని ఆయన పట్టించుకోడు. మనం ప్రార్ధించేటపుడు ఉపయోగించే భాషాశైలిని తప్పుపట్టడు. పద్దతి ప్రకారం ఒక క్రమంలో ప్రార్ధించామా లేదా అని చూడడు. ఈ విషయాలన్నీ పట్టించుకుని మనుష్యులు మనలను తృణికరిస్తారేమో గాని, తండ్రిగా తన స్వంత బిడ్డలమైన మనం ముద్దు ముద్దుగా పలికే ఆ నత్తి మాటల్లోనే ఆయన ఆనందిస్తాడు As a father, he finds joy in the sweet, lipsing words that we speak.. పసివారైన తన కుమారులు, కుమార్తెలు చేసే సామాన్య ప్రార్ధనల్లో ఆయన సంతోషిస్తాడు. ప్రభువు ఆనందిస్తున్న ఆ ప్రార్ధనల్లో మనం కూడ ఆనందం పొందాలి కదా. రండి, ఆయన సింహాసనం దగ్గరకు తరచుగా వెళ్ళి వద్దాం. మన ప్రార్ధనలకు తగిన కారణాలుంటాయని ప్రభువుకు తెలుసు కాబట్టి ఆయనకు కృతజ్ఞతా వందనాలు చెల్లిద్దాం. ఆమేన్
*🛐ప్రార్ధన:- ప్రభువా నీకు స్తోత్రము, మీ ఆజ్ఞ ననుసరించి ప్రార్థించి, మీ దీవెనలు పొందుకొని, మీ పనులు చేసేందుకు ప్రార్థన అనే సాధనమును ఇచ్చినారు స్తోత్రం. యధార్థముగా ప్రార్ధించే వారి ప్రార్థనలకి జవాబు ఇవ్వటమే కాకుండ వారితో సమీపముగా ఉన్న దేవా స్తోత్రం. సృష్టికర్తవైన నీకు ప్రార్థన చేసే ధన్యత నిచ్చిన దేవా స్తోత్రం. యిర్మీయా వంటి ప్రార్థన జీవితము మేము కలిగి ఉండే భాగ్యము నిమ్ము. యధార్థవంతుల ప్రార్థనలకి ఆనందించు దేవా స్తోత్రం. దుష్టత్వము, కుటిలత, వంకర మార్గము కలిగి ఉండక యధార్థంగా ప్రార్ధించే మనస్సు నిమ్ము. మా బాష, పద్ధతి కాకుండ మా యధార్థ ప్రార్థనని వినే దేవా స్తోత్రం. మీరు చేసిన మేళ్లకి కృతజ్ఞతలు చెల్లించే మనస్సు నిమ్ము. మా ప్రార్థనలు నీకు ఆంగీకారముగా చేయు ధన్యత నిమ్మని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొన్నాము మా పరమ తండ్రి ఆమేన్*
💓 *హల్లెలూయ...*
*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*
*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
➖➖➖➖➖➖➖➖➖➖
🙏 *మా గురించి మీ అనుదిన ప్రార్ధనలో జ్ఞాపకము చేసుకుంటున్నారని విశ్వసిస్తున్నాము. అంతకుమించి మీనుండి ఏదియు మేము ఆశించటములేదు.*
👉 *మీకు పంపుతున్నా అను దిన ఆత్మీయ సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మాకు తెలపగలరు.*
👉 *అను దిన ఆత్మీయ సందేశాలు* ప్రతి రోజు కావలసిన వారు
*WhatsApp లో నుండి మాత్రమే సంప్రదించండి* - *9573770951*
GOD SERVANT
*దైవాశ్శీసులు!!!*
👉 మీ మిత్రులకు SHARE చేసి మీ వంతుగా దేవుని పని చేయండి.
#prayer #యేసయ్య #bible #teluguchristian #christian @యేసుక్రీస్తు అందరికి ప్రభువు

