ShareChat
click to see wallet page
#🆕Current అప్‌డేట్స్📢 విస్తరిస్తున్న మెదడును తినే అమీబా... ప్రపంచానికి కొత్త ముప్పు!* శివ శంకర్. చలువాది ******* ప్రపంచవ్యాప్తంగా 'బ్రెయిన్ ఈటింగ్ అమీబా' ముప్పు పెరుగుతోందని హెచ్చరిక వాతావరణ మార్పులు, పాత నీటి వ్యవస్థలే ప్రధాన కారణాలని అధ్యయనం వెల్లడి ఇటీవల కేరళలో పలు మరణాలకు ఈ అమీబానే కారణమైంది ఇవి ఇతర ప్రమాదకర బ్యాక్టీరియాలకు వాహకాలుగా పనిచేస్తున్నాయని ఆందోళన ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యానికి 'బ్రెయిన్ ఈటింగ్ అమీబా' (మెదడును తినే అమీబా) ముప్పు అంతకంతకూ పెరుగుతోందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. వాతావరణ మార్పులు, పాతబడిన నీటి సరఫరా వ్యవస్థలు, పర్యవేక్షణలో లోపాల కారణంగా ఈ ప్రమాదకర సూక్ష్మజీవులు నీటిలో, పర్యావరణంలో విస్తరిస్తున్నాయని పర్యావరణ, ప్రజారోగ్య శాస్త్రవేత్తల బృందం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అధ్యయన వివరాలు 'బయోకంటామినెంట్' జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. సాధారణంగా మట్టి, నీటిలో కనిపించే ఈ ఏకకణ జీవులను 'ఫ్రీ-లివింగ్ అమీబే' అని కూడా పిలుస్తారు. వీటిలో చాలా వరకు ప్రమాదకరం కానప్పటికీ, కొన్ని జాతులు ప్రాణాంతక ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. వీటిలో అత్యంత ప్రమాదకరమైనది 'నెగ్లేరియా ఫౌలెరి'. కలుషిత నీటిలో దిగడం, ఈత కొట్టడం వంటివి చేసినప్పుడు ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించే ఈ అమీబా, మెదడుపై దాడి చేసి తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది. ఇది చాలా అరుదైనప్పటికీ, సోకిన వారిలో మరణాల రేటు దాదాపు 99 శాతం వరకు ఉంటుంది. ఇటీవలి సంవత్సరాలలో కేరళలో నమోదైన పలు మరణాలకు కూడా ఈ అమీబానే కారణమని అధ్యయనంలో గుర్తుచేశారు. ఈ అమీబాల గురించి చైనాలోని సన్ యట్ సేన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు లాంగ్‌ఫీ షూ మాట్లాడుతూ.. "ఇతర సూక్ష్మజీవులు మనుగడ సాగించలేని పరిస్థితులను సైతం తట్టుకుని జీవించగలగడమే ఈ అమీబాలను మరింత ప్రమాదకరంగా మారుస్తోంది. ఇవి అధిక ఉష్ణోగ్రతలను, క్లోరిన్ వంటి శక్తివంతమైన క్రిమిసంహారకాలను కూడా తట్టుకోగలవు. సురక్షితం అనుకునే నీటి పంపిణీ వ్యవస్థలలో కూడా ఇవి జీవించగలవు" అని వివరించారు అంతేకాకుండా, ఈ అమీబాలు ఇతర హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లకు 'ట్రోజన్ హార్స్' (రహస్య వాహకాలు)గా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు నొక్కిచెప్పారు. ఇతర సూక్ష్మజీవులను తమ కణాలలో దాచుకోవడం ద్వారా, నీటి శుద్ధి ప్రక్రియల నుంచి వాటిని కాపాడతాయి. దీనివల్ల తాగునీటి వ్యవస్థలలో ప్రమాదకర క్రిములు వ్యాప్తి చెందడానికి, యాంటీబయాటిక్ నిరోధకత పెరగడానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది. భూమి వేడెక్కడం వల్ల ఉష్ణోగ్రతను ఇష్టపడే ఈ అమీబాలు గతంలో లేని కొత్త ప్రాంతాలకు కూడా విస్తరించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ముప్పును ఎదుర్కోవడానికి మానవ ఆరోగ్యం, పర్యావరణ శాస్త్రం, నీటి నిర్వహణను అనుసంధానిస్తూ 'వన్ హెల్త్' విధానాన్ని అనుసరించాలని పరిశోధకులు పిలుపునిచ్చారు. ఇన్ఫెక్షన్లు రాకముందే ప్రమాదాన్ని తగ్గించడానికి బలమైన పర్యవేక్షణ, మెరుగైన నిర్ధారణ పద్ధతులు, అధునాతన నీటి శుద్ధి సాంకేతికతలను అవలంబించాలని సూచించారు. "ఇది కేవలం వైద్య లేదా పర్యావరణ సమస్య కాదు. ఈ రెండింటినీ కలిపి చూస్తూ, ప్రజారోగ్యాన్ని మూలం నుంచే కాపాడే సమగ్ర పరిష్కారాలు అవసరం" అని లాంగ్‌ఫీ షూ స్పష్టం చేశారు.
🆕Current అప్‌డేట్స్📢 - (0 NEWS (0 NEWS - ShareChat

More like this