ఓం నమో భగవతే శ్రీ రమణాయ
మహర్షి చివర రోజులు అవి. చేతికి ఆపరేషన్ చేసి మహర్షిని ఒక గదిలో పడుకోపెట్టి ఎక్కడికీ కదలకూడదని, ఎవ్వరూ మహర్షిని ఇబ్బంది పెట్టకూడదని కాపలా కట్టుదిట్టం చేశారు ఆశ్రమంవారు.
మహర్షిని చూడాలని ఒకరోజు మిట్ట మధ్యాహ్నం ఎక్కడ నుంచో ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు ఆశ్రమం గేటు దగ్గర మహర్షి గురించి ఒకరిని అడిగారు. అతను మహర్షి పరిస్థితి చెప్పి, మహర్షి దర్శనాలు ఇప్పుడు లేవు అని చెప్పారు.
సాధువు :
నేను వెంటనే వెళ్ళిపోవాలి. మహర్షిని ఒకసారి దర్శనం చేసుకోవాలి.
ఆశ్రమం వారు :
వీలు లేదు.
సాధువు :
ఏది ఏమైనా సరే, మహర్షి దర్శనం అయితీరాలి.
ఆశ్రమం వారు :
ఈ పరిస్థితులలో వీలు కానేకాదు.
ఎక్కడో దూరంగా ఉన్న మహర్షికి ఈ సంభాషణ వినపడే ఆస్కారం లేదు. ఆ సాధువు వెళ్ళిపోక అక్కడే నిలుచుని కళ్ళు పెద్దవి చేసి, దూరం నుంచి మహర్షి పడుకున్న గది వంకే అలా చూస్తున్నారు.
ఇంతలో ఆనందంతో ఆ సాధువు కళ్ళు వెడల్పుగా తెరచుకున్నాయి. తటాలున మహర్షి గదిలో నుంచి వరండాలోకి వచ్చి ఆ సాధువుకి దర్శనం ఇచ్చారు. అట్లానే ఒకరు నొకరు కొంత సమయం చూసుకున్నారు.
అంతే; ఆ సాధువు వెళ్ళిపోయారు. మహర్షి కూడా తన గదిలోకి వెళ్లి పడుకొన్నారు. మరలా ఆ సాధువు ఎన్నడూ కనపడలేదు.
#రమణ మహర్షి #🕉️ శ్రీ భగవాన్ రమణ మహర్షి #🙏🏻భక్తి సమాచారం😲 #🔱హిందూ దేవుళ్ళు🙏🏻 #🙏🏻గురువారం భక్తి స్పెషల్

