🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌻పంచాంగం🌻
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,
తేదీ ... 04 - 01 - 2026,
వారం ... భానువాసరే ( ఆదివారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
హేమంత ఋతువు,
పుష్య మాసం,
బహుళ పక్షం,
తిథి : *పాడ్యమి* మ2.29 వరకు,
నక్షత్రం : *పునర్వసు* సా5.40 వరకు,
యోగం : *ఐంద్రం* ఉ7.34 వరకు
తదుపరి *వైధృతి* తె5.19 వరకు,
కరణం : *కౌలువ* మ2.29 వరకు,
తదుపరి *తైతుల* రా1.40 వరకు,
వర్జ్యం : *ఉ.శే.వ7.48 వరకు*
మరల *రా1.22 - 2.54*
దుర్ముహూర్తము : *సా4.07 - 4.51*
అమృతకాలం : *మ3.24 - 4.55*
రాహుకాలం : *సా4.30 - 6.00*
యమగండం : *మ12.00 - 1.30*
సూర్యరాశి : *ధనుస్సు*
చంద్రరాశి : *మిథునం*
సూర్యోదయం : 6.36,
సూర్యాస్తమయం : 5.35,
*_నేటి పాశురం_*
*తిరుప్పావై –20 వ పాశురము*
*ముప్పత్తు మూవర్ అమరర్కు మున్ శెన్రు*
*కప్పమ్ తవిర్కుమ్ కలియే తుయిలెళాయ్*
*శెప్పముడైయాయ్ తిఱలుడైయాయ్ ! శెత్తార్కు*
*వెప్పమ్ కొడుక్కుమ్ విమలా తుయిలెళాయ్*
*శెప్పన్న మెన్ములైచ్చెవ్వాయ్ చ్చిరు మరుంగుల్*
*నప్పిన్నై నంగాయ్ ! తిరువే ! తుయిలెళాయ్*
*ఉక్కముమ్ తట్టొళియుమ్ తన్దున్ మణాళనై*
*ఇప్పోతే యెమ్మై నీరాటేలే రెమ్బావాయ్.*
*తాత్పర్యము:*
ముప్పడిమూడుకోట్ల అమరులకు వారి కింకను ఆపద రాకముందే పోయి, యుద్ధభూమిలో వారికి ముందు నిలిచి, వారికి శత్రువుకవన కలిగెడి భయమును తొలగించెడి బలశాలీ! మేల్కొనుము. ఆర్జవము కలవాడా! రక్షణముచేయు స్వభావము గలవాడా! బలము కలవాడా! ఆశ్రితుల శత్రువులనే నీ శత్రువులుగా భావించి వారికి భయజ్వరమును కల్గించువాడా! నిర్మలుడా! మేల్కొనుము.
అంగారు కలశలములను పోలిన స్తనములను, దొండపండువలె ఎఱ్ఱని పెదవియును, సన్నని నడుమును కల ఓ నీలాదేవీ! పరిపూర్ణురాలా! లక్ష్మీ సమానురాలా! మేల్కొనుము. వీచుటకు ఆలపట్టమును(విసినకఱ్ఱను) కంచుటద్దమును మా కొసంగి నీ వల్లభుడగు శ్రీ కృష్ణునితో కలసి మేము స్నానమాడునట్లు చేయుము.
*_🌻శుభమస్తు🌻_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏
రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023

